జింజర్లో కూడా అమేజింగ్ బ్యూటీ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి..

అల్లం నేచురల్ ఔషదం . అల్లంలో ఆరోగ్యానికి సహాయపడే ఔషధగుణాలు మాత్రమే కాదు, అనేక బ్యూటీ సీక్రెట్స్ కూడా దాగి ఉన్నాయి .బ్యూటీ విషయంలో అల్లంను వివిధ రకాలుగా ఉపయోగించుకోవచ్చు. జింజర్ బాడీ స్ర్కబ్ వల్ల సెల్యులైట్ తగ్గించుకోవచ్చు. జింజ్ బాత్ మరియు జింజర్ ప్యాక్ ఉపయోగించి చర్మం మీద స్కార్స్ ను తొలగించుకోచ్చు . అదే విధంగా మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

అల్లం సర్వరోగ నివారిణి: అల్లంలో టాప్ 10 మిరాకిల్ బెనిఫిట్స్

అల్లం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించుకోవచ్చు. జింజర్ ఫూట్ సోక్ వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగించుకోవచ్చు. అదేకాకుండా ఈ వింటర్ సీజన్లో జింజర్ బాత్ మన శరీరాన్ని వెచ్చగా ఉంచెతుంది. చలినుండి ఉపశమనం కలిగిస్తుంది . అల్లంలోని అనేక బ్యూటీ బెనిఫిట్స్ ను ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగినది . కాబట్టి, వీటిని బ్యూటీ కోసం ఏవిధంగా ఉపయోగించుకోవాలలో తెలుసకోండి.

జింజర్ జ్యూస్(అల్లం రసం)లోని గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

అందం మెరుగుపరుచుకోవడం కోసం అల్లంను ఉపయోగించడం చాలా సులభం. అల్లంను ఇతర నేచురల్ పదార్థాలతో మిక్స్ చేసి ఉపయోగించడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు. మరి అల్లంను బ్యూటీ కోసం ఏవిధంగా ఉపయోగించాలో చూద్దాం....

మస్టర్డ్ మరియు జింజర్ ఫూట్ సోక్ :

మస్టర్డ్ మరియు జింజర్ ఫూట్ సోక్ :

పాదాలను ఈ నీటిలో నానబెట్టడం వల్ల పాదాలనుశుభ్రపరచడంతో పాటు డిస్ట్రెస్సింగ్ ప్రొసెస్ లక్షణాలు కూడా ఉన్నాయి . అలసట, డల్ లుక్ ను, పెయిన్ మరియు కోల్డ్ నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ లో చర్మం చూడటానికి ఫ్రెష్ గా మరియు రిలాక్స్ గా మారుతుంది.

 అల్లం రిసిపి (ఫూట్ సోకింగ్ కోసం) :

అల్లం రిసిపి (ఫూట్ సోకింగ్ కోసం) :

ఒక చెంచా మస్టర్డ్ పౌడర్ మరియు 2 చెంచాలా ఫ్రెష్ అల్లం తురుము బాత్ టబ్ లో గోరువెచ్చని నీటిలో వేసి బాగా మిక్స్ చేసి పాదాలను అందులో డిప్ చేయాలి. 15-20 నిముషాలు డిప్ చేయడం వల్ల పాదాల్లో డెడ్ స్కిన్ తొలగి, అందంగా కనబడుతాయి మరియు యంగ్ ఫ్రెష్ గా కనబడుతాయి .

మచ్చలకు ఫ్రెష్ జింజర్:

మచ్చలకు ఫ్రెష్ జింజర్:

అల్లం చర్మంలోని వైట్ మరియు హైపో పింగ్మెంట్ స్కార్స్ ను నివారిస్తుంది . అందుకోసం ఫ్రెష్ గా ఉండే అల్లం ముక్కతో చర్మం మీద మర్దన చేయాలి. ఇలా ప్రతి రోజూ రెండు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. 20 నిముషాలు అలాగే ఉంచి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. స్కిన్ టోన్ యొక్క మార్పును మీరు గమనిస్తారు . కొన్ని వారాలలో స్కార్స్ కూడా తొలగిపోతాయి.

