Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దుర్వాసనకు దూరంగా..అందానికి, ఆరోగ్యానికి దగ్గరగా...!

1. యాంటీ బ్యాక్టీరియా సబ్బుతో స్నానం చేస్తే ఎలాంటి బెడదా ఉండదు అనుకుంటారు కానీ ప్రతిరోజూ ఇలాంటి సబ్బుతో స్నానం చేస్తే శరీరంపై ఉన్న క్రిములను తొలగించడం కష్ట మవుతుంది. దీనివల్ల ఒంటిపై దుమ్ము పేరుకుపోయి చర్మానికి నల్లనిరంగు వస్తుంది. కనుక యాంటీ బ్యాక్టీరియా సబ్బుల వాడకాన్ని చాలా వరకు తగ్గించాలి.
2. కూల్ కూల్ గా : శరీరమంతా స్వేదరంధ్రాలు ఉంటాయి కాబట్టి మనం తాగిన నీరు చెమట రూపంలో విడుదలవుతూనే ఉంటుంది. పెదవులు, జననాంగాల్లో తప్పించి మిగతా భాగమంతా శ్వేదరంధ్రాలుంటాయి. సాధారణంగా చెమట పట్టడం అంటే శరీరం తనని తాను చల్లబరుచుకోవడమే. కాని అధిక మొత్తంలో చెమట విడుదలవుతే శరీరంలో నీరు తగ్గిపోతుంది. నీరుతగ్గిపోయినప్పుడే మనలో చికాకు మొదవలవుతుంది. కాబట్టి ప్రతి గంటకి తప్పనిసరిగా నీరు తీసుకోవడం మరవకూడదు. అప్పుడు శరీరమే కాదు మనసూ చల్లబడుతుంది. నీరు కేవలం చల్లదనాన్నే కాదు ఆరోగ్యాన్నీ ఇస్తుంది.
3. ఆహారం: సాధారణ స్వేదం కంటే ఎక్కువగా ఉన్నా, దుర్వాసన ఆహారపదార్థాలు కనుక కారణం అవుతుంటే అంటువంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. కెఫైన్ ఉండే పదార్థాల్ని, ఘాటైన వాసన ఉండే వెల్లుల్లి, ఉల్లిని తినడం తగ్గించాలి.
4. కాఫీ, టీలను తాగడం తగ్గించాలి. సాధారణంగా చెమట దుర్గందాన్ని వెద జల్లుతుందనుకుంటారు. కానీ శరీరం మీద ఉన్న బ్యాక్టీరియాతో స్వేదం చేరినప్పుడు వాసన వస్తుంది. కాబట్టి శరీరం మడతల్లో పౌడర్లు, డియోడ్రెంట్లు ఉపయోగిస్తుండాలి. వీటిని పాటించడంతో పాటు ఆకుకూరలు, సలాడ్స్ అధికంగా తీసుకుంటూ ఉండాలి. ప్రతీరోజూ రెండుసార్లు స్నానం చేయడంతో పాటు వీలనైన్ని సార్లు ముఖాన్ని చేతులు, మెడని చల్లని నీటితో కడుక్కుంటూ ఉండాలి.
5. దుస్తులు: వీలైనంతవరుకు కాటన్ వస్త్రాలనే ధరించాలి. స్వేదా న్ని పీల్చని, ఎక్కువ చెమటకు కారణమయ్యే సిల్కు దుస్తులకు దూరంగా ఉండాలి.
6. షూస్: లెదర్‌వంటి సహజ సిద్ధ మైన మెటీరియల్స్‌తో తయారు చేసే షూస్‌ని, ఇతర పాదరక్షలు ధరించడం వల్ల పాదాల్లో చెమట తగ్గుతుంది. షూస్‌లోని చెమట రాత్రికి రాత్రి ఆరిపోయే అవకాశం ఉండదు. మళ్లీ తెల్లారగానే వాటిని ధరిస్తే దుర్వాసన ఎక్కువవుతుంది. కాటన్, ఊల్ సాక్స్ పాదాల్ని పొడిగా ఉంచుతాయి. ఇవి తేమను పీల్చే గుణాన్ని కలిగి ఉంటాయి. వ్యా యామం చేసే సమయంలో ఎధ్లెటిక్స్ సాక్స్ బాగా పనిచేస్తాయి. వీటిని ఏ రోజు ధరించినవి ఆరోజు శుభ్రంచేసుకుని మళ్లీ వాడాలి.
7. స్నానం చేసే ముందు నీటిలో ఒక నిమ్మకాయ పిండుకుని స్నానం చేస్తే ఆ రోజంతా తాజాగా ఉంటుంది. స్నానం తర్వాత పాదాల్ని శుభ్రంగా తుడుచుకోవాలి. సూక్ష్మక్రిములు వేళ్ల సందుల నడుమ జీవిస్తుంటాయి. స్వేదాన్ని పీల్చగలిగిన ఫుడ్ పౌడర్స్ ని ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.
8. పడుకునే ముందు స్వేదం ఎక్కువగా అలుముకునే అరచేతులు, పాదాల్లో యాంటీ పరిస్పిరెంట్స్ రాసుకుంటూ ఉండాలి. డియోడరెంట్స్‌ను ఉపయోగించేవారు ఎక్కువ సేపు తాజాగా ఉంచే వాటిని కొనుక్కోండి. అయితే వీటి ఘాడత తక్కువగా ఉండాలి.
9. యోగా, ధ్యానం వంటి విశ్రాంతి ఇచ్చే విధానాలను పాటించాలి. వీటివల్ల ఒత్తిడిని నియంత్రించుకునే అవకాశం కలుగుతుంది.
10. ఇవన్నీ కేవలం మనిషిని తాజాగా ఉంచడమే కాదు అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ ఉపయోగపడుతాయి.



Click it and Unblock the Notifications