పెసరపిండి చర్మ కాంతిని పెంచడమే కాదు, జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

పెసళ్ళు లేదా గ్రీన్ గ్రామ్ చాలా మందికి సుపరిచితమే. ఎందుకంటే పెసరట్టు పెసళ్ళుతో చేస్తారు కాబట్టి, ప్రతి మహిళకు ఈ నిత్యవరసర వస్తువు తెలిసే ఉంటుంది. అంతే కాదు, పెసళ్ళలో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మం, జుట్టుకు కూడా గ్రేట్ గా ఉపయోగపడుతాయి. అందుకే పురాతన కాలం నుండి ఇది బాగా సుపరిచితమైనది. ముఖ్యంగా సౌందర్యానికి సున్నిపిండిని దీంతోనే తయారుచేస్తారు.

పెసరపిండి సౌందర్యాన్ని పెంచుతుందన్న విషయం మీకు తెలుసా? సబ్బు ఎంత హెర్బల్ సోప్ ఐన సరే దానిలో కొంతవరకు చాలా గరుకుగా ఉండే పదార్ధం ఉంటుంది. అది చర్మాన్ని ముదురుగా చెయ్యడమే కాకుండా నల్లగా కూడా అవుతాము. అలాగా అని సబ్బు వాడకపోతే స్నానం చేసినట్టు ముఖం కడుకునట్టు ఉండదు అందుకే సోప్ లేదా సబ్బు వాడకం తగ్గించి ఇప్పుడు చెప్పబోయాది రెండు సార్లు వాడితే నలుపుతనం పోయి మచ్చలు బ్లాకు హెడ్స్ పూర్తిగా పోయి మంచి గ్లో అండ్ సాఫ్ట్ గా అవుతుంది.

benefits of moong dal for skin | benefits of moong dal for hair

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు…సౌందర్యపోషణ పట్ల కాస్త శ్రద్ధ పెట్టగలిగితే మరింతగా మెరిసిపోవడం సాధ్యమవుతుంది. మరి దానికోసం అందుబాటులో ఉండే పెసరపిండి ఎంతో ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే పెసరపిండిలో విటిమన్ ఎ మరియు విటమిన్ సిలు కూడా ఎక్కువ. ఇవి అందానికి బాగా ఉపయోగపడుతాయి.

పెసరపిండిలోని ఉపయోగాల గురించి చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అందుకే ఈ రోజు ఈ పెసరపిండిలో అద్భుత ప్రయోజనాలను మీ ముందు ఉంచుతన్నాము. అవేంటో తెలుసుకుని అందాన్ని మెరుగుపరుచుకోండి....

పెసలతో పొందే ప్రయోజనాలెన్నో..

గమనిక: పెసరపిండి మీ చర్మ తత్వానికి నప్పుతుందో లేదో దీన్ని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం ఉత్తమం.

చర్మానికి

చర్మానికి

1. చర్మంలో ఫ్లాకీనెస్ తగ్గిస్తుంది

పెసరపిండి చర్మంకు కావల్సిన తేనెమను అంతర్గతంగా మరియు బహిర్గతంగా అందిస్తుంది. ముఖ్యంగా చర్మంలో పొలుసులు, లేదా పొట్టు వంటిది రాలకుండా నివారిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

అరటీస్పూన్ పెసరపిండికి ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. రెండూ బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో కడగాలి. ఈ కాంబినేసన్ ప్యాక్ ను వారానికొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

చర్మానికి

చర్మానికి

2. మొటిమలను నివారిస్తుంది:

పెసరసిండిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మూసుకుపోయిన చర్మ రంద్రాలను ఓపన్ చేసి, చర్మంను శుభ్రం చేసి, మొటిమలు రాకుండా నివారిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

పెసళ్ళును ఉడకించి అందులో అరటీస్పూన్ పెసళ్ళు ఉడికించిన నీటికి ఒక టీస్పూన్ తెనె కలపి చర్మానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చన్నీటితో కడిగేయాలి. వారానికొకసారి ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

చర్మానికి

చర్మానికి

3. స్కిన్ టోన్ ను బ్రైట్ గా మార్చుతుంది

చర్మంను బ్రైట్ గా మార్చడంలో పెసళ్ళు గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో ఉండే కొన్ని క్లీనింగ్ కాంపౌండ్స్ వల్ల చర్మంలోని టాక్సిన్స్ ను తొలగిస్తాయి. దాంతో చర్మం క్లీన్ అయ్యి చర్మంను కాంతివంతంగా మార్చుతుంది.

