For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తొడల మద్య సెగ గడ్డలతో భాదపడుతున్నారా ? అయితే ఈ సహజ నివారణా చిట్కాలు మీకోసమే.

|

తొడల మద్య భాగాలలో కొన్ని అసాధారణ ఇన్ఫెక్షన్లు, జీవన శైలి, ఆహార ప్రణాళికల లోపాలు మరియు కాలాల మార్పుల కారణంగా సెగ గడ్డల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వీటిని బాయిల్స్ అని కూడా అంటారు. క్రమంగా ఇవి మీ రోజూవారీ కార్యాచరణల మీద కూడా తీవ్రమైన ప్రభావాలను చూపుతుంటాయి. ఇవి పేరుకు తక్కువ పరిమాణంలో ఉన్నా కూడా, నొప్పి మరియు చికాకుని కూడుకుని అసౌకర్యంతో కూడిన భయంకరమైన అనుభూతికి గురిచేయవచ్చు. నడక దగ్గర నుండి ప్రతి పనిలోనూ అసౌకర్యానికి గురిచేస్తూ, సమస్య ఉన్న కొద్ది రోజులు కూడా నరకాన్ని తలపిస్తుంది.

తొడల మీద ఉండే జుట్టు కుదుళ్ళు బాక్టీరియా సంక్రమణకు లోనైనప్పుడు సెగ గడ్డలు ఏర్పడుతుంటాయి. ఇవి అధికమైన దురద మరియు చీముతో కూడుకుని బాధాకరంగా ఉంటాయి. ఈ సెగ గడ్డలు, షేవ్ చేయడం వలన కలిగే గాయాలు మరియు ఇన్ఫెక్షన్ల వంటి ఇతర కారణాల వలన కూడా సంభవించవచ్చు.

Natural Remedies To Treat Boils On The Inner Thighs

కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఈ సెగ గడ్డల చికిత్సకు అద్భుతమైన సహజ సిద్దమైన నివారణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని సంపూర్ణంగా తొలగించడానికి క్రింద పొందుపరచిన గృహ నివారణా చిట్కాలను పాటించండి.

1. ఎప్సోమ్ ఉప్పు :

1. ఎప్సోమ్ ఉప్పు :

ఎప్సోమ్ ఉప్పు సెగ గడ్డల చుట్టు పక్కల ప్రాంతం నుండి తేమను తొలగించడంలో సహాయపడుతుంది. క్రమంగా పుండు పడిన తొడల భాగాలను సడలించడంలో సహాయం చేయగలుగుతుంది.

కావలసినవి :

2 టేబుల్ స్పూన్ల ఎప్సోమ్ ఉప్పు

1 కప్పు వెచ్చని నీరు

ఉపయోగించు విధానం :

వెచ్చని నీటిలో ఎప్సోమ్ ఉప్పును కలపండి. ఒక మృదువైన కాటన్ క్లాత్ తీసుకొని ఈ వెచ్చని నీటిలో ముంచి, అదనపు నీటిని పిండి, తొలగించండి. ప్రభావిత ప్రాంతంలో ఈ వెచ్చని తడి గుడ్డను ఉంచి, గది ఉష్ణోగ్రత వరకు వచ్చే వరకు దానిని అలాగే ఉండనివ్వండి.

2. వెల్లుల్లి :

2. వెల్లుల్లి :

వెల్లుల్లిలోని శోథ నిరోధక మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మంపై ఎటువంటి వాపునైనా తొలగించడంలో సహాయపడుతాయి.

కావలసిన పదార్ధాలు :

2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలు

ఉపయోగించు విధానం :

తాజా వెల్లుల్లి రెబ్బలను తీసుకుని, దాని పైతొక్కను తొలగించండి. తర్వాత వీటిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరుచేసి తొలగించండి. ఈ వెల్లుల్లి రసంలో ఒక కాటన్ బాల్ లేదా కాటన్ ప్యాడ్ ముంచి, సెగ గడ్డలు ఉన్న ప్రాంతంలో వర్తిచండి. చర్మం వెల్లుల్లి రసాన్ని పూర్తిగా గ్రహించిన పిమ్మట, సెగ గడ్డలను తొలగించుటలో ప్రభావాన్ని చూపిస్తుంది.

