For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్తగా తెచ్చుకున్న పాదరక్షలతో చాలా ఇబ్బంది పడుతున్నారా..కరుస్తున్నాయా..?

కొత్త చెప్పులు కరిచినప్పుడు వెంటనే ఏదో ఒక యాంటీ సెప్టిక్ క్రీమ్ లేదా లోషన్స్ అప్లై చేస్తుంటారు. అయితే వీటికి బదులుగా న్యాచులర్ రెమెడీస్ ను ఫాలో అయితే మంచిది.

By Lekhaka
|

షాపింగ్ చేయడం అంట్ మహిళలకు చాలా ఇష్టం . షాపింగ్ లో అందమై డ్రస్సులు, యాక్ససరీస్, ఎంతో ఇష్టంగా కొత్త డిజైను చెప్పుల్ని కొనుక్కుంటాం. కానీ ఒకటి రెండు రోజులు వాటివల్ల చర్మం రాపిడికి గురై.. పాదాలపై పుండు పడి తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది. కొత్త చెప్పులన్న సంతోషం రెండు రోజుల కూడా ఉండదు ఈ సమస్యను తగ్గించుకోవాలంటే..

అవి వేసుకోవటం వల్ల కాళ్ళు ఎక్కువగా వాపు వచ్చి ఒత్తిడికి పాదాలపై గాయలు, నొప్పి, వాపు వంటివి చాలా ఇబ్బంది పడుతుంటారు. సరైన సైజు ఎంపిక చేసుకోకపోవడం వల్ల సర్ఫేష్ సరిగే లేకపోవడం వల్ల చర్మంలో స్కార్స్, బ్లిస్టర్స్ మరియు నొప్పి కలుగుతుంది. అలాంటి చెప్పులను కానీ, షూలను కానీ మరో సారి వేసుకోవాలంటే భయపడుతుంటారు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఆ కొత్త షూలను రీప్లేస్ చేయడం లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

 Top 10 Home Remedies For Shoe BitesSave

కొత్త చెప్పులు కరిచినప్పుడు వెంటనే ఏదో ఒక యాంటీ సెప్టిక్ క్రీమ్ లేదా లోషన్స్ అప్లై చేస్తుంటారు. అయితే వీటికి బదులుగా న్యాచులర్ రెమెడీస్ ను ఫాలో అయితే మంచిది. చాలా సింపుల్ గా ఈ రెమెడీస్ ను ఎలా వాడాలో తెలుసుకుందాం...

1. ఐస్ క్యూబ్స్

1. ఐస్ క్యూబ్స్

షూ బిట్స్ ను నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఐస్ క్యూబ్స్ సహాయపడుతాయి. రెండు మూడు ఐస్ క్యూబ్ లను ఒక క్లాత్ లో చుట్టు ప్రభావిత ప్రదేశంలో అప్లై చేసి మర్ధన చేయాలి. ఇది నొప్పిని నివారించడం మాత్రమే కాదు, ఇది వాపు కూడా తగ్గిస్తుంది.

2. కలబంద

2. కలబంద

కలబందలో నయం చేసే గుణాలు ఉన్నాయి, అలోవెర లీప్ నుండి జెల్ తీసి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే ఇన్ స్టాంట్ రిలీఫ్ ఇస్తుంది. ముందు ముందు ఎలాంటి స్కార్స్ లేకుండా చేస్తుంది.

3. ఆస్పిరిన్

3. ఆస్పిరిన్

ఆస్పిరిన్ అనాగానే ఆశ్చర్యం కలుగుతుంది, అియతే ఇది నిజం షూ బిట్స్, స్కార్స్, బ్లిస్టర్స్ ను తొలగిస్తుంది. ఆస్పిరిన్ మాత్ర తినాల్సిన పనిలేదు, ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు షూబిట్స్ తో పాటు,వాపు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మాత్రను మెత్తగా పొడి, చేసి, వాటర్ కలిపి పేస్ట్ లా చేసి షూకరిచిన చోట అప్లై చేయాలి.

4. ఆలివ్ మరియు బాదం

4. ఆలివ్ మరియు బాదం

ఆలివ్ నూనె మరియు బాదం నూనెను రెండూ మిక్స్ చేసి షూ కరిచిన చోట అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేయడం వల్ల ఇన్ స్టాంట్ గా ఉపశమనం పొందవచ్చు.

5. టూత్ పేస్ట్

5. టూత్ పేస్ట్

చర్మానికి టూత్ పేస్ట్ అప్లై చేయడం వల్ల ఇన్ స్టాంట్ రిలీఫ్ దొరుకుతుంది. స్కిన్ బ్లిస్టర్స్ ను నయం చేస్తుంది. మెంథాల్, హైడ్రోజన్ పెరాక్సైడ్, మరియు బేకింగ్ సోడ వంటి కాంపౌండ్స్ ఉండటం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వైట్ టూత్ పేస్ట్ ను అప్లై చేసి, బాగా డ్రై అయిన తర్వాత నీటితో కడిగేసుకోవాలి.

6. తేనె

6. తేనె

తేనె అనేక చర్మ సమస్యలను నివారిస్తుంది. షూబిట్స్ ను, స్కార్స్, స్పాట్స్ ను కూడా తొలగించడంలో తేనె గ్రేట్ రెమెడీ. తేనెను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. ఆర్గానిక్ హనీ, అప్లై చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

7. బియ్యం పిండి

7. బియ్యం పిండి

బియ్యం పిండి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ, ఇది నొప్పితో పాటు, స్కార్ కూడా తొలగిస్తుంది. ఇది మంచి ఎక్సఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. బియ్యం పిండిని మెత్తగా పేస్ట్ చేసి నీళ్ళు కలిపి పేస్ట్ లా చేసి, షూ బిట్స్ మీద అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. రోజులో రెండుమూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

8. కొబ్బరి నూనె మరియు కర్పూరం

8. కొబ్బరి నూనె మరియు కర్పూరం

వర్జిన్ కోకనట్ ఆయిల్ ను కర్పూరంతో కలిపి , బాగా మర్ధన చేసిన తర్వాత షూబిట్స్ మీద అప్లై చేయాలి. త్వరగా నయం అవుతుంది

9. వేప మరియు పసుపు

9. వేప మరియు పసుపు

వేప ఆకు కొద్దిగా తీసుకుని, అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి షూ కరిచిన ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా నయం అవుతుంది. ఈ స్మూత్ పేస్ట్ ను బ్లిస్టర్స్ మీద అప్లై చేసి, డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ తో కడగాలి.దీన్ని రోజుకు రెండు సార్లు ఉపయోగించుకోవచ్చు.

10. పెట్రోలియం జెల్లీ

10. పెట్రోలియం జెల్లీ

చర్మం చాలా సాప్ట్ గా ఉన్నా కూడా షూ బిట్స్ చాలాచీకాకు కలిగిస్తుంది. కామన్ పెట్రోలియం జెల్లీని కాళ్ళు నీళ్ళతో కడిగి తర్వాత తడి ఆరిన తర్వాత పెట్రోలియం జెల్లీ అప్లై చేసి మసాజ్ చేయాలి. రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే గాయంతో పాటు మచ్చలు కూడా తొలగిపోతాయి.

English summary

Top 10 Home Remedies For Shoe BitesSave

While you can certainly apply antiseptic cream or lotion on blisters and scars caused by a shoe bite, you also have the choice to go all natural and treat that nasty bite at home. Simply, resort to some of the below tried and tested home remedies to take care of the marks and pain that are the unwelcome banes of an ill fitting pair of shoes..
Desktop Bottom Promotion