ఎలా ఉపయోగించాలి:

ఒక టీస్పూన్ పెసరపిండిలో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ప్యాక్ ను వారంకు ఒకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

చర్మానికి

చర్మానికి

4. స్కిన్ స్ట్రక్చర్ ను సాప్ట్ గా మార్చుతుంది

పెసరపిండిలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది స్కిన్ స్ట్రక్చర్ ను సాప్ట్ గా మార్చుతుంది.

ఎలా ఉపయోగించాలి:

ఒక టీస్పూన్ పెసరసిండిని మీ ఫేవరెట్ లోషన్ తో మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత కడగాలి. ఇలా చేస్తుంటే చర్మం సాఫ్ట్ గా , తేమగా మారుతుంది. వారంలో ఒకసారి ఇలా చేసి చూడండి తప్పక మంచి ఫలితాలను పొందుతారు.

చర్మానికి

చర్మానికి

5. సన్ టాన్ నివారిస్తుంది

పెసర పిండిలో మరో అద్భుత ప్రయోజనం కూడా ఉంది, ఇది సన్ టాన్ నివారిస్తుంది, చర్మం యొక్క ఓరిజినల్ కలర్ ను అందిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

అరటీస్పూన్ పెసరపిండిలో 2 టీస్పూన్ల అలోవెర జెల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి 10 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో కడగాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే స్కిన్ ట్యానింగ్ సమస్య ఉండదు.

పెసలు తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు మెండు...

జుట్టుకోసం :

జుట్టుకోసం :

6. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

పెసరపిండిలో ఉండే ప్రోటీన్ కంటెంట్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టును స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

ఎలా ఉపయోగించాలి:

అరటీస్పూన్ పెసరపిండిలో రెండు టీస్పూన్ల ఆమ్లా జ్యూస్ ను మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి

జుట్టుకోసం :

జుట్టుకోసం :

7. జుట్టును శుభ్రంగా ఉంచుతుంది:

పెసరపిండిలో ఉండే కొన్ని రకాల కాంపౌండ్స్, ఎఫెక్టివ్ గా మురికిని తొలగిస్తుంది, టాక్సిన్స్ ను తొలగిస్తుంది.

ఎలా ఉపయోగించాలి:

ఒక టీస్పూన్ పెసరపిండిలో ఒక టీస్పూన్ రోజ్ వాటర్, ఒక టీస్పూన్ ఓట్ మీల్ పౌడర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు , జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి.

జుట్టుకోసం :

జుట్టుకోసం :

8. చుండ్రు పోగొడుతుంది

పెసరపిండిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి చుండ్రును ఎఫెక్టివ్ గా తొలగిస్తాయి.

ఎలా ఉపయోగించాలి:

అరటీస్పూన్ పెసరపిండిని, రెండు టీస్పూన్ల వేప పేస్ట్ కు జోడించి తలకు పూర్తిగా అప్లై చేయాలి. అరగంట తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి.

జుట్టుకోసం :

జుట్టుకోసం :

9. జుట్టుకు తగిని షైనింగ్ ను అందిస్తుంది

ఎలా ఉపయోగించాలి:

అరటీస్పూన్ పెసరపిండిలో రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ కలపాలి. దీన్ని తలకు మొత్తానికి అప్లై చేసి, అరగంట తర్వాత ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

9. జుట్టుకు తగిని షైనింగ్ ను అందిస్తుంది

ఎలా ఉపయోగించాలి:

అరటీస్పూన్ పెసరపిండిలో రెండు టీస్పూన్ల రోజ్ వాటర్ కలపాలి. దీన్ని తలకు మొత్తానికి అప్లై చేసి, అరగంట తర్వాత ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

మృతకణాలు తొలగిస్తుంది: కొందరి చర్మంపై మృతకణాలు పేరుకోవడం వల్ల గరుకుగా ఉంటుంది. ఇలాంటప్పుడు పావుకప్పు పెసరపిండి, అర చెంచా బియ్యప్పిండి, కొంచెం పసుపుని గులాబీ నీటితో కలిపి మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని నాలుగు నిమిషాలు ఉండనివ్వాలి. ఆపై పాలతో చేతిని తడుపుకుంటూ నలుగులా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.

English summary

benefits of moong dal for skin | benefits of moong dal for hair

Presence of vitamins A and C as well as other beauty-enhancing antioxidants in moong dal enable it to treat a plethora of unsightly skin conditions such as acne, sun tan, etc. The similar features make moong dal an incredible ingredient for hair care purposes as well.