For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సమ్మర్ లో మీకు నచ్చే..మీరు మెచ్చే సౌకర్యవంతమైన దుస్తులు..!

|

సాధారణంగా వేసవిలో అధికంగా ఎండ, వాతావరణంలో అధిక వేడి, చెమటలు మనల్ని మహా చిరాకు పెట్టేస్తాయి. వేసవి వేడి నుండి ఉపశమనం పొందడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం. సౌకర్యవంతంగా ఉండే దుస్తులను ధరిస్తాం. ఇండియా ఒక ఉష్ణమండల ప్రదేశం మరియు వేసవిలో ఎండలు మరీ ఎక్కువగాఉంటాయి. అందుకు ఇండియాలో నివసించే మహిళలకు సమ్మర్ క్లోత్స్ చాలా వసరం. మహిళలు సమ్మర్ లో ధరించే దుస్తులు ఫాషన్ గాను మరియు సౌకర్యవంతంగాను ఉండాలి. ముఖ్యంగా సమ్మర్ లో మహిళలకు కాటన్ దుస్తులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సమ్మర్ లో సౌకర్యవంతంగా మరియు చల్లదనాన్ని ఇస్తాయి కాబట్టి ఇండియాలో నేచే కాటన్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది.

ఇండియాలో తయారు చేసే కాటన్ దుస్తులకు ఉపయోగించి పత్తి చాలా రకాలుగా ఉన్నాయి. ఇవి సమ్మర్ లో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఉదాహరణకు మహిళలకు సమ్మర్ ధరించే దుస్తులకు ఖాదీ అద్భుతమైన మెటీరియల్. ఖాదీతో తయారు చేసే చీరలు, సల్వార్ కమీజ్ మరియు షర్ట్ సమ్మర్ లో చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సమ్మర్ లో అధిక వేడికి వదులుగా ఉండే దుస్తులు ధరించడం చాలా సౌకర్యవంతం. శరీరానికి హత్తుకొనే జీన్స్, టైట్ ప్యంట్స్ వంటివి సమ్మర్ వాతావరణానికి ఎంత మాత్రం సరిపడవు. కాబట్టి సమ్మర్ లో వదులు గా ఉండే లూజ్ ప్యాంట్స్ మరియు జోధ్ పురి ప్యాంట్స్ ధరించడం వల్ల కాళ్ళకు చల్లదనంతో పాటు, గాలి బాగా తగులుతుంది.

సమ్మర్ ఫ్యాషన్ ఎప్పుడూ చాలా వైబ్రాంట్ గా మరియు బ్రైట్ గా ఉంటుంది. కాబట్టి సమ్మర్ లో మీకు సౌకర్యవంతం మరియు ఫ్యాషన్ టచ్ ఇచ్చే దుస్తులను ఎంపిక చేసుకోండి.

సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

హాట్ ప్యాంట్స్: సమ్మర్ లో హాట్ ప్యాంట్స్ ధరించడం చాలా సౌకర్యవంతంగా ఉంటాయంటారు కొందరు. సాధారణంగా ఇవి చాలా సులవుగా మరియుసాగే గుణం కలిగి ఉంటాయి. సమ్మర్ లో మీరు వీటిని టీషర్ట్స్ మరియు షర్ట్స్ మీదకు వేసుకోవచ్చు.

సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

కాటన్ చీరలు: వేసవిలో చాలా సౌకర్యవంతంగా శరీరానికి చల్లదనాన్ని కల్పించేవాటిలో మహిళలకు చీరలకంటే సౌకర్యవంతం మరొకటి లేదంటే నమ్మండి.

సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

లాంగ్ స్కర్ట్స్: వేసవికాలంలో మీ కాళ్ళను సౌకర్యవంతంగా గాలితోలే విధంగా ఉండేవి లాంగ్ స్కర్ట్స్. వీటిని ధరించడం వల్ల మీకు ప్రశాంతంగా ఉంటుంది. అదిక వేడి అనిపించదు. లాంగ్ స్కర్ట్స్ మీదకు మీరు తప్పని సరిగా కాటన్ స్కర్ట్స్ ను ఎంపిక చేసుకుంటే చాలా బాగుంటుంది.

సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

వదులైన ప్యాంటు(loose trousers): ఈ రోజులో ఇవి చాలా ఫాషనబుల్ గా ధరిస్తున్నారు. అయితే ఇవి ధరించడం ఫాషన్ మాత్రమే కాదు, సమ్మర్ లో సౌకర్యవంతం కూడా అంటున్నారు. ఈ ఫార్మల్ సమ్మర్ ప్యాంట్స్ మీదకు మీకు నప్పే షర్ట్స్ లేదా బ్లౌజ్ లు ధరించవచ్చు.

సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

కాటన్ డ్రెస్: వేసవిలో కాటన్ దుస్తులు ఇచ్చేటంత సౌకర్యం మరే దుస్తులు కల్పించవు. మీరు ఈ సమ్మర్ లో వదులుగా ఉండే ఫుల్ స్లీవ్స్ ధరించడం వల్ల ఫాషనబుల్ గాను మరియు సూర్యరశ్మినుండి రక్షణ పొందవచ్చు.

సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

సల్వార్ కమీజ్: లూజ్ ఫిట్టింగ్ సల్వార్ కమీజ్ అద్భుతమైన దుస్తులు. ఇవి కూడా చీరల్లాగానే, సమ్మర్ లో ధరించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

ఇండియన్ గౌన్స్: భారతీయ శైలీలో వివిధ రంగుల్లో..వివిధ మోడల్స్ లో సమ్మరంతా చాలా బ్రౌట్ గా ఉంచుతాయి. ఇక్కడ రామ్ వాక్ చేస్తున్న కరిష్మాకపూర్ ధరించిన కాటన్ గౌన్ అద్బుతంగా లేస్ వర్క్ తోటి ఆకర్షనీయంగా కనబడుతోంది. ఇలాంటి ఔట్ ఫిట్స్ సమ్మర్ లో ధరించడాని ఫర్ఫెక్ట్.

సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

చిన్న డ్రెస్సులు: సమ్మర్ లో ఇటువంటి చిట్టిపొట్టి దుస్తులు ధరించడం మంటే చాలా మందికి మహా సరదా.. అంతే కాదు, ఇలా సింగిల్ షోల్డర్ దుస్తులు సమ్మర్ లో ఫాషన్ గాను మరియు సౌకర్యవంతంగాను ఉంటాయి.

సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

స్కర్ట్ మరియు బికిని టాప్: గ్రేట్ సమ్మర్ క్లోత్ కాటన్ లాంగ్ స్కర్ట్ మీదకు బికిటీ టాప్ వేస్తే ఈ హాట్ సమ్మర్ లో మీరు కూడా హాట్ హాట్ గా.. కనబడుతారు.

సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

ఖాదీ: ఖాదీ లో కూడా ముతక నూలు చాలా ప్రత్యేకమైన రకం. ఇది సమ్మర్ లో ధరించడానికి సౌకర్యం మాత్రమే కాదు, చాలా ఫాష్యన్ గా కూడా ఉంటుది. మరీ ఈ సమ్మర్ లో ఖాదీతో నేచిన చీరలు, కుర్దాలు, స్కర్ట్స్ మరియు టాప్స్ ధరిస్తే చాలా బాగుంటాయి.

సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

హారెమ్ ప్యాంట్స్: హారెమ్ ప్యాంట్స్ మరియు దోతి ప్యాంట్స్ ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి. ఈ హాట్ వెదర్ కు సూట్ అయ్యేలా వదులుగా స్టిచ్ చేయబడి ఉంటాయి.

English summary

Comfortable Clothes For The Indian Summer | సమ్మర్ లో మీకు నచ్చేవి...మీరు మెచ్చేవి...?

If you have felt the heat of India then you would know why you need comfortable clothes in summer. India is a tropical country and the mercury rises to scorching degrees here in summer. That is why the summer clothes for women in India need to be fashionable as well as wearable. First of all, cotton clothes are most comfortable in summer. Indian cotton is famous worldwide for its capacity to keep you cool.
Story first published: Saturday, March 30, 2013, 14:58 [IST]
Desktop Bottom Promotion