వదులైన స్థనాలు..డీగ్లామరస్ బ్రెస్ట్ షేప్ కు చెక్ పెట్టే బ్రిలియంట్ హోం రెమెడీస్ ..!!

Posted By:
Subscribe to Boldsky

ప్రతి మహిళ అందమైన బ్రెస్ట్ షేప్ , బ్రెస్ట్ సైజ్ కలిగి ఉండాలని కోరుకుంటుంది. అయితే కొంత మంది మహిళల్లో కొన్ని కారణాల వల్ల బ్రెస్ట్ సాగడం జరుగుతుంది. ఇలా వదులైన లేదా సాగిన బ్రెస్ట్ తో అందంగా కనబడకపోగా, స్కిన్ ఎలాసిటి, మరియు స్కిన్ ఫెయిర్ నెస్ మీద ప్రభావం చూపుతుంది.

సహజంగా, మహిళ30 నుండి 40 వయస్సుకు వచ్చే సరికి, ఆమె శరీరంలో కొన్ని సహజ మార్పులు, హార్మోను ల ప్రభావం వల్ల బ్రెస్ట్ సాగడం మొదలవుతుంది. ముఖ్యంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత వయస్సు రిత్యా, మోనోపాజ్, ప్రెగ్నెన్సీ, స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ వంటి కారణాల వల్ల కూడా బ్రెస్ట్ సాగుతుంది. వదులైన స్థనాలు, సరైన షేప్ లేకపోవడం వల్ల బాడీ షేప్ మీద కూడా ప్రభావం చూపి, డీగ్లామరస్ గా మార్చుతుంది.

అంతే కాదు, ఇంకా కొన్ని బ్రెస్ట్ డిసీజెస్ వల్ల కూడా స్థనాలు వదులౌతాయి. ఇలాంటి సమస్యతో మీరు కూడా బాధపడుతుంటే, ఒక సింపిల్ అండ్ ఈజీ మార్గం ఒకటుంది. స్థనాలు వదులు కాకుండా నివారించడంలో కొన్ని హోం రెమెడీస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

అలోవెర మసాజ్

అలోవెర మసాజ్

అలోవెర నుండి జెల్ తీసి, బ్రెస్ట్ కు అప్లై చేసి మసాజ్ చేయాలి. అలోవెరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెస్ట్ ను అందంగా, టైట్ గా మార్చుతాయి. బాగా చల్లగా ఉండే అలోవెర జెల్ తీసుకుని, బ్రెస్ట్ కు అప్లై చేసి మసాజ్ చేయాలి. దీన్ని సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. రోజుకు కనీసం 10 నుండి 15 నిముషాలు మసాజ్ చేసి, ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఎగ్ వైట్

ఎగ్ వైట్

ఎగ్ వైట ను ఉపయోగించడం మరో బెస్ట్ హోం రెమెడీ. ఎగ్ వైట్ స్కిన్ ఎలాసిటిని టైట్ గా మార్చే గుణం ఉంటం వల్ల వదులైన స్థనాలను తిరిగి పూర్వ స్థితికి తీసుకొస్తుంది. చర్మానికి తగిన పోషణను అందివ్వడానికి ఎగ్ వైట్ లో ఉండే ఆస్ట్రిజెంట్ గుణాలు అద్బుతంగా సహాయపడుతాయి. ఒక గుడ్డులోని వైట్ తీసుకుని, దీనికి కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఈ రెండూ బాగా మిక్స్ అయ్యే వరకూ మిక్స్ చేసి, బ్రెస్ట్ కు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేసి, కొద్ది సేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఐస్ మసాజ్

ఐస్ మసాజ్

మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది వదులైన బ్రెస్ట్ ను టైట్ గా మార్చుతుంది. ఒక చిన్న ఐస్ క్యూబ్ తీసుకుని, స్థనాల మీద సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. దాంతో చర్మం ఉత్తేజం అవుతుంది. ఈ చిట్కాను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే, సమస్య క్రమంగా తగ్గుతుంది.

గ్రేప్ సీడ్ ఆయిల్

గ్రేప్ సీడ్ ఆయిల్

ఎసెన్సియల్ ఆయిల్స్ చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మం ఉత్తేజం అవుతుంది. హెల్తీగా మారుతుంది. అందుకు గ్రేప్ సీడ్ ఆయిల్ గొప్పగా సహాయపడుతుంది. గ్రేప్ సీడ్ ఆయిల్ ను బ్రెస్ట్ కు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయడం వల్ల బ్రెస్ట్ టోనింగ్ మెరుగుపడుతుంది. కొద్దిగా గ్రేప్ సీడ్ ఆయిల్ తీసుకుని, బ్రెస్ట్ కు అప్లై చేసి మసాజ్ చేయాలి. 10 నిముషాలు సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కీరదోసకాయ గుడ్డులోని పచ్చ సొన

కీరదోసకాయ గుడ్డులోని పచ్చ సొన

కీరోదసకాయ మరియు గుడ్డులోని పచ్చసొన రెండింటి కాంబినేషన్ ప్యాక్ వల్ల చర్మం పునరుత్తేజం అవుతుంది. ఫెయిర్ గా మారుతుంది. కీరదోసకాయను మెత్తగా పేస్ట్ చేసి, అందులో ఒక గుడ్డులోని పచ్చసొనను మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసి, మొత్తం మిశ్రమాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రెస్ట్ కు అప్లై చేసి సున్నితంగా 10 నిముషాలు మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా 10 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

లెమన్ మసాజ్

లెమన్ మసాజ్

ఫ్రెష్ గా ఉండే లెమన్ జ్యూస్ ను బ్రెస్ట్ కు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల ఇది స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. స్కిన్ ఫెయిర్ గా మార్చుతుంది. ఇది యంగ్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను అందిస్తుంది. నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి లు బ్రెస్ట్ సాగడాన్ని నివారిస్తుంది.

మెంతి మాస్క్

మెంతి మాస్క్

మెంతి మాస్క్ ను ఉపయోగించడం వల్ల బ్రెస్ట్ సాగడం తగ్గుతుంది. మెంతుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ స్కిన్ ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది. స్కిన్ టిష్యులను మెరుగుపరుస్తుంది . కొన్ని మెంతులను తీసుకుని, వాటిని వాటర్ లో మిక్స్ చేయాలి. రాత్రంతా వీటని నీటిలో నానబెట్టి, తర్వాత ఉదయం వీటిని మెత్తగా పేస్ట్ చేసి, దీన్ని చర్మానికి అప్లై చేయాలి. తర్వాత అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి స్థనాల మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బొప్పాయి మాస్క్

బొప్పాయి మాస్క్

బొప్పాయి మాస్క్ ను బ్రెస్ట్ కు ఉపయోగించడం వల్ల ఇది బ్రెస్ట్ స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. బ్రెస్ట్ స్కిన్ సాగకుండా నివారిస్తుంది. చిన్న బొప్పాయి ముక్కను తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో చిటికెడు పసుపు, నిమ్మరసం చేర్చి, బ్రెస్ట్ కు అప్లై చేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

English summary

Brilliant Remedies To Treat Sagging Of Breast

Looking for remedies on how to avoid sagging of breasts? Then this article is just for you. Check out some of the brilliant home remedies to firm and tone up the breasts.
Story first published: Thursday, April 20, 2017, 17:12 [IST]