For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీపు మీద నల్ల మచ్చలను నివారించే ఉత్తమమైన హోం రెమెడీస్

సాధారణంగా మహిళలు ఎంతటి సౌందర్యవతులలో అందరికి తెలిసిన విషయమే. అయితే సహజ సౌందర్యానికి మరికొన్ని మెరుగులు దిద్దుకొంటే ఆ సౌదర్యం ఎప్పటీ అలాగే నిలిచి ఉంటుంది. అందంగా, రూపవతిగా, పుట్టడమే కాదు పుట్టనప్పటి ను

By Lekhaka
|

సాధారణంగా మహిళలు ఎంతటి సౌందర్యవతులలో అందరికి తెలిసిన విషయమే. అయితే సహజ సౌందర్యానికి మరికొన్ని మెరుగులు దిద్దుకొంటే ఆ సౌదర్యం ఎప్పటీ అలాగే నిలిచి ఉంటుంది. అందంగా, రూపవతిగా, పుట్టడమే కాదు పుట్టనప్పటి నుండి వయస్సు పెరిగే కొద్ది శరీరం మీద, అలంకరణ మీద, వస్త్రాల మీద మహిళలకు మోజు పెరుగుతుంటుంది. ప్రతిదీ కొత్తగా వేసుకోవాలని, కొత్తగా కనబడాలని ఆరాటపడుతుంటుంది.

మహిళలు ఒకప్పుడు శరీరం నిండుగా కప్పిఉండే విధంగా బ్లౌజులు (జాకెట్లు) కుట్టించుకొనే వారు. అయితే అది రాను రాను ఫ్యాషన్ వైపు మొగ్గు చూపడంతో కొద్దికొద్దిగా బ్యాక్ నెక్, ఫ్రెంట్ నెక్ క్రిందికి తగ్గించి ఒళ్ళు కనబడేలా ఇతరులను ఆకర్షించేలా వేసుకోవడం ప్రారంభించారు. అయితే అలా వేసుకోవాలంటే చక్కటి శరీర ఆకతి, శరీర చాయతో పాటు, ఎటువంటి చర్మ సంబంద సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొంత మంది మహిళల వీపు నిండా మొటిమలు, కాయలు, వంటివి వుండి అందరూ ధరించే అందమైన వి-నెక్, లేదా ఓ-నెక్ జాకెట్లు వేసుకోవాలంటే ఇబ్బందిగా వుంటుంది. స్లీవ్ లెస్, స్ట్రాప్ లెస్ డ్రెస్సు వేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. వీపులో మొటిలము ఏర్పడుట వల్ల చర్మం దురద, ఇన్ఫెక్షన్ కు గురౌతుంది. నల్లని మచ్చలకు దారి తీస్తుంది. ఇలాంటి మచ్చలను కవర్ చేయడానికి డ్రెస్సు వేసుకున్నా, మీకు నచ్చిన దుస్తులను వేసుకోలేరు.

Best Home Remedies To Get Rid Of Back Acne

వీపు మీద చ్చే మొటిమలు మచ్చలు, స్కిన్ ఇరిటేషన్ కు కారణమవుతాయి . ఇవి హార్మోనుల అసమతుల్యత, చెమట వల్ల కూడా వస్తాయి. ఉతకని దుస్తులు వేసుకున్నా కూడా మొటిమలకు కారణమవుతుంది. మహిళలకు ముందు భాగమే కాదు...వెనుక భాగం కూడా నున్నగా నిగ, నిగ లాడుతూ వుంటే, మరింత సెక్సీ అపీల్ కనపడుతుంది. వీపు భాగంలో మొటిమలను మచ్చలను నేచురల్ గా తగ్గించుకోవడానికి కొన్నిహోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ..

కీరదోసకాయ:

కీరదోసకాయ:

కీరదోసకాయ చర్మానికి తగిన హైడ్రేషన్ అందిస్తుంది. చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. బ్లాక్ అయిన చర్మ రంద్రాలను క్లియర్ చేస్తుంది. కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసి, మెత్తగా పేస్ట్ చేసి, వీపు మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే సరిపోతుంది.

