Latest Updates
-
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు! -
వడగాల్పుల ఎఫెక్ట్: ఎండల నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
మోహిని ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
కన్యా రాశిలోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే, పనుల్లో వేగం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ధనలాభం ఖాయం! - సోమవారం, 27 ఏప్రిల్ 2026
మీరు ఉపయోగించే షేవింగ్ క్రీమ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?
మీరు ఉపయోగించే షేవింగ్ క్రీమ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?
అవాంఛితమైన జుట్టును తొలగించేందుకు అనేకమైన పద్ధతులు ఉన్నప్పటికీ, షేవింగ్ ప్రక్రియ ద్వారా జుట్టును తొలగించడమనేది అత్యంత సాధారణమైన & సులభమైన మార్గాలలో ఒకటిగా భావిస్తారు. మీరు ఏ ఫంక్షన్కైనా (లేదా) ఏ పార్టీకైనా హడావిడిగా వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లయితే అవాంఛితమైన చోట్ల తొలగించడానికి చాలా తక్కువ సమయాన్ని తీసుకున్న ఈ టెక్నిక్ను ఎక్కువ మంది మహిళలు ఇష్టపడతారు. ఈ టెక్నిక్ ద్వారా మీరు అందంగా కనిపించడానికి, మీరు ఎక్కువగా ఇష్టపడే చిన్న స్కర్ట్స్ (లేదా) ఇతర మోడ్రన్ డ్రెస్సులను ధరించే అవకాశాలను పెంచుతుంది. కానీ మేము అడిగే ప్రశ్న ఏమిటంటే, మీరు సరైన మార్గంలోనే షేవింగ్ చేస్తున్నారా ?
మనలో ఎంతమంది అవాంఛితమైన జుట్టును తొలగించేందుకు షేవింగ్ క్రీమ్ను ఉపయోగిస్తున్నారు ? ఈ విషయంలో షేవింగ్ క్రీములు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయా, అయితే అవి ఏమిటి ?
ఈరోజు వ్యాసంలో, జుట్టును తొలగించే నివారణ పద్ధతులలో షేవింగ్ క్రీమ్ తప్పక ఎందుకు ఉపయోగించాలో మనం తెలుసుకుందాం !

షేవింగ్ క్రీమ్ మీ చర్మాన్ని కాపాడుతుంది :-
షేవింగ్ జెల్స్ (లేదా) క్రీములు మీ మృదువైన చర్మాన్ని అనేక విధాలుగా పరిరక్షిస్తుంది. ఇది మీ చర్మానికి & రేజర్ బ్లేడ్కు మధ్య రక్షణ పొరగా పనిచేస్తుంది. షేవింగ్ చేసే టైంలో మీ చర్మానికి ఎలాంటి గాయాలు ఏర్పడకుండానూ & మృదువుగా షేవ్ని ఇది మీకు అందిస్తుంది.
హైడ్రేషన్ను అందిస్తుంది :-
షేవింగ్కి ముందు మీ చర్మాన్ని & జుట్టును రెండింటిని హైడ్రేటింగ్గా చేయటం వల్ల మీరు చేసే షేవింగ్ చాలా మృదువుగా, సులభంగా ఉంటుంది. షేవింగ్లో సబ్బు & నీళ్లు మాత్రమే ఇక్కడ పని చేయదు. మీరు ఉపయోగించే సబ్బు మీ చర్మంపై ఉన్న అదనపు దుమ్మును & శ్లేష్మమును తొలగించడంలో సహాయపడుతుంది కాబట్టి ఇది మీ చర్మాన్ని పొడిగా మార్చటమే కాకుండా, మీ చర్మాన్ని మరింత కఠినంగా కూడా తయారు చేస్తుంది. కానీ, మీరు ఉపయోగించే నీరు ఎలాంటి పనిని కూడా చేయలేదు. కానీ మీరు ఉపయోగించే షేవింగ్ క్రీమ్ మీ చర్మాన్ని మరియు జుట్టును హైడ్రేటింగ్ చేసి, అవాంచిత రోమాలను కూడా చాలా మృదువుగా తొలగిస్తుంది.
సరైన పద్ధతిలో షేవ్ చేయాలి :-
సబ్బు & నీటితో షేవింగ్ చేయడం వల్ల మీకు చికాకును కలిగిస్తుంది ఎందుకంటే, ఇలాంటి పద్ధతిలో షేవ్ చేయడం వల్ల ఆ చర్మ ప్రాంతం క్లియర్గా ఉండదు. కానీ, మీరు ఒక షేవింగ్ క్రీమ్ను / జెల్ను ఉపయోగించినట్లయితే - మీరు అప్పటికే షేవ్ చేసిన చర్మ ప్రాంతాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. ఒకే ప్రాంతంలో అదేపనిగా మీరు షేవింగ్ చేయడం వల్ల చర్మాన్ని దెబ్బతీయడమే కాకుండా, మీకు చికాకు కలిగిస్తుంది.
జుట్టు పెరిగేలా చేస్తుంది :-
అవును మీరు చదివింది నిజమే. మీరు షేవింగ్ క్రీమ్ను వ్యతిరేక దిశలో అప్లై చేయడం వల్ల తిరిగి ఇది మీ జుట్టును పెంచడంలో సహాయపడుతుంది. చర్మానికి వ్యతిరేకంగా నొక్కినట్లుగా ఉన్న జుట్టును కూడా స్మూత్గా తొలగించడంలో సహాయపడుతుంది.
కొన్ని షేవింగ్ చిట్కాలు :-
1. మీ చర్మానికి తగినట్లుగా ఉండే షేవింగ్ క్రీమ్ను ఎంచుకోండి. మార్కెట్లో చాలా రకాల షేవింగ్ క్రీములు మనకు అందుబాటులో ఉన్నాయి. షేవింగ్ క్రీములన్నీ కూడా అన్ని రకాల చర్మాల పై ఒకేవిధంగా పనిచేయవు. పొడిగా, సున్నితంగా, సాధారణంగా ఉండేటటువంటి చర్మాల పూర్తి సంరక్షణకై తగిన షేవింగ్ క్రీమ్ను ఎంచుకోండి.
2. జుట్టు ఎదుగుదలకు వ్యతిరేక దశలో ఎల్లప్పుడూ షేవింగ్ చేయండి.
3. షేవింగ్ చేసిన తర్వాత మీ చర్మాన్ని సంరక్షించే మాయిశ్చరైజర్లను ఉపయోగించడం ద్వారా మీ చర్మానికి ఎలాంటి చికాకులను కలుగజేయదు.
4. షేవింగ్ చేసుకున్న తర్వాత డియోడ్రెంట్ / బాడీ స్ప్రే వంటి సాధనాలను ఉపయోగించకండి ఎందుకంటే, ఇవి మీ చర్మంపై చికాకును కల్గించవచ్చు.
5. తరచుగా ఉపయోగించిన రేజర్ బ్లేడ్లను మళ్ళీ మళ్ళీ ఉపయోగించవద్దు. రేజర్ బ్లేడ్లను ఉపయోగించని విరామ సమయంలో అవి కొంతవరకు నష్టపోతాయి. అవే బ్లేడ్లను మీరు ఉపయోగిస్తే అవి మీ చర్మానికి నష్టాన్ని కలిగించవచ్చు. కనుక మీ రేజర్ బ్లేడ్లను తరచుగా మార్చడం మంచిది.



Click it and Unblock the Notifications