Latest Updates
-
వృశ్చికం, మేషం, సింహ రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - మంగళవారం, 09 జూన్ 2026 -
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.?
తొక్కలోనే ఉన్నాయి అసలైన సౌందర్య రహస్యాలన్నీ...
దానిమ్మ! దానిమ్మ యొక్క రుచి మరియు రంగు గురించి మనందరికి తెలిసిన విషయమే . అంత కంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఈ దానిమ్మలో ఉన్నాయి. అయితే, దానిమ్మ తొక్కలోని ప్రయోజనాల గురించి బహుశ చాలా మందికి తెలిసుండకపోవచ్చు . తరచూ మనం దానిమ్మ తొక్కను పడేస్తుంటాము. అయితే ఈ తొక్కలో కూడా అనేక రకాల బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారా బ్యూటీ నిపుణులు. దానిమ్మ తొక్కను సన్ స్ర్కీన్ గాను, మాయిశ్చరైజర్ గాను మరియు ఫేషియల్ స్ర్కబ్ గాను ఉపయోగించుకోవచ్చు. దానిమ్మతొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ చర్మానికి మరియు కేశాలకు చాలా లోతుగా పోషకాలను అందిస్తుంది.
READ MORE:దానిమ్మ తొక్కలో టాప్ 10 ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా
దీన్ని ఉపయోగించడానికి ఒక ఉత్తమ మార్గం, తొక్కను ఎండలో బాగా ఎండబెట్టి పొడి చేసుకొని మూత టైట్ గా ఉన్న డబ్బాలో నిల్వచేసుకోని, అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు. మరి ఈ దానిమ్మ తొక్క పౌడర్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీకి ఏవిధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే....

మొటిమలను నివారిస్తుంది:
దానిమ్మలో ఉండే నయం చేసే గుణాలు దానితొక్క లోని నయం చేసే లక్షణాల వల్ల మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది. ఇంకా దానిమ్మ తొక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. దానిమ్మ పౌడర్ కు కొద్దిగా నిమ్మరం మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

వ్రుద్దాప్య లక్షణాలను నివారిస్తుంది
దానిమ్మ పౌడర్ చర్మంలోప విడుదలయ్యే కొల్లాజెన్ ను విచ్చిన్నం చేసి, కొత్త చర్మకణాలు ఏర్పడేందుకు సహాయపడుతుంది. దాంతో ముఖంలో ముడుతలు మరియు ఫైన్ లైన్స్ ను నివారించుకోవచ్చు. దానిమ్మ పౌడర్ కు కొద్దిగా పాలు మిక్స్ చేసి , ఈ మిశ్రమాన్ని ముఖాని పట్టించి కొద్దిసేపటి తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

నేచురల్ సన్ స్క్రీన్ :
దానిమ్మ పౌడర్ఎఫెక్టివ్ సన్ స్ర్కీన్ లోషన్ గా పనిచేస్తుంది. ఇది సన్ బ్లాకింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది . హానికరమైన యూవీ రేస్ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది.

స్కిన్ క్యాన్సర్ ను నివారస్తుంది
రీసెంట్ గా జరిపిన పరిశోధనల ప్రకారం, దానిమ్మ తొక్కలో ఉండే ఏజెంట్స్ స్కిన్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతాయని కనుగొన్నారు.

ఫేషియల్ స్ర్కబ్
దానిమ్మ తొక్కతో తయారుచేసిన పౌడర్ నేచురల్ ఫేషియల్ స్క్రబ్బింగ్ గా పనిచేస్తుంది. ఇది అన్ని రకాల డెడ్ స్కిన్, బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ ను నివారిస్తుంది.

ఎఫెక్టివ్ మాయిశ్చరైజర్
దానిమ్మ పౌడర్ చర్మానికి అవసరం అయ్యే తేమను అందిస్తుంది. ఇది చర్మంలోని పిహెచ్ బ్యాలెన్స్ ను తిరిగి పునరుద్దరింపచేస్తుంది. కొద్దిగా దానిమ్మ తొక్క పొడిని పెరుగులో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రపరుచుకోవాలి.

హెల్తీ హెయిర్
దానిమ్మ పౌడర్ ను కేశ సంరక్షణ కోసం కూడా ఉపయోగించుకోవచ్చు . ఇది జుట్టు రాలడం అరికడుతుంది మరియు చుండ్రు నివారిస్తుంది . ఇది ఆరోగ్యకరమై జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

పొడి చర్మం
చిన్న పరమాణు నిర్మాణం కలిగిన దానిమ్మ పండు, సులభంగా చర్మంలోకి ప్రవేశించబడుతుంది. అంతేకాకుండా, దానిమ్మ పండులో ఉన్న ''ప్యూనిక్ ఆసిడ్'' మరియు ''ఒమేగా-3 ఫాటీ ఆసిడ్''లు హైడ్రేట్ మరియు తేమను కోల్పోవటాన్ని నివారిస్తుంది.

జిడ్డు చర్మం
దానిమ్మ పండు పొడి చర్మానికి ఉపయోగపడిన విధంగానే, జిడ్డు చర్మానికి లేదా ఎక్కువ ఆయిల్ కలిగిన చర్మానికి కూడా ఉపయోగపడుతుంది. జిడ్డు చర్మంపై కలిగే మొటిమలను, చర్మ పగుళ్ళను, మచ్చలు మరియు దురదలను శక్తివంతంగా తగ్గించి వేస్తుంది.

మృదువైన చర్మం
దానిమ్మ పండు, చర్మంలోని కొల్లాజన్ మరియు స్థితిస్తాపకతను కలుగుచేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ పండు నుండి తయారు చేసిన రసం చర్మ కణాలలో ఫైబ్రోబ్లాస్ట్'లను వృద్ధి పరచి, చర్మ మృదుత్వాన్ని అధికం చేస్తుంది. అంతేకాకుండా, దానిమ్మ పండులో ఉండే 'ప్యూనిక్ ఆసిడ్', చర్మ కణాలలో ఉండే బ్యాక్టీరియా మరియు మలిన పదార్థాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

సూర్యకాంతి నుండి రక్షణ
సూర్యకాంతి వలన కలిగే ప్రమాదాలను దానిమ్మ పండు ద్వారా తగ్గించుకోవచ్చు. సూర్యకాంతి వలన కలిగే ప్రమాదాలను, ఫ్రీ రాడికల్'ల వలన చర్మంపై కలిగే నష్టాలను మరియు చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను కూడా తగ్గించి వేస్తుంది. 'ఎల్లాజిక్ ఆసిడ్' మరియు 'పాలీఫినాల్ యాంటీ ఆక్సిడెంట్'లు దానిమ్మ పండులో ఉంటాయి, ఇవి చర్మంలో ఏర్పడే, క్యాన్సర్ ట్యూమర్ ఏర్పాటును అడ్డుకుంటాయి.

స్కిన్ ఇన్ఫ్లమేషన్
దానిమ్మ పండులో పుష్కంలంగా 'పాలీఫినాల్' మరియు యాంటీ- ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగినందు వలన, ఇవి చర్మం పై ఏర్పడిన మంటలను మరియు వాపులను శక్తివంతంగా తగ్గిస్తాయి. చర్మంపై ఏర్పడిన చిన్న చిన్న తెగుళ్ళను, మచ్చలను తగ్గించుటకు, దానిమ్మ గింజల నుండి తయారు చేసిన నూనెలను వాడమని సౌందర్య నిపుణులు సలహా ఇస్తున్నారు.



Click it and Unblock the Notifications