అల్లం మరియు నిమ్మతో బాడీ స్ర్కబ్:

అల్లం మరియు నిమ్మతో బాడీ స్ర్కబ్:

చర్మం మీద సెల్యులైట్ ను నివారించడంలో నేచర్ అందించిన గ్రేట్ రెమెడీ . ఈ జింజర్ స్క్రబ్ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది . మీమ్మిల్ని వార్మ్ గా మార్చి, ఫ్రెష్ గా ఫీలయ్యేలా చేస్తుంది . అలాగే ఇందులో కొద్దిగా లెమన్ జెస్ట్ వేసి స్క్రబ్ చేయాలి. ఈ బాడీ స్క్రబ్ వల్ల మీ శరీరం వెచ్చగా మారుతుంది.

 జింజర్ మరియు లెమన్ బాడీ స్క్రబ్:

జింజర్ మరియు లెమన్ బాడీ స్క్రబ్:

ఒక చెంచా షుగర్ ఒక చెంచా ఆలివ్ ఆయిల్ ను ఫ్రెష్ గా ఉన్న అల్లం పేస్ట్ లో వేసి మిక్స్ చేసి నిమ్మరసంతో చర్మానికి అప్లై చేసి స్క్రబ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఫ్రిజ్ లో నిల్వచేసుకొని అప్పుడప్పుడు ఉపయోగించుకోవచ్చు.

అల్లం-రోజ్ మసాజ్ ఆయిల్ :

అల్లం-రోజ్ మసాజ్ ఆయిల్ :

ఇది ఒక రొమాంటిక్ ఆయిల్. దీన్ని రొమాంటిక్ ఆయిల్ అని కూడా పిలుస్తారు . ఈ రొమాంటిక్ ఆయిల్ ను అల్లం, రోజ్ వాటర్ మరియు ఇతర ఆరోమా ఆయిల్స్ తో తయారుచేస్తారు . ఇది పూర్తి ఆరోమా వాసన కలిగి ఉంటుంది . ఇది శరీరానికి మరింత వెచ్చగా మార్చుతుంది. ఇది ఒక బెస్ట్ మసాజ్ ఆయిల్ . బయట వెళ్ళేటప్పుడు ఈ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల ఫేవ్ లెస్ యంగ్ లుకింగ్ స్కిన్ పొందవచ్చు . ఇది స్ట్రెస్ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది.

రొమాంటిక్ మసాజ్ ఆయిల్ రిసిపి :

రొమాంటిక్ మసాజ్ ఆయిల్ రిసిపి :

కొన్ని అల్లం ముక్కలను సన్నగా తరిగి, దీనికి 10 డ్రై రోజ్ బడ్స్ ను చేర్చి, ఆలివ్ ఆయిల్ లేదా జోజోబా ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ కాంబినేషన్ ఆయిల్ మసాజ్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. శరీరం నుండి మంచి వాసన వచ్చేలా రిలాక్స్ చేస్తుంది.

అల్లం -దాల్చిన చెక్క సాల్ట్ బాత్:

అల్లం -దాల్చిన చెక్క సాల్ట్ బాత్:

ఇది మజిల్స్ పెయిన్ మరియు అలసటను నివారిస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బ్లడ్ సర్కులేషన్ పెంచుతుంది మరియు మంచి నిద్రపడుతుంది.

జింజర్, సినామిన్ -సాల్ట్ బాత్ రిసిపి:

జింజర్, సినామిన్ -సాల్ట్ బాత్ రిసిపి:

1/4కప్పు సీసాల్ట్, 3 టేబుల్ స్పూన్ల అల్లం తురుము , 1/2 చెంచా దాల్చిన చెక్క పొడి, 5 చుక్కల ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి. దీన్ని హాట్ బాత్ లో వేసి, 20 నిముషాలుఅందులో ఉండాలి. దాంతో మీ శరీరం ఉత్తమ ఫలితాలను పొందుతుంది.

Story first published: Saturday, December 19, 2015, 13:12 [IST]
Desktop Bottom Promotion