Latest Updates
-
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్!
అందంగా కనబడుటకు అనుసరించాల్సిన 15 టిప్స్&ట్రిక్స్
ఈ మోడ్రన్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము అందంగా కనబడాలనే కోరిక కలిగి ఉంటారు. అయితే యవ్వనంగా, అందంగా ఉండాలంటే, సరైన ఆహారం తీసుకోవాలి. సరైన టైమ్ కు నిద్రపోవాలి. రెగ్యులర్ వ్యాయామం ఉండాలి. అప్పుడే యవ్వనంగా కనబడుతారు. అందంగా కనబడాలంటే , శరీర ఆరోగ్యంతో పాటు, చర్మ ఆరోగ్యానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అవసరం అవుతాయి. అలా మంచి ఆహారం తీసుకొన్నప్పుడే, వయస్సు మీద పడకుండా డెడ్ స్కిన్ సెల్స్ ను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ప్రోషకాహారానికి ఉంది. న్యూట్రీషియన్ ఉన్న ఆహారం కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. కణాలకు తగిన శక్తిని అందిస్తుంది.
ప్రొసెస్ చేసిన ఆహారాలు, స్ట్రెస్, టాక్సిన్స్, మరియు తక్కువ న్యూట్రీషియన్స్ కలిగిన ఆహారాల వల్ల వయస్సు మీద మాత్రమే కాదు, చర్మం మీద, ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపెడుతుంది. ప్రతి రోజూ తగినంత నిద్రను పొందడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే హానికరమైన రసాయనాల నుండి విముక్తి పొందవచ్చు. శరీరానికి తగినతంత విశ్రాంతి పొందవచ్చు. మరియు రెగ్యులర్ వ్యాయామం వల్ల ఆరోగ్యకరమైన చర్మం , కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలా ఉండటానికి మరికొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

ఎక్కువ నీళ్ళు త్రాగాలి:
కొద్దిపాటి డీహైడ్రేషన్ ఉన్నా , శరీరంలో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. తక్షణం మీరు రీ డీహైడ్రేట్ అవ్వాల్సి వస్తుంది. డీహైడ్రేషన్ మీ చర్మం మీద ప్రభావం చూపుతుంది. దాంతో మీ ముఖం చూడటానికి డల్ గా, పాలిపోయినట్లు, సాగినట్లు, వదులుగా కనబడుతుంది.

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తినాలి:
వ్యాధులను ఎదుర్కోవడానికి, వయస్సు పైబడకుండా స్కిన్ డ్యామేజ్ ఎదుర్కోవడానికి, ఇన్ల్ఫమేషన్ తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇన్ఫ్లమేషన్ వల్ల చర్మం మీద ముడుతలు ఏర్పడుతాయి. అందుకే కొన్ని బెస్ట్ యాంటీఆక్సిడెంట్స్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

రైబో కలర్ కలిగిన ఆహారాలను ఒక ప్లేట్ తీసుకోవాలి:
మన శరీరంలో ఫ్రీరాడికల్స్ ఏర్పడుతాయి. ఇవి మన శరీరంలో కణజాల నిర్మాణంను డ్యామేజ్ చేస్తాయి. అందుకు కొంచెం డిఫరెంట్ న్యూట్రీషియన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. వివిధ రకాల ఫ్రీరాడికల్స్ తో పోరాడటానికి వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ ఫుడ్స్ ను తీసుకోవాలి. మరి ఆలోచించి, మంచి ఆంటీయాక్సిడెంట్స్ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోండి .

ఆర్గానిక్ ఫుడ్స్ :
ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఏజింగ్ టాక్సిన్స్ ను నివారిస్తుంది.

ఎండలో తిరగడం పరిమితం చేయాలి:
ఉదయం సూర్యరశ్మిలో కొద్ది సమయం ఉండటం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది మరియు కొన్ని ప్రయోజనాలున్నాయి. అయితే ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం డ్యామేజ్ అవుతుంది . బయట వెళ్ళేటప్పుడు కళ్ళను సన్ గ్లాస్ ధరించడం మర్చిపోకండి. మరియు జింక్ లేదా టైటానియండయాక్సైడ్ కలిగినటువంటి సన్ స్క్రీన్ వాడాలి.

