Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
చంకలు తెల్లగా మెరిసిపోవాలంటే: సింపుల్ హోం మేడ్ స్ర్కబ్
అండర్ ఆర్మ్(భుజాల యొక్క క్రింది భాగం లేదా చంకలు) పరిశుభ్రంగా ఉంచుకోవడం శరీరం అందంలో ఇది కూడా ఒక బ్యూటీకి సంబంధించిన విషయమే. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నాయి. వేడి, ఎండలను బీట్ చేయాలంటే, బహుమూలల్లో అవాంఛిత రోమాలాను తొలగించాలి. దాంతో పాటు వేసవి సీజన్ లో సాధ్యమైనంత వరకూ మినిమల్ దుస్తులు(పొట్టి దుస్తులు)దరించడానికి చాలా మంది ఇష్టపడుతారు. అయితే, సన్ టాన్ కు గురై, చంకల్లో నలుపు ప్యాచ్ లుగా ఉన్నప్పుడు స్లీవ్ లెస్ డ్రెస్సులు కానీ, బ్లౌైజులు కానీ ధరించడానికి సాధ్యం కాదు.
' స్లీవ్‌లెస్ టాప్‌లను' ధరించే పలువురు మహిళలు నలుగురిలో కాస్తంత ఇబ్బందులు పడుతున్నట్లు కనిపిస్తుంటారు. కారణం వారి చంకల కింద భాగం నల్లబడి ఉండటమే. చంకల్లో నలుపు ప్యాచ్ లు కలిగి ఉండటం చాలా మందిలో చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ సమస్యను నివారించుకోవడానికి చాలా మంది స్కిన్ కేర్ క్లీనిక్స్ మరియు సలూన్స్ లో ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తుంటారు. ఈ సమస్యలకు ఫ్రీక్వెంట్ వ్యాక్సింగ్ అందుబాటులో ఉన్నప్పటికి ఈ పద్ధతి నొప్పికి గురిచేస్తుంది. వీటివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ నల్లదనాన్ని పోగట్టి, చంకలు నిఘారింపు సంతరించుకునేందుకు ప్రకృతిలో దాగున్న సహజ పదార్థాలు బేషుగ్గా పనిచేస్తాయి...

ఇంట్లో ఉండే నేచురల్ పదార్థాలతో స్క్రబ్బింగ్ చేయడం వల్ల చంకల్లో నలుపు తగ్గించుకోవచ్చు . డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడం వల్ల క్రమంగా చంక భాగంలో నలుపు తగ్గతుంది.
స్క్రబ్బింగ్ కోసం, కీరదోస, ఆలివ్ ఆయిల్, బేకింగ్ సోడా మరియు నిమ్మరసం అవసరమవుతుంది. కీరదోసమరియు నిమ్మరసం బ్లీచింగ్ ఏజెంట్ గా పినచేస్తుంది . ఇది స్కిన్ డిస్కలరేషన్ తగ్గిస్తుంది.
అలాగే బేకింగ్ సోడా మరియు ఆలివ్ ఆయిల్ నేచురల్ ఎక్సఫ్లోయేటర్ గా పనిచేస్తుంది .ఇది చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడం మాత్రమే కాదు, నేచురల్ యాంటీ పర్సిపిరెంట్ గా పనిచేస్తుంది .
అండర్ ఆర్మ్ సమస్యలను నివారించుకోవడంలో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం. చంకల్లో నలుపు నివారించుకోవడానికి, చెమట వల్ల వచ్చే వాసన నివారించుకోవడానికి చంక భాగంలో చర్మం సాఫ్ట్ గా మరియు స్మూత్ గా ఉంచుకోవడానికి బాడీ స్ర్కబ్ గ్రేట్ గా సహాయపడుతుంది . బాడీస్క్రబ్ కు అవసరమయ్యే పదార్థాలు, ఉపయోగించే విధానం తెలుసుకుందాం...

పదార్థాలు:
అండర్ ఆర్మ్ ను తెల్లగా మార్చే హోం మేడ్ స్ర్కబ్
కీరదోసకాయ :
ఆలివ్ ఆయిల్ : 1
బేకింగ్ సోడ: 1 tablespoon
నిమ్మరసం: 2 tablespoons
తయారీ:
కీరదోసకాయను తురుముకోవాలి. దాన్నీ నుండి రసం తీసి, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి.
ఇప్పుడు అందులోనే ఇతర పదార్థాలు కూడా మిక్స్ చేయాలి.
చిక్కటి పేస్ట్ లా తయారయ్యే వరకూ మిక్స్ చేస్తుండాలి.
తర్వాత స్ర్కబ్ ప్యాడ్ తీసుకుని, నల్లగా ఉన్న ప్రాంతంలో అప్లై చేసి స్ర్కబ్ చేయాలి.
స్ర్కబ్ చేసిన 15 నిముషాలు అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
తడి తుడిచేసి, మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.
ఈ ప్రొసెస్ ను వారంలో మూడు నాలుగు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.



Click it and Unblock the Notifications
