Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
బ్రెస్ట్ స్ట్రెచ్ మార్క్స్(రొమ్ముల మీద ఛారలు)నివారణ చిట్కాలు
సహజంగా లావెక్కే క్రమంలో చర్మం తన ఎలాస్టిసిటీ కోల్పోయినప్పుడు చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ పడతాయి. (ముఖ్యంగా గర్భవతుల ... అయితే ఒకసారి చర్మంపై పడ్డ స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా తగ్గిండము కష్టము ..ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్... మొదటి దశలో పర్పుల్, పింక్ కలర్‌లో కన్పిస్తాయి.చివరకు తెల్లగా మారుతాయి. నిర్లక్ష్యం చేస్తే మరింతగా ఇబ్బందిపెడతాయి. సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో.. పొట్ట తొడలు, ఛాతీభాగాలలో ఈ మచ్చలు ఏర్పడతాయి.సాగిన గుర్తులు చర్మంపై ఏ ప్రదేశంలోనైనా ఏర్పడవచ్చు, అయితే అవి ఎక్కువగా కొవ్వు నిల్వ అధికంగా ఉండే భాగాలలో కనిపిస్తాయి. ఉదరం (ప్రత్యేకించి నాభి సమీపంలోని ప్రాంతం), రొమ్ములు, భుజముల పైన, భుజాల క్రింద, వీపు, తొడలు (లోపలి మరియు బయటి ప్రాంతాలు రెండూ), తొంటి, మరియు పిరుదులు అత్యంత సాధారణంగా వ్యాపించే ప్రదేశాలు. వాటి కారణంగా లేదా వాటితో ఆరోగ్యానికి ఏ విధమైన హాని ఉండదు, మరియు సాధారణంగా పనిచేసి, బాగుచేసుకొనే శరీర సామర్ధ్యానికి హాని కలిగించవు.
ఈ స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవడం కోసం చాలా మంది లేజర్ చికిత్స చేయించుకుంటారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవడం చాలా కష్టం అవుతుంది. స్ట్రెచ్ మార్క్స్ చూడటానికి చలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు ఎఫెక్టివ్ ఆయిల్స్ మర్ధన చేయడం లేదా ఖర్చుతో కూడిన లేజర్ చికిత్స తీసుకోవల్సి ఉంటుంది. కానీ, స్ట్రెచ్ మార్క్స్ నివారించుటకు హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ గా పనిచేస్తాయి.
కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బంది పడుతున్న మహిళల్లో మీరూ ఒకరైతే, మరి ఇక్కడ కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఉన్ని. ఇవి బ్రెస్ట్ స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ నడుము, కాళ్ళు మీద మాత్రమే కాదు, బ్రెస్ట్(రొమ్ముల)మీద కూడా ఏర్పడి, చూడటానికి ఇబ్బందికరంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు మాత్రమే స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బంది పడరు, అధిక బరువు ఉన్నావారు కూడా స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బంది పడుతారు. అలాగే బ్రెస్ట్ పెరగడం లేదా తగ్గడం వల్ల కూడా స్ట్రెచ్ మార్క్స్ సాధారణ మహిళల్లో కూడా ఏర్పడుతాయి. కాబట్టి మీరు ఎటువంటి స్ట్రెచ్ మార్క్స్ లేని, అందమైన బూబ్స్ కలిగి ఉండాలంటే ఈ నేచురల్ రెమెడీస్ ను ప్రయత్నించండి..

నేచురల్ ఆయిల్స్
నేచురల్ ఆయిల్స్ అంటే ఆలివ్ ఆయిల్, జోజోబ ఆయిల్, బాదం ఆయిల్ మరియు రోజ్మెరీ ఆయిల్ వంటివి చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీస్. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తాయి. మీరు రెగ్యులర్ గా ప్రతి రోజూ స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో మసాజ్ చేయడం వల్ల ఆ చారలు కనబడకుండా పోతాయి .

బంగాళదుంప జ్యూస్
బంగాళదుంప జ్యూస్ లో అవసరం అయ్యే విటమన్స్ మరియు మినిరల్స్ ఉంటాయి. ఇవి చర్మం కణాల వృద్ధి మరియు పునరుద్ధరణ పెంచుతుంది. కాబట్టి, బంగాళదుంప రాసాన్ని రోజుకు రెండు సార్లు, ఛాతీకి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా జెల్
అలోవెర(కలబంద)రసం ఒక చర్మ సంరక్షణకు అద్భుతమైన వస్తువు. ఎటువంటి స్కార్స్ అయినా సరే ఈ జెల్ మాయం చేస్తుంది. అందమైన చర్మాన్ని అంధిస్తుంది. కాబట్టి, ప్రతి రోజూ అలోవెరా జెల్ ను రోజుకు రెండు సార్లు అప్లై చేసి మాసాజ్ చేయండి. అలోవెరా జెల్ ను స్నానం చేయడానికి ముందు మరియు రాత్రి నిద్రించే ముందు అప్లై చేయవచ్చు.

నువ్వుల నూనె
బ్రెస్ట్ స్కార్స్ నివారించడానికి, చారలు మాయం చేయడానికి నువ్వుల నూనె అద్భుతంగా సహాయపడుతుంది. కాబట్టి, స్కార్స్ ఉన్న ప్రదేశంలో నువ్వుల నూనెతో మసాజ్ రెగ్యులర్ గా చేయండి.

నిమ్మరసం
ఇది నేచురల్ ఎసిడిక్ ఏజెంట్. ఇది స్ట్రెచ్ మార్క్స్ ను లైట్ చేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కాబట్టి, చర్మానికి నిమ్మరసం అప్లై చేసి స్ట్రెచ్ మార్క్స్ ను నేచురల్ గా తొలగించుకోండి.

కోకో బట్టర్
నేచురల్ ఆయిల్స్ తో కోకో బటర్ ను నేచురల్ ఆయిల్ వీట్ జెర్మ్ ఆయిల్ తో మిక్స్ చే ఛాతీ మీద మసాజ్ చేయడం వల్ల ఇది మంచి ఫలితం ఉంటుంది.

ఎగ్ వైట్
ఎగ్ వైట్ లో ప్రోటీనుల మరియు అవసరం అయ్యే విటమిన్లు ఉన్నాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి, ఎగ్ వైట్ ను చారలమీ అప్లై చేసి ఎండిన తర్వాత ఆలివ్ ఆయిల్ మసాజ్ చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications











