ఉంగరం గుర్తులు వదిలించుకునే చిట్కాలు

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

దీర్ఘకాలం పాటు ఉంగరాలను పెట్టుకోవడం వలన మీ వేళ్ల చుట్టూ అసహ్యంగా గుర్తులు పడిపోతాయి. వాటిని అలానే వదిలేస్తే శాశ్వతంగా ఉండిపోతాయి. అందుకని చూసిన వెంటనే మొదట్లోనే వాటిని తొలగించుకోవడం మంచిది.

ఈ గుర్తులు వదిలించుకోటానికి అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి ప్రయత్నించవచ్చు. కానీ ఈ చిట్కాలు ఒకవేళ పనిచేయకపోతే, మీరు ఉంగరాన్ని మరో వేలికి పెట్టుకోవడం ఉత్తమం. ఈ అందవికారమైన గుర్తులు ఉంగరాలు గట్టిగా పట్టే వేలికి సాధారణంగా వస్తాయి. బిగుతుగా ఉన్న ఉంగరం అక్కడ చర్మానికి గాలి తగలనివ్వదు. అందుకని అక్కడ తేమ పేరుకుపోయి ఫంగస్ పెరగటం లేదా ఇతర చర్మసమస్యలు వస్తాయి. మీ వేలికి ఉన్న ఉంగరం గుర్తు పడ్డచోట చర్మం ఊడిపోతుంటే, చర్మవైద్యులని సంప్రదించండి. కానీ అదంత తీవ్రంగా లేకపోతే ఇదిగో ఈ కింది చిట్కాలను ప్రయత్నించి చూడండి.

ఏ వేలికి ఉంగరం ధరించడం వల్ల, అది దేనికి సంకేతం ఇస్తుంది

మీ ఉంగరం వేలి గుర్తును మాన్చటానికి, మీ చర్మం దారి అసలు స్థితికి రావటానికి మీరు చేయాల్సింది ఇది. ఇక ఆలస్యం చేయకండి. ఈ సింపుల్ శరీర సంరక్షణ చిట్కాలతో మీ ఉంగరం గుర్తును వదిలించుకోండి.

మృతకణాలను తొలగించుట (ఎక్స్ ఫోలియేషన్)

మృతకణాలను తొలగించుట (ఎక్స్ ఫోలియేషన్)

మీ ఉంగరం గుర్తున్న వేలిని వారానికి రెండుసార్లు ఎక్స్ ఫోలియేట్ చేసి మృత చర్మకణాలను తొలగించటం మంచిది. ఈ చిన్న ట్రిక్ అక్కడ చనిపోయిన చర్మకణాలను తొలగించటంతో, అక్కడి చర్మం నల్లదనం కూడా పోతుంది. ఇదే మీ చర్మాన్ని అక్కడ అందవిహీనంగా కన్పించేలా చేస్తాయి.

సన్ స్క్రీన్ కూడా పనిచేస్తుంది!

సన్ స్క్రీన్ కూడా పనిచేస్తుంది!

కొన్నిసార్లు సూర్యకాంతి వలన ఏర్పడ్డ ట్యాన్ కూడా ఉంగరం వల్ల పడ్డ గుర్తులను కఠినంగా మార్చేసి వదలకుండా ఏడ్పిస్తాయి. అందుకని, బయటకి వెళ్ళేముందు, మీ వేళ్ళకి, చేతులకి కొంచెం సన్ స్క్రీన్ క్రీం రాసుకోని వెళ్ళటం మర్చిపోకండి.

ఇంటి చిట్కాలు

ఇంటి చిట్కాలు

ఇంటి చిట్కాలు వాడి ఉంగరం గుర్తులు మాన్పడం మంచి పద్ధతి. ఒక గిన్నెలో, ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనెను వేయండి.వాటిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని గుర్తు వద్ద రాసి 15 నిమిషాలు అలా వదిలేయండి. వారానికి మూడుసార్లు ఈ మిశ్రమం రాస్తూ ఉంటే ఫలితం కన్పిస్తుంది. ఈ చిట్కా వల్ల మీ వేళ్ళు మృదువుగా, అందంగా కూడా కన్పిస్తాయి.

హెర్బల్ చిట్కాలు

హెర్బల్ చిట్కాలు

హెర్బల్ చిట్కాలు శరీరంలో ఏ భాగానికైనా మేటిగానే పనిచేస్తాయి. మీ వేలికున్న ఉంగరం గుర్తులు పోవటానికి కొంచెం రాస్తే చాలు.

వెడ్డింగ్ రింగ్ ధరించటం యొక్క ప్రాముఖ్యత

మేనిక్యూర్ లు

మేనిక్యూర్ లు

వేలిపై కఠినమైన ఉంగరం గుర్తులను వదిలించుకోడానికి మేనిక్యూర్ సులువైన విధానం. నెలకి రెండుసార్లయినా మేనిక్యూర్, పెడిక్యూర్ లతో మిమ్మల్ని మీరు ముద్దుచేసుకోండి.

మరోవేలిని ప్రయత్నించండి.

ఉంగరం మీ వేలి చర్మాన్ని నాశనం చేస్తుంటే, ఉంగరాన్ని వేరే వేలికి పెట్టుకోడమో, కంసాలి చేత లూజు చేయించుకోటమో మంచిది.

English summary

Tips To Get Rid Of Ring Mark On Finger: 5 Steps To Follow

Does that finger ring mark on your hand look ugly? Here are some of the best ways to get rid of that nasty scar with the help of body care tips.
Story first published: Wednesday, November 15, 2017, 8:00 [IST]
Subscribe Newsletter