Latest Updates
-
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
చర్మం మీద నల్ల మచ్చలు, ప్యాచ్ లను మాయం చేసే చిట్కాలు
శరీరంలో చర్మం మీద ఎలాంటి మచ్చలు మొటిమలు, స్కార్క్ లేకుంటేనే చర్మం చూడటానికి అందంగా ఉంటుంది. అదే అందమైన ఫెయిర్ స్కిన్ మీదే ఎక్కడో ఒక చోట చిన్న మచ్చ కనబడితే చాలు అది చూడటానికి ఎంత అసహ్యంగా కనబడుతుందో. ముఖ్యంగా తెల్లగా ఉండే వారిలో ఇలాంటి డార్క్ పాచ్ లు మరింత ఇబ్బందికరంగా మారుతాయి . ఈ సమస్యను నివారించడానికి నిమ్మరసం చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.
అదే విధంగా, లాక్టిక్ యాసిడ్స్ లేదా ఏలాంటి యాసిడ్స్ ఉన్న ఆహారాలైనా డార్క్ ప్యాచ్ లను నివారిస్తుంది . హార్మోనుల సమస్యలు, సన్ టాన్ మరియు వయస్సు రిత్యా చర్మంలో డార్క్ ప్యాచ్ లు ఏర్పడుతాయి.
హార్మోనుల సమస్య వల్ల ఎవరైతే ఇలా స్కిన్ ప్యాచ్ లు, మెడ మీద నల్ల చారలు, మచ్చలతో బాధపడుతున్నారో వారిని చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు ముఖ్య కారణం అసహ్యమైనటువంటి స్కిన్ ప్యాచ్ లు. ఈ సమస్య నుండి తక్షణం బయటపడాలంటే, నేచురల్ హోం రెమెడీస్ ఉపయోగపడుతాయి. ఇవి డార్క్ గా ఉన్న స్కిన్ ప్యాచ్ లను లైట్ చేస్తాయి.
అయితే, ఈ నేచురల్ రెమెడీస్ ఉపయోగించడానికి ముందు స్కిన్ టెస్ట్ చేసి తర్వాత నేరుగా స్కిన్ ప్యాచ్ లున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అప్లై చేయకూడదు. మరి రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

1. నిమ్మరసం:
చర్మం మీద ఏర్పడ్డ స్కిన్ ప్యాచ్ లను మాయం చేయడానికి నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది . నిమ్మకాయను సగానికి కట్ చేసి చర్మం మీద అప్లై చేసి రబ్ చేయాలి. తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత 4-5గంటలు సేపు ఎండలో తిరగకుండా ఉండాలి.

2.పెరుగు:
ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, 2 చెంచాలా నిమ్మరసం మరియు ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వీటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ మరియు బ్లీచింగ్ లక్షణాలు డార్క్ ప్యాచ్ లను నివారిస్తుంది.

3. ఆరెంజ్:
విటమిన్ సి అధికంగా ఉండే ఆరెంజ్ మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది నేచురల్ గా స్కిన్ డార్క్ ప్యాచ్ లను నివారిస్తుంది . ప్యాచ్ ఉన్న ప్రదేశంలో ఆరెంజ్ తో మర్ధన చేయాలి . ఆరెంజ్ తొక్కను పౌడర్ గా చేసి మాస్క్ లా వేసుకోవచ్చు.

4.పాలు:
పాలు కలిపిన నీటితో ఒక వారం పాటు, స్నానం చేయడం వల్ల పాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ శరీరంలో కనిపించే నల్లమచ్చలను నేచురల్ గా మాయం చేస్తుంది.

5. తేనె:
డార్క్ ప్యాచ్ ల మీద తేనెతో ప్యాక్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తేనెతో ప్యాక్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత దాని మీద నిమ్మరసంను అప్లై చేయాలి . బాగా మసాజ్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మూడు రోజుల తర్వాత తిరిగి అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

6. కలబంద:
స్కిన్ మీద ఉండే డార్క్ ప్యాచ్ లకు అలోవెర జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ జెల్ తో ముఖం మీద నేరుగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది . తర్వాత పాలతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక వారం తర్వాత తిరిగి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.

7. క్రీమ్:
మిల్క్ క్రీమ్ కూడా ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. క్రీమ్ అండ్ మిల్క్ తో శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది.

8. పసుపు:
బౌల్లో కొద్దిగా పసుపు, పాలు మరియు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి . ఇలా చేయడం వల్ల డార్క్ స్కిన్ ప్యాచ్ లను నివారిస్తుంది . 10 రోజుల తర్వాత తిరిగి ఈ పద్దతిని అనుసరించాలి.



Click it and Unblock the Notifications











