For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న బంగాళదుంప ముక్క చాలు..నల్లగా ఉన్న చంకలు తెల్లగా మారడానికి.!!

ఈ జనరేషన్ అమ్మాయిలకు స్లీవ్ లెస్ డ్రెస్సులు, అందమైన టాప్స్ వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు? అయితే మల్లెపువ్వుల్లాంటి తెల్లని బాడీ షేప్ లో అమాస్య చంద్రుడు లాంటి నల్ల మచ్చ చాలా అస్యహ్యంగా కనబడుతుం

|

ఈ జనరేషన్ అమ్మాయిలకు స్లీవ్ లెస్ డ్రెస్సులు, అందమైన టాప్స్ వేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు? అయితే మల్లెపువ్వుల్లాంటి తెల్లని బాడీ షేప్ లో అమాస్య చంద్రుడు లాంటి నల్ల మచ్చ చాలా అస్యహ్యంగా కనబడుతుంది. ఈ పరిస్థితిలో స్లీవ్ వేసుకోవాలన్నా ఇష్టముండదు. మరి చంకల్లో నలుపు పోగొట్టుకోవడానికి పరిష్కారం లేదా అంటే ? ఖచ్చితంగా ఉందనే చెప్పవచ్చు. పొటాటో (బంగాళదుంప)మాస్క్ తో చంకల్లో నలుపును ఎఫెక్టివ్ గా తొలగించుకోవచ్చు.

చంకల్లో నలుపు లేదా స్త్రీ, పురుషులిద్దరిలో సహజగా కనిపించే సమస్య . ఈ సమస్య సరైన శుభ్రత పాటించకపోవడం వల్ల అక్కడ మెలని (మురికి) చేరడం వల్ల చంకలు నల్లగా మారుతాయి. చర్మం డార్క్ గా మారుతుంది.

Potato Juice Mask To Whiten Dark Underarms!

ఇంకా నికోటిన్ యాసిడ్స్ ఉండే కాంట్రా సెప్టివ్ పిల్స్ వాడటం వల్ల కూడా చర్మం రంగులో మార్పు వస్తుంది. అంతే కాకుండా, షేవింగ్, ఎరిత్రాస్మా వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ , డియోడరెంట్ వంటివన్ని కారణాల వల్ల ఆర్మ్ పిట్ స్కిన్ డార్క్ గా లేదా బ్లాక్ గా మారుతుంది. !

అందుకు మీరు చేయాల్సిందల్లా టైట్ గా ఉన్న దుస్తులను వేసుకోకుండా వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలి. కొన్ని రోజులు డియోడరెంట్స్ ఉపయోగించకూడదు. ఎప్పటికప్పడు షేవింగ్, క్లెన్సింగ్ వంటివి పాటించాలి. చంకల్లో ఎప్పుడూ డ్రైగా ఉంచుకోవాలి.

స్కిన్ బ్లీచింగ్ పొటాటో మాస్క్ వల్ల చంకలో బ్యూటిఫుల్ స్కిన్ పొందవచ్చు! అండర్ ఆర్మ్ డార్క్ నెస్ ను పోగొట్టుకోవడానికి పొటాటో మాస్క్ లో పొటాటో జ్యూస్ లో నిమ్మరసం, టర్మరిక్, కీరదోస జ్యూస్ ను చేర్చాలి.

పొటాటో జ్యూస్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. స్కిన్ టోన్ ను లైట్ గా మార్చుతుంది. తేనె చర్మానికి తగిన మాయిశ్చరైజింగ్ ను అందిస్తుంది. నిమ్మరసం లర్కింగ్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కీరదోసకాయ చర్మంను స్మూత్ గా మార్చుతుంది.

చంకల్లో నలుపును నేచురల్ గా తగ్గించుకోవడానికి కొన్ని గైడ్ లైన్స్ స్టెప్ బై స్టెప్ మీకోసం...

