Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మహిళలు తీసుకోవాల్సిన ప్రధాన ఆహారాలు...

1. కెరొటినాయిడ్స్: పసుపు, ఎరుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయల్లో కెరొటినాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరూ పదార్థాలను ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. మహిళలు వీటిని తీసుకుంటే రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ అవకాశాలు తగ్గుతాయి.
2. కాలిఫ్లవర్: స్త్రీలకు అతి ముఖ్యమైన విటమిన్ B కాలీప్లవర్ ద్వారా పుష్కలంగా లభిస్తుంది. గర్బిణీ స్త్రీలయితే ఖచ్చితంగా కాలిఫ్లవర్ తీస్కోగలిగితే వాళ్లకు డెలివరీ టైమ్ లో కావలసిన శక్తి లభిస్తుంది. అంతే కాకుండా కాలిఫ్లవర్ లో విటమిన్ C – కాల్షియమ్ కూడా లభిస్తాయి. ఇందులో ఫ్యాట్ కంటెంట్ 0. కాలిఫ్లవర్ ను ప్రతి రోజూ తీసుకోవాలి.
3. క్యారెట్స్: Aవిటమిన్ పుష్కలంగా ఉండే క్యారెట్ చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగపడుతుంది. అంతే కాదు బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడే స్త్రీలు క్యారెట్ ను ఎక్కువగా తీసుకొంటే మంచిది
4. బీన్స్: బీన్స్ ను తీస్కోవడం ద్వారా గుండె పని తీరు బాగుంటుంది. అంతే కాకుండా ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది.
5. పాలు: కాల్షియంకి మారుపేరు పాలు. పాలలో విటిమిన్ డి కూడా ఎక్కువగానే ఉంటుంది. మహిళల్లో సర్వసాధారణంగా కనిపించే ఆస్టియో ఆర్థరైటిస్ అవకాశాన్ని తగ్గించడంలో పాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పిఎంఎస్ సమస్య కూడా తగ్గుతుంది.
6. ఓట్స్: బిపి నుంచి మధుమేహం దాకా మంచి మందులా పనిచేసే ఓట్స్ గర్భిణి స్త్రీలకు మరింత మేలు చేస్తాయి. గర్భిణులు వీటిని తీసుకోవడం వల్ల పుట్టే శిశువుకు జన్యులోపాలు కలిగే అవకాశం చాలా తక్కువ.
7. అవిసె గింజలు: ఈ గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉండి గుండెకు బలాన్ని చేకూరుస్తాయి. ఇందులో పీచు పదార్థము కూడా లభిస్తుంది. ఈ గింజలను ప్రతి రోజు ఉదయం పూట తీస్కుంటే ఇక అలసట అనేది కనపడదు.
8. చేపలు: వీటిలోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు డిప్రెషన్ నుంచి గుండెజబ్బుల దాకా అన్నింటినీ నివారించగలవు. మహిళల్లో హార్మోన్ల ప్రభావం వల్ల మూడ్ స్వింగ్స్ ఎక్కువ. కాబట్టి ఇవి వాళ్లకి మంచి మందు.
9. టొమాటో: వీటిలోని లైకోపీన్ రొమ్ముక్యాన్సర్‌ను నివారిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. గుండెజబ్బుల రిస్కూ తగ్గుతుంది.
10. తోటకూర: దీనిలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. దీనిలోని మెగ్నీషియం ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ (పిఎంఎస్) సమస్యను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications