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలు:

ఉల్లిపాయలో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్ లక్షణాలు బ్యాక్ ఎన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది వీపు మీద మచ్చలను తొలగించడం మాత్రమే కాదు, స్కార్స్ కూడా సులభంగా తొలగిస్తుంది. రెండు తెల్ల ఉల్లిపాయలు తీసుకుని, అందలోని జ్యూస్తీసి, కొద్దిగా నిమ్మరసం,తేనె మిక్స్ చేసి, వీపు మీద అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని వీపుకు అప్లై చేసి అరగంట తర్వాత స్నానం చేయాలి.

పైనాపిల్:

పైనాపిల్:

పైనాపిల్లో ఉండే బ్రొమైలిన్ అనే కంటెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. మొటిమలను మచ్చలను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని పైనాపిల్ ముక్కలు తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి, కాటన్ బాల్ తో రసంలో డిప్ చేసి వీపు మీద ఉన్న నల్ల మచ్చల మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో స్నానం చేసుకుంటే సమస్య తగ్గుతుంది. ఈ హోం రెమెడీని రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నట్ మగ్ :

నట్ మగ్ :

నట్ మగ్ లో యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్ానయి. ఇది అన్ని రకాల మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఇందులో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు మొటిమల వల్ల వచ్చే మచ్చలతను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక నట్ మగ్ పౌడర్ కు ఒక టీస్పూన్ తేనె, దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి, మచ్చల మీద అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ తొక్క :

ఆరెంజ్ తొక్క :

వీపు మీద మచ్చలను తొలగించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఆరెంజ్ పీల్ ను ఎండబెట్టి, పౌడర్ చేసి, అందులో ఒక టీస్పూన్ పసుపు, తేనె మిక్స్ చేసి వీపు మీద ఉన్న నల్ల మచ్చల మీద అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచిది.

టమోటో గుజ్జు:

టమోటో గుజ్జు:

టమోటో గుజ్జు అద్భుతమైన హోం రెమెడీ. ఇది వీపు మీద మచ్చలు, చారలను నివారిస్తుంది. ఇందులో ఉండే అసిడిక్ లక్షణాల వల్ల నల్ల మచ్చలను ఎఫెట్టివ్ గా తొలగిస్తుంది. టమోటోను ముక్కలుగా కట్ చేసి, ఈ జ్యూస్ ను లేదా గుజ్జును వీపు మీద అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ముల్తాని మట్టి:

ముల్తాని మట్టి:

ముల్తానీ మట్టి ఆయిల్ స్కిన్ లో ఎక్సెస్ ఆయిల్ ను అబ్సార్బ్చేస్తుంది. చర్మ రంద్రాలు తెరచుకునేలా చేసి, నల్ల మచ్చలను క్లియర్ చేస్తుంది. కొద్దిగా ముల్తాని మట్టి తీసుకుని, వీపు మీద అప్లై చేయాలి. అవసరమైతే సాండిల్ వుడ్ పౌడర్ , రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి, నల్ల మచ్చల మీద అప్లై చేయాలి.ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే బ్యాక్ ఏన్స్ తొలగిపోతాయి.

నిమ్మరసం:

నిమ్మరసం:

నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ , నల్ల మచ్చలను తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు మొటిమలు, మచ్చలను సులభంగా తొలగిస్తుంది. నిమ్మకాయ తీసుకుని, రెండు స్లైస్ గా కట్ చేసి, ఈ జ్యూస్ ను వీపు మీద అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

బేకింగ్ సోడ:

బేకింగ్ సోడ:

ఇందులో నేచురల్ ఎక్స్ ఫ్లోయేటింగ్ గుణాలుండటం వల్ల వీపు మీద ఉండే నల్ల మచ్చలను తొలగిస్తుంది. ఇంకా ఇందులో ఉండే యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల బ్లాక్ ఏన్స్ ను సులభంగా తొలగిస్తుంది. కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని, వాటర్ మిక్స్ చేసి నల్ల మచ్చల మీద అప్లై చేస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.

English summary

Best Home Remedies To Get Rid Of Back Acne

Back acne is generally caused when the pores get clogged due to excess production of oil. Sometimes, back acne may be due to accumulation of dead skin cells. Acne on the back can make it difficult to sleep or wear clothes.
Desktop Bottom Promotion