Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
చర్మ కేశ సంరక్షణకు వేపాకులతో గృహ చికిత్స
అందమైన మెరిసే చర్మం మరియు ఏ సమస్య లేని జుట్టు ప్రతి యువతి యొక్క కల. పొడవైన, దట్టమైన, పట్టు కుచ్చు వంటి జుట్టు అందంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెంచుతాయి.
నేటి జీవనశైలి కారణంగా జుట్టు రాలడం, చిన్నవయసులోనే జుట్టు నెరవడం, కాంతివిహీనమైన చర్మం వంటి అనేక సౌందర్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితులు కాలుష్యం, సరైన ఆహారం తీసుకోకపోవడం, విటమిన్ల లోపం వలన కూడా కావచ్చు.
ఈ సమస్యలను అన్నిటినీ సహజంగా పరిష్కరించుకోవడం ఉత్తమం. అన్ని రకాల చర్మ మరియు శిరోజాల సంబంధిత సమస్యలకు ఏకైక పరిష్కారం వేప ఆకులు.

శతాబ్దాలుగా వేప ఆకులు తమ యాంటీబాక్టీరియల్ గుణాలకు పేరెన్నికగన్నవి. వీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవి చర్మ మరియు శిరోజ సమస్యల నుండి విముక్తినిస్తాయి. వేపాకులలో పుష్కలంగా ఉండే పోషకాలు, విటమిన్లు జుట్టు ఎదుగుదలను ప్రోత్సాహించి మరియు చర్మాన్ని సంరక్షించి సౌందర్య సమస్యలను దూరం చెస్తాయి. వేపాకులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు అమైనో ఆమ్లాలు జుట్టు రాలడాన్ని అరికడతాయి.
ఇప్పుడు మనం వేపాకుల ద్వారా ఎన్ని రకాలుగా మేలు పొందవచ్చో తెలుసుకుందాం.
చర్మసంరక్షణ కొరకు:

1. మెరిసే మేనిఛాయకై:
వేపాకులను బ్లెండర్ లో వేసి మెత్తగా రుబ్బండి. దీనికి చిటికెడు పసుపు కలపండి. ఈ ముద్దను రెండు రోజుల పాటు ముఖానికి రాసుకుంటే మెరిసే చర్మం తప్పకుండా మీ సొంతమవుతుంది. మొటిమల సమస్య ఉన్నవారికి ఇది బాగా సహాయపడుతుంది.

2. ముడుతలు లేని చర్మం కొరకు:
కొంత వేపాకు పొడిని మరియు ముల్తానా మటని్టి తీసుకుని దానికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించండి. బాగా ఆరాక ముఖాన్ని శుభ్రంగా కడగండి. వేపాకులు చర్మంలో ఉండే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మారుస్తాయి. ముల్తానా మట్టి చర్మంపై అధికంగా పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది.

3. మొటిమల యొక్క మచ్చలను తొలగిస్తుంది:
మొటిమలు మిగిల్చిన మచ్చలు చాలా మొండివి. అంత త్వరగా వదిలిపెట్టవు. వాటికి వేపాకులతో చికిత్స చేయవచ్చు. కొన్ని వేపాకులను ముద్దగా రుబ్బి, దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. మొటిమలు అధికంగా ఉండే చోట రాసుకుని 10-12 నిమిషాల తరువాత నీటితో కడిగేయండి. నిమ్మరసం సహజమైన యాస్ట్రిజంట్ గుణాలను కలిగి ఉంటుంది. క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది.
కేశ సంరక్షణ కొరకు:

1. జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది:
వేపాకులలో సహజంగా జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు ఉన్నాయి. కనుక జుట్టు బాగా పెరగడానికి ఇవి ఉపయోగకరమైనవి.
కొన్ని వేపాకులలో పెరుగు వేసి మెత్తని ముద్దగా నూరండి. దీనిని కుదుళ్ల నుండి చివర్ల వరకు జుట్టుకు బాగా పట్టించండి. మంచి ఫలితాల కొరకు వారానికి రెండుసార్లు ఇలా చేయండి.

2. జుట్టు రాలడాన్ని అరికడుతుంది:
వేపాకుల జుట్టు పలుచబడకుండా చేసి రాలడాన్ని తగ్గిస్తుంది. కొన్ని వేపాకులలో పాలు వేసి మెత్తని ముద్ద చేయండి. దీనిని జుట్టుకు పట్టించి గంట తరువాత శుభ్రంగా కడగండి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

3. చిన్న వయసులోనే జుట్టు నెరవడాన్ని తగ్గిస్తుంది:
వైద్య పరంగా జుట్టు చిన్న వయస్సులో నెరవడానికి అనేక కారణాలు ఉన్నాయి. రసాయనాలు అధికంగా వాడటం, ఒత్తిడి మరియు వంశపారంపర్యం వలన కూడా ఇలా జరగవచ్చు. ఇటువంటి సమస్యలకు వేపాకులు పరిష్కారం చూపిస్తాయి. కొంచెం ఆలివ్ ఆయిల్ ను తీసుకుని వేడిచేసి అందులో వేపాకులను వేయండి. నూనె రంగు ఆకుపచ్చగా మారిన తరువాత దానిని జుట్టుకు, మాడుకు బాగా పట్టించి 30 నిమిషాల తరువాత కడిగేయండి.

4. రసాయన చికిత్స వలన హాని జరిగిన కేశాలకు:
రసాయన చికిత్స వలన జుట్టు బలాన్ని కోల్పోతుంది.కనుక కేశ నిపుణులు రసాయన చికిత్స అనంతరం జుట్టుపై సరైన శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తారు. ఇటువంటి సందర్భంలో వేపాకులు మీకు సహాయపడతాయి. కొంచెం కొబ్బరినూనెను తీసుకుని వేడిచేసి అందులో వేపాకులను బాగా నాననివ్వండి. దీనిని జుట్టుకు, మాడుకు బాగా పట్టించి తరువాత షాంపూతో కడిగేయండి.

5. మీ ఆహారంలో భాగంగా మార్చుకోండి:
ఆరోగ్యంగా ఉండే బలమైన జుట్టు కావాలనుకుంటే బయటనుండే కాకుండా లోపలనుండి కూడా పోషణను అందించాలి. శరీరానికి కూడా బాహ్యపోషణ మరియు అంతః పోషణ రెండూ అవసరం. మీ ఆహారంలో వేపాకులపొడిని లేదా ఆకులను భాగంగా చేసుకోండి. వేపాకులు వేసి మరగబెట్టిన నీటిని తాగితే జుట్టును సంరక్షించడంతో పాటుగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుకుంటారు. పుదీనా ఆకులతో పాటుగా వేపాకులను పచ్చిగా తీసుకోవచ్చు.



Click it and Unblock the Notifications