Most Read: మా తమ్ముడి ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకునేదాన్ని, బాత్రూం టవల్ కట్టుకునేదాన్ని #mystory292

3. కలబంద (అలోవెరా) :

3. కలబంద (అలోవెరా) :

అలోవేరా దాని వైద్య లక్షణాలతో ప్రసిద్ధి చెందింది మరియు ఇది చర్మం వాపును త్వరగా తగ్గిస్తుంది.

కావలసినవి :

1 అలోవేరా ఆకు

ఉపయోగించే విధానం :

ఒక కలబంద ఆకును తీసుకుని, దాని పైతొక్కను తొలగించి, అంచులు కత్తిరించి, దాని నుండి తాజా కలబంద గుజ్జుని బయటకు తీయండి. దీనిని ప్రభావిత ప్రాంతాల్లో వర్తించి 20 నుండి 30 నిముషాల పాటు వదిలివేయండి. ఉత్తమ ఫలితాల కోసం రోజులో 2 నుండి 3 సార్లు కలబంద గుజ్జును ప్రభావిత ప్రాంతంలో వర్తించండి.

4. వైట్ టూత్పేస్ట్ :

4. వైట్ టూత్పేస్ట్ :

ముఖం మీద మొటిమలను వదిలించుకోవడానికి మనం తరచుగా టూత్ పేస్టును ఉపయోగిస్తూ ఉంటాము. అదేవిధంగా టూత్ పేస్టును సెగ గడ్డల చికిత్సలో కూడా ఉపయోగించవచ్చు. ఇది తేమను గ్రహించి, క్రమంగా సెగ గడ్డలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కావలసినవి :

వైట్ టూత్పేస్ట్

ఉపయోగించు విధానం :

మీ చేతుల్లోకి కొంచం టూత్ పేస్టుని తీసుకోండి, దీనిని తొడల మద్య సెగ గడ్డలు గల ప్రాంతంలో సున్నితంగా వర్తించండి. కొంత సమయం పాటు గాలికి ఉంచండి, పొడిగా మారిన తర్వాత, తడి మరియు మృదువైన బట్టలను ఉపయోగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయండి.

Most Read: నాకు కలిగిన కోరికల వల్ల అలా చేశా, ఇద్దరిని మెయింటెన్ చేశా, మంచి ఇల్లాలిగా మారాను #mystory294

5. బంగాళా దుంపలు :

5. బంగాళా దుంపలు :

బంగాళా దుంపలలోని యాంటీ మైక్రోబయల్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఈ సెగ గడ్డలను నయం చేయడంలో ఎంతగానో సహాయం చేస్తాయి.

కావలసిన పదార్ధాలు :

చిన్న బంగాళాదుంప ఒకటి

కాటన్ బాల్

ఉపయోగించు విధానం :

బంగాళాదుంప పైతొక్కను తొలగించి, గ్రైండ్ చేసి, రసాన్ని వేరు చేయండి. ఒక కాటన్ బాల్ సహాయంతో, ప్రభావిత ప్రాంతంలో ఈ బంగాళాదుంప రసాన్ని వర్తించండి. అది పూర్తిగా ఆరిపోయే వరకు అలాగే వదిలి, తరువాత చల్లటి నీటితో శుభ్రపరచండి. ఉత్తమ ఫలితాల కోసం వారంలో కనీసం రెండు సార్లు అనుసరించండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Natural Remedies To Treat Boils On The Inner Thighs

Boils occur when the hair follicles are infected by bacteria. These boils can be painful, itchy and also be filled with pus. Boils can also occur due to skin damage by shaving or any other irritation on the skin. Epsom salt, garlic cloves, aloe vera, toothpaste, potatoes etc., can be used to treat boils at home.
Story first published: Saturday, November 3, 2018, 17:20 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more