నేచురల్ స్కిన్ ప్రోడక్ట్స్ ను ఎంపిక చేసుకోవాలి
చాలా వరకూ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో చర్మానికి హాని చేసే కెమికల్స్ ఉంటాయి. మాయిశ్చరైజర్ లేదా మేకప్ ను ఎంపిక చేసుకొనే ముందు, వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అవి మీ చర్మానికి సూట్ అవుతాయో లేదో తెలుసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

నాన్ టాక్సిక్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ను ఉపయోగించాలి:
టాక్సిక్ కెమికల్స్ కలిగిన వాటిని చాలా వరకూ పరిమితం చేసి నాన్ టాక్సిక్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ను మాత్రమే ఉపయోగించాలి . ఎందుకంటే ఇవి చర్మంలో షోషింపబడుతాయి.

ఇంటి వాతావరణంలో ని మొక్కలు :
అవుట్ డోర్ మొక్కల కంటే ఇండోర్ మొక్కలత కాలుష్యం యొక్క స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇంట్లో కానీ, మీరు పనిచేసే చోట కానీ, ఎయిర్ ఫిల్టర్ చాలా అవసరం.

విటమిన్ సి తగినంత తీసుకోవాలి:
మీ రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి తగినంత తీసుకోవడం వల్ల ముడతలు మాయం అవుతాయి. ఎందుకంటే, సూర్యరశ్మివల్ల కోల్పోయిన విటమిన్ సి, విటమిన్ సి ఫుడ్స్ తీసుకోవడం వల్ల మరింత ఎక్కువ కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది.

పంచదారను నివారించాలి
చర్మంను కాంతివంతంగా మార్చే కొల్లాజెన్ ఉత్పత్తిని మరియు ఎలాసిటిని తగ్గించేస్తుంది. దాంతో ముడుతలకు కారణం అవుతుంది.

హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి:
హెల్తీ ఫ్యాట్స్ అంటే, అవొకాడో, ఆలివ్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, మరియు ఫిష్ వంటి హెల్తీ డైట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం. ఈ ఫ్యాటీ యాసిడ్స్ మన చర్మానికి చాలా అవసరం అవుతుంది. మరియు వీటి వల్ల చర్మం ఎల్లప్పుడు యవ్వనంగా ఉంటుంది.

మీ శరీరాన్ని శుభ్రపరుస్తుంది:
కాలుష్యం, నీళ్ళు, గాలి మరియు ఆహారం వల్ల శరీరంలో ఏర్పడే టాక్సిన్స్ వల్ల శరీరం మరియు అదే విధంగా వయస్సు మీద ప్రభావం చూపుతుంది . కాబట్టి, మీ శరీరాన్ని ఎప్పటికప్పుడు డిటాక్సిఫై చేసుకోవడం చాలా వసరం. అందుకు ఎక్కువ నీరు, జ్యూసులు వంటివి తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం సమయంలో గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని త్రాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగింపబడుతాయి.

ఒత్తిడిని తొలగించే పనులతో ఎప్పుడూ బిజీగా ఉండాలి:
ఎక్కువ స్థాయి ఒత్తిడి మీ చర్మంతో రాజీపడుతుంది. అందుకే యోగ లేదా మెడిటేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీకు సమస్యలు స్రుష్టించే వారికి దూరంగా ఉండి, మీకు నచ్చిన పనులను చేసుకోవాలి. మీకు చాలా నమ్మకం ఉన్న స్నేహితులతో మీ కష్టసుఖాలను, బాధలను పంచుకోవాలి.

నిద్ర:
రోజూ సరిపడా నిద్రపొందడం వల్ల ఇది చర్మంను కాంతివంతంగా మార్చుతుంది మరియు డ్యామేజ్ స్కిన్ నునివారిస్తుంది. కనీసం రోజుకు 8 గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి, చర్మంకు చాలా మేలు చేస్తుంది.

వ్యాయామం:
ప్రతి రోజూ రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా శరీరం బాగాలకు ఆక్సిజన్ మరియు న్యూట్రీషియన్స్ బాగా అందుతాయి. మరియు చెమట రూపంలో టాక్సిన్స్ విడుదల చేస్తుంది. చర్మానికి మంచి కాంతిని అందిస్తుంది . నవ్వు మీ అందం యొక్క విలువను పెంచుతుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతుండటమే మీ ముఖానికి ఒక మంచి వ్యాయామం.



Click it and Unblock the Notifications











