Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేసవి వేడిలో తిండి పదార్థాల జాగ్రత్తలు...!

ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ భూమిలో ఉన్న తేమంతా ఆవిరైపోయినట్లే, ద్రవాలన్నీ ఆవిరైపోతూ శరీరమంతా పొడిబారిపోతుంది. తిరిగి శరీరం తేమగా మారడానికి నీటిని అధికంగా తీసుకుంటూ ఉండాలి. వృక్షాలకూ మనిషికీ ఎంతో తేడా ఉంది. భూమితో అంటిపెట్టుకుని ఉండడం వల్ల వృక్షాలు ఎలాగోలా అవసరమైన పోషకాలు, ద్రవాలన్నీ అందుకుంటూనే ఉంటుంది. మనిషి అలా భూమితో కలిసి ఉండకపోవడం వల్ల అతని శరీరంలోని ద్రవాలన్నీ ఆవిరైపోతూ ఉంటాయి.
అయితే వేసవిలో అంతా పొడిబారిపోతున్నా, తర్బూజా, కీరా లాంటి పళ్లల్లో నీరు ఉంటుంది. మామిడి పళ్లు తప్ప వేసవిలో వచ్చే అన్ని రకాల పండ్లను విరివిగా తీసుకోవాలి. పండ్లలో ఉండే ఈ నీరు శరీరాన్ని చల్లబరచడానికి బాగా తోడ్పడతాయి. గ్లూకోజ్ ఎక్కువగా ఉండడం వల్ల మామిడి పండ్లే వేడి చేస్తాయి. కానీ మామిడి కాయలు శరీరానికి చలువ చేస్తాయి. ఆ మాటకొస్తే ఎక్కువ శక్తి నిచ్చేవి ఏవైనా శరీరానికి వేడి చేస్తాయి. అందుకే మామిడి పండ్లను చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. అలాగే శరీర సంరక్షణ తో పాటు వేసవిలో చర్మం, జుట్టు విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం.
1. నిమ్మరసం వేసవి శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. నీటితో గానీ, మజ్జిగతో గానీ కలిపి తీసుకోవడం మేలు.
2. ద్రాక్షపండ్లు, ద్రాక్షరసం, తేనె కలిపిన నీళ్లు తాగవచ్చు. అలాగే పావు చెంచా మోతాదులో గంధం రసాన్ని నీళ్లలో కలుపుకుని తాగినా శరీరం చల్లబడుతుంది.
3. పెరుగుకు వేడి చేసే గుణం ఉంది. అందుకే ఒక భాగం పెరుగు, మూడు భాగాలు నీళ్లు కలిపి చిలికి మజ్జిగ చేసుకుని తాగడం మేలు.
4. ఉల్లిపాయలో సగభాగాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి మరగించి తాగితే శరీరం చల్లబడుతుంది. అవసరమైతే అందులో బెల్లం గానీ, చక్కెరగానీ కలిపి తీసుకోవచ్చు.
5. వేసవిలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి మాంసాహారం, చిక్కుడు దాన్యాలు తక్కువగా తీసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం వినియోగం బాగా తగ్గించాలి.
6. ఉసిరికాయ పొడిని ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా నీళ్లలో కలుపుకుని తాగితే చలువ చేస్తుంది.
7. ఎండు ద్రాక్ష, క ర్బూజాలు శరీరానికి మేలు చేస్తాయి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే వడదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉండదు.



Click it and Unblock the Notifications