Latest Updates
-
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.!
కొబ్బరినీళ్లు.. సమ్మర్ డ్రింకే కాదు.. సన్ ట్యాన్ రిమూవర్ కూడా.. !
భగభగమండుతున్న ఎండల్లో కాసిన్ని కొబ్బరినీళ్లు తాగి మనమంతా ఎంతో సేదతీరుతుంటాం. వేడివేడి వాతావరణంలో కొబ్బరినీళ్లు కాస్త తాజాదనాన్ని ఇస్తాయి. ఇవి రిలాక్సేషన్ నే కాదు.. ఇందులో ఉండే పోషకాలు.. సౌందర్యానికి కూడా సహాయపడతాయి. చల్లచల్లని కొబ్బరినీళ్లు తాగడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. సౌందర్య రహస్యాలు కూడా తెలుసుకోండి.

కొబ్బరినీళ్లు తాగడం వల్ల పొందే ప్రయోజనాల గురించి పక్కనపెడితే.. చర్మం, జుట్టు సంరక్షణలో ఇవి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. ఈ నీటిని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే.. జుట్టు షైనీగా మారుతుంది. ఇంకెందుకు ఆలస్యం మీ చెంతే ఉన్న కొబ్బరినీళ్లు బ్యూటీ సీక్రెట్స్ ఇప్పుడే తెలుసుకోండి..

ముల్తానీ మట్టి
ముల్తానీ మట్టిలో కొబ్బరినీళ్లు కలుపుకుని శరీరానికి రాసుకోవడం వల్ల సన్ ట్యాన్ నివారిస్తుంది.. చర్మం కొత్త నిగారింపు సంతరించుకుంటుంది. అలాగే ఇది స్క్రబ్ లా పనిచేస్తుంది.

మొటిమలు
ఎండాకాలంలో చర్మం ఎక్కువగా జిడ్డుగా మారుతూ ఉంటుంది. వేడి కారణంగా.. చర్మం నిర్జీవంగా మారి మొటిమలకు కారణమవుతుంది. కాబట్టి.. కొబ్బరినీళ్లను ముఖంపై అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచుకుని.. ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే.. మొటిమలు మాయమవుతాయి.

ఇన్ఫెక్షన్స్
సమ్మర్ లో ఎక్కువమందికి స్కిన్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఎదురవుతాయి. కొబ్బరినీళ్లలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి స్కిన్ అలర్జీలను, ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తాయి. కాబట్టి.. స్నానం చేసే నీటిలో కొబ్బరినీళ్లు కలుపుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

బ్లాక్ హెడ్స్
రోజూ తాజా కొబ్బరి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటే.. బ్లాక్ హెడ్స్, యాక్నె తగ్గిపోతాయి. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గ్లోయింగ్ స్కిన్
కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఇందులో ఉండే పోషకాలు.. చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. శరీరం డీహైడ్రేట్ కాకుండా.. కాపాడి.. చర్మం సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి... కొబ్బరినీళ్లు ఎక్కువగా తీసుకోవడం మంచిది.

మాయిశ్చరైజర్
కొబ్బరినీళ్లు చర్మానికి చక్కటి మాయిశ్చరైజర్ లా పనిచేస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు కొబ్బరినీళ్లను చర్మానికి అప్లై చేస్తే సహజ మాయిశ్చరైజర్ అందుతుంది.

సిల్కీ హెయిర్
కొంతమంది జుట్టు నిర్జీవంగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు స్నానానికి ముందు కొబ్బరినీళ్లతో తలకు మసాజ్ చేసుకుంటే.. జుట్టు స్మూత్ గా, సిల్కీగా మారుతుంది. అలాగే జుట్టుకి కండిషనర్ లా ఉపయోగపడుతుంది.

చుండ్రు
కొబ్బరినీళ్లలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలలో దురద, చుండ్రు, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి.. తరచుగా.. కొబ్బరినీళ్లతో తలను మర్దనా చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది.చూశారుగా ఇన్ని ప్రయోజనాలున్న కొబ్బరినీళ్లను సౌందర్య పోషణకు ఉపయోగిస్తారు కదూ..



Click it and Unblock the Notifications
