Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
మంచి నిద్రతో ఆరోగ్యం.... అందం...

1. రోజంతా లైట్ల వెలుతురులోనే గడిపితే స్లీపింగ్ ప్యాటర్న్ లో తేడాలు వస్తాయి. కృత్రిమకాంతి కంటికి, ఒంటికి ఒత్తిడిని కలుగజేస్తుంది. అందుకని పగటిపూట ముప్పై నిముషాలైనా సూర్యకాంతి ఒంటికి తగలనివ్వాలి.
2. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం వల్ల శరీరం నిద్రా సమయాలకు చక్కగా అలవాటు పడిపోతుంది.
3. రోజూ ఒకే సమయానికి బోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు హెచ్చుతగ్గులు కాకుండా ఉంటాయి. అందుకని రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందుగా భోజనం చేయాలి. దీని వల్ల అజీర్తి సమస్యలు తలెత్తవు. అలాగే ఆకలితో పడుకోకూడదు. తేలికగా జీర్ణం అమ్యే ఆహారం లేదా ఒక అరటిపండు లేదా రైస్ కేక్స్ లాంటివి తీసుకోవాలి.
4. వ్యాయామం చక్కని నిద్రకు సహకరిస్తుంది. అందుకోసం రాత్రి పడుకోవడానికి మూడు గంటల ముందు ఏరోబిక్ ఎక్సర్ సైజులు చేయాలి.
5. కెఫిన్, నికోటిన్ రెండూ ప్రేరకాలు. పగలు తీసుకునే కెఫిన్ రాత్రి నిద్రపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకని పొగతాగడాన్ని, అమితంగా కాఫీ, టీలు సేవించడాన్ని ఆపివేయాలి.
6. రాత్రి సమయాల్లో మద్యాన్ని తీసుకోకూడదు. మద్యం మగతను తెప్పిస్తుందే తప్ప గాఢమైన నిద్రను కలిగించదు.
7. హాయిగొలిపే నిద్రకు గది వాతావరణం కీలకం. బెడ్ రూమ్ వెచ్చగా ప్రశాతంగా ఉండటమే కాకుండా, చిరు చీకటిగా ఉండేలా జాగ్రత్తపడాలి.
8. బెడ్ రూమ్ అనేది కేవలం నిద్రించడానికి, శృగారిచడానికి మాత్రమే పరిమితం చేయాలి. మిగతా ఆందోళనలేమీ బెడ్ రూమ్ లోకి తీసుకురాకూడదు.
9. పడుకునే ముందు టీవీ చూడండి. అయితే ఉద్రేకం కలిగించే కార్యక్రమాలను చూడకూడదు. పడుకునే ముందు పుస్తకపఠనం ఉపయోగపడుతుందని చాలామంది అంటారు. అయితే ఉద్రేకం కలిగించే పుస్తకాలను చదవకూడదు.
10 సాయంకాలం తగినంత విశ్రాంతిని పొందాలి. కాసేపు టీవి చూడ్డం. ప్రశఆంతతను కలిగించేనూనెలు రాసుకొని గోరువెచ్చని నూనెలో రాసుకొని గోరువెచ్చని నూనెతో స్నానం చేయడం, పడుకోవడానికి ముందు వేడివేడి పాలు తాగడం వంటివి మానేయాలి.
11. బెడ్ మీదకు చేరిన వెంటనే లైట్ ఆర్పేసి పడుకోకూడదు. ఒక అరగంటపాటు బెడ్ మీద కూర్చోవడం, లేవడం, పుస్తకాలు చదవడం, చక్కని సంగీతం వినడం వంటివి చేస్తే కంటి మీదకు కునుకు రెక్కలు కట్టుకొని వాలుతుంది.
12. నిద్ర పోయే సమయంలో మొబైల్ ఫోన్‌ను దూరంగా ఉంచడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం మంచిది.
13. పడుకునే ముందు గోరు వెచ్చని పాలను తాగితే గాఢ నిద్ర పడుతుంది. నూనెతో తలకు, కాళ్లకు మర్దనా చేస్తే మంచి నిద్ర వస్తుంది.



Click it and Unblock the Notifications