 స్టెప్ # 1

స్టెప్ # 1

ఒక బౌల్ తీసుకుని ఒక పెద్ద పొటాటో తీసుకుని పొట్టు తీసి, తురుమి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకుని పొటాటో పేస్ట్ అందులో వేసి రసాన్ని పిండాలి. ఈ పొటాటో జ్యూస్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.అందువల్ల చంకల్లో నలుపు తగ్గించి స్కిన్ టోన్ ను బ్రైట్ గా లైట్ గా మార్చుతుంది.

స్టెప్ # 2

స్టెప్ # 2

పొటాటో జ్యూస్ లో 5 చుక్కల నిమ్మరసం మిక్స్ చేయాలి. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చంకల్లో స్మూత్ గా మారుతుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది.

స్టెప్ # 3

స్టెప్ # 3

చిటికెడు పసుపు కూడా జోడించాలి. పసుపు చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ఆయిల్ ను తగిస్తుంది. సెబాసియస్ గ్లాండ్స్ నుండి చెమటను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల బ్యాక్టీరియాకు కారణమయ్యే ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

స్టెప్ # 4

స్టెప్ # 4

కీరదోసకాకు పొట్టు తీసి, తురుమి, అందులో నుండి జ్యూస్ తియ్యాలి. కీరదోసకాయ జ్యూస్ లో విటమిన్ బి కాంప్లెక్స్ , బయోటిన్స్ అధికంగా ఉన్నాయి. ఇవి చర్మంను స్మూత్ గా మార్చుతుంది. చర్మంలో నలుపు తగ్గిస్తుంది. దుర్వాసనను తగ్గిస్తుంది. కీరదోస జ్యూస్ జెల్ లాగా కాన్ స్టాంట్ గా ఉంటుంది.

స్టెప్ # 5

స్టెప్ # 5

ఇప్పుడు చంకల్లో మంచి నీటితో లేదా సోప్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా తొలగిపోతుంది. తర్వాత తడి లేకుండా కాటన్ టవల్ తో తుడవాలి.

స్టెప్ # 6

స్టెప్ # 6

తర్వాత కాటన్ బాల్ తీసుకుని, బహుమూలల్లో (చంకలో పెట్టాలి)20 నిముసాల పెట్టాలి. టవల్ ను వేడి నీటిలో డిప్ చేసి ఎక్సెస్ వాటర్ ను పిండేయాలి. తర్వాత కాట్ బాల్ తీసీ వేడి క్లాత్ తో తుడవాలి. తర్వాత పైన సూచించిన పదార్థాలన్నింటి మిశ్రమాన్ని చంకల్లో మాస్క్ లా వేసుకోవాలి.

స్టెప్ # 7

స్టెప్ # 7

చంకల్లో పూర్తిగా డ్రైగా మారిన తర్వాత కొన్ని చుక్కల రోజ్ వాటర్ తీసుకోవాలి. తర్వాత కాటన్ బాల్ ను డిప్ చేసి చంకలో అప్లై చేయాలి. రోజ్ వాటర్ బ్యాక్టీరియాను తొలగిస్తుంది. చర్మంను స్మూత్ గా మార్చుతుంది.

స్టెప్ # 8

స్టెప్ # 8

అలాగే కొన్ని రోజుల పాటు డియోడరెంట్ ను ఉపయోగించడం అవాయిడ్ చేయాలి. కార్న్ స్ట్రార్చ్ చిలకరించడం వల్ల చెమట వల్ల బ్యాక్టీరియా ఏర్పడకుండా బహుమూలల్లో డ్రైగా ఉంచుతుంది. దుర్వాసన ఉండదు.

ముగింపు:

ముగింపు:

చంకల్లో ఎలాంటి గాయాలున్నా,పొటాటో మాస్క్ ను వేసుకోవడం నివారించడాలి. క్రమం తప్పకుండా ఈ మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక నెలలో మంచి మార్పు తీసుకొస్తుంది.

English summary

Potato Juice Mask To Whiten Dark Underarms!

Potato works as a bleach, lightening skin tone. Honey moisturizes the skin. Lemon juice kills any lurking bacteria and cucumber soothes the skin. Here is a step-by-step guide on how to lighten dark arm pits naturally!
Story first published: Tuesday, December 13, 2016, 18:44 [IST]
Desktop Bottom Promotion