For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాఫ్ట్ అండ్ పింక్ లిప్స్ పొంద‌డానికి తేనె, ఆలివ్ ఆయిల్ స్క్ర‌బ్

By Swathi
|

వాడిపోయిన గులాబీ రెక్క‌ల్లా, నొప్పిగా ఉండే ప‌గిలిన పెదాలు, పొడిబారిన పెదాలు, డార్క్ ప్యాచెస్ వంటి పెదాలు మిమ్మ‌ల్ని ఇబ్బందిపెడుతున్నాయా.. లిమ్ బామ్ హెల్ప్ చేస్తుంది. అయితే.. ఇంట్లో త‌యారు చేసుకునే లిప్ బామ్.. మీకు స‌హాయ‌ప‌డుతుంది.

డ్రై, చాప్డ్ లిప్స్ స్మొకింగ్, ఎండ‌, డీహైడ్రేష‌న్ వ‌ల్ల పెదాలు ఇలా త‌యార‌వుతాయి. వీటిని పోగొట్టుకోవ‌డానికి కెమిక‌ల్ స్క్ర‌బ్స్ ఉప‌యోగిస్తారు. అయితే.. పెదాల ఎక్స్ ఫోలియేష‌న్ వ‌ల్ల డెడ్ స్కిన్ లేయ‌ర్స్ తొల‌గించి.. స్కిన్ పెరుగుతుంది. మాయిశ్చ‌రైజ‌ర్ అందిస్తుంది.

DIY Honey And Olive Oil Scrub For Pink Soft Lips

ఇంట్లో ప‌దార్థాలు ఉప‌యోగించి.. ఎఫెక్టివ్ లిప్ స్క్ర‌బ్ త‌యారు చేసుకోవ‌చ్చు. తేనె, పంచ‌దార‌, ఆలివ్ ఆయిల్ ఉప‌యోగించి.. లిప్ స్క్ర‌బ్ త‌యారు చేసుకోవ‌చ్చు. తేనెలో మాయిశ్చ‌రైజింగ్ అందించి, చ‌ర్మాన్ని హైడ్రేట్ చేయ‌డానికి, ఎక్కువ యాంటి యాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి యూవీ డ్యామేజ్ ని త‌గ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియ‌ల్ గుణాలు ఉండ‌టం వ‌ల్ల‌.. పెదాలు ప‌గ‌ల‌కుండా.. సాఫ్ట్ గా మారుతుంది.

పంచ‌దారలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్‌ని త‌గ్గిస్తుంది. పెదాల‌పై న్యాచుర‌ల్ మాయిశ్చ‌రైజ‌ర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ పెదాల డ్రై కాకుండా చేస్తుంది. ఇందులో విట‌మిన్ ఈ ఉండ‌టం వ‌ల్ల ఫ్రీరాడిక‌ల్స్‌తో పోరాడుతుంది.

DIY Honey And Olive Oil Scrub For Pink Soft Lips

కావాల్సిన ప‌దార్థాలు

  • 1 టేబుల్ స్పూన్ పంచ‌దార‌
  • 1 టేబుల్ స్పూన్ తేనె
  • కొన్ని చుక్క‌ల ఆలివ్ ఆయిల్
DIY Honey And Olive Oil Scrub For Pink Soft Lips

త‌యారు చేసే విధానం

  1. మైక్రోవేవ్ లో 20 సెకండ్లు వేడి చేయాలి. ఇప్పుడు ఆలివ్ ఆయిల్, పంచ‌దార క‌లిపి మిక్స్ చేయాలి. టూత్ బ్ర‌ష్ స‌హాయ‌డంతో.. పెదాల‌పై అప్లై చేయాలి.
  2. డెడ్ స్కిన్ తొల‌గించ‌డానికి గుండ్రంగా మ‌సాజ్ చేయాలి.
  3. కొన్ని నిమిషాలు అలానే వ‌దిలేయాలి.
  4. త‌డి ట‌వ‌ల్ తో తుడిచేయాలి. వెంట‌నే లిప్ బామ్ రాసుకోవాలి.
  5. మిగిలిన స్క్ర‌బ్‌ని అలాగే టైట్ కంటెయిన‌ర్ లో పెట్టుకుని.. డ్రై ప్లేస్‌లో స్టోర్ చేసుకోవాలి. ఒక వారం పాటు నిల్వ ఉంటుంది.
  6. ఈ ఈజీ స్క్ర‌బ్ చ‌ర్మాన్ని స్మూత్‌గా ఉంచుతుంది. ఇవి ప‌గిలిన పెదాల‌ను పింగ్‌గా మారుస్తుంది. రోజంతా పింక్‌గా ఉండేలా చేస్తుంది. ఈ స్క్ర‌బ్ ని వారానికి రెండుసార్లు చేయాలి.

English summary

DIY Honey And Olive Oil Scrub For Pink Soft Lips

DIY Honey And Olive Oil Scrub For Pink Soft Lips. If you have lips that look like wilted roses, is painfully chapped and has pink skin peeking out from under dark patches, trust us, no amount of lip balm is going to help you.
Story first published:Saturday, July 30, 2016, 12:19 [IST]
Desktop Bottom Promotion