స్ట్రాబెర్రీస్ ద్వారా చర్మానికి అలాగే శిరోజాలకు కలిగే 10 అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ఇవే

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

స్ట్రాబెర్రిస్ అనేవి సౌందర్య పోషణకు తోడ్పడే అత్యద్భుతమైన బ్యూటీ ఇంగ్రిడియెంట్ గా ప్రసిద్ధి చెందిన ఒక ఫ్రూట్. విటమిన్ సీ, సాలిసైక్లిక్ యాసిడ్, మినరల్స్ అలాగే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వీటిలో పుష్కలంగా లభిస్తాయి. అందువలన, ఈ బ్యూటీ ఇంగ్రిడియెంట్ ద్వారా మీ చర్మానికి అలాగే శిరోజాలకు చక్కని పోషణ లభిస్తుంది. తద్వారా, చర్మకాంతి మిమ్మల్ని మెరిసేలా చేస్తుంది. శిరోజాల సౌందర్యం మీ సొగసును మరింత రెట్టింపు చేస్తుంది.

ఈ అద్భుతమైన ఇంగ్రిడియెంట్ ని తమ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకున్న మహిళలు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వీటిని, బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకోవడం ద్వారా వారంతా తమ చర్మకాంతిని అలాగే శిరోజాల మెరుపును సంరక్షించుకుంటూ వస్తున్నారు.

10 Wonderful Beauty Benefits Of Strawberries For Skin And Hair

ఈ ఫ్రూట్ ని బ్యూటీ పర్పస్ కోసం ఇంకా మీరు ప్రయత్నించి ఉండకపోతే, ఇవాళ్టి పోస్ట్ అనేది మీకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఈ రోజు బోల్డ్ స్కై లో, స్ట్రాబెర్రీస్ ని చర్మ సౌందర్యానికి అలాగే శిరోజాల సంరక్షణకు ఏ విధంగా వాడాలో వివరించాము.

పోషకాలు పుష్కలంగా లభించే ఈ ఫ్రూట్ అనేది మీ బ్యూటీ రొటీన్ లో కచ్చితంగా భాగమవ్వాలి. మీ చర్మ సౌందర్యాన్ని అలాగే శిరోజాల సౌందర్యాన్ని మరింత పెంపొందించేందుకు ఈ ఫ్రూట్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే, ఖరీదైన కమర్షియల్ బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే మెరుగైన ఫలితాన్నిస్తుంది ఈ ఫ్రూట్ రెమెడీ.

ఈ సీజన్ లో దొరికే స్ట్రాబెరీ తిను.. ఆరోగ్యాన్ని పెంపొందించుకో...!

అంతేకాకుండా, శిరోజాల అలాగే చర్మ సంరక్షణకై ఈ బెర్రీస్ ని అనేక మార్గాలలో ఉపయోగించవచ్చు. వివిధ స్కిన్ ఆలాగే హెయిర్ టైప్స్ కు ఈ బెర్రీస్ సూట్ ఆ అవుతాయని తెలిసినా ఈ బెర్రీస్ ని చర్మ సంరక్షణకు అలాగే శిరోజాల పోషణకు వాడే ముందు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరని గుర్తించండి. ఆ తరువాతే, మీ బ్యూటీ రొటీన్ లో వీటికి స్థానం ఇవ్వండి.

స్ట్రాబెర్రీస్ ద్వారా చర్మానికి అలాగే శిరోజాలకు కలిగే అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ఇవే.

చర్మానికి కలిగే ప్రయోజనాలు

చర్మానికి కలిగే ప్రయోజనాలు

1. చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది:

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగివుండటం వలన చర్మంలోని లోతైన పొరలలోకి కూడా ప్రవేశించి టాక్సిన్స్ ను అలాగే ఇంప్యూరిటీస్ ను తొలగించేందుకు ఈ ఫ్రూట్ అనేది అమితంగా ఉపయోగపడుతుంది. ఖరీదైన ఫేసియల్ క్లీన్సర్స్ ని వాడే బదులు స్ట్రాబెర్రిస్ ని వాడితే చర్మం క్లీన్ గా మారుతుంది.

చర్మానికి కలిగే ప్రయోజనాలు

చర్మానికి కలిగే ప్రయోజనాలు

2. డెడ్ స్కిన్ సెల్స్ ని ఎలిమినేట్ చేస్తుంది:

స్ట్రాబెర్రిస్ లో లభించే సాలిసైక్లిక్ యాసిడ్ అనేది స్కిన్ పోర్స్ నుంచి డెడ్ స్కిన్ సెల్స్ ను ఎలిమినేట్ చేసేందుకు తోడ్పడుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించుకోవడం వలన వికారమైన బ్లాక్ హెడ్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

చర్మానికి కలిగే ప్రయోజనాలు

చర్మానికి కలిగే ప్రయోజనాలు

3. అదనపు సెబమ్ ని గ్రహిస్తుంది:

స్ట్రాబెర్రిస్ ద్వారా చర్మానికి కలిగే మరొక ముఖ్యమైన బ్యూటీ బెనిఫిట్ ఇదే. చర్మంలో నుండే అదనపు నూనెను లేదా సెబమ్ ను గ్రహించే సామర్థ్యం స్ట్రాబెర్రీస్ లోని బ్యూటీ ప్రాపర్టీస్ కు కలదు. ఈ ఫ్రూట్ లో లభించే విటమిన్ సి అనేది చర్మంలోని అదనపు నూనెను తొలగించి బ్రేక్ అవుట్స్ ని తొలగిస్తుంది. అందుకే, ఆయిలీ స్కిన్ ప్రాబ్లెమ్స్ ని తొలగించేందుకు ఈ ఫ్రూట్ ని ఎక్కవగా ఉపయోగిస్తారు.

చర్మానికి కలిగే ప్రయోజనాలు

చర్మానికి కలిగే ప్రయోజనాలు

4. చర్మంలోని మెరుపుని పెంచుతుంది:

చర్మానికి మెరిసే కాంతిని ప్రసాదించేందుకు ఈ అద్భుతమైన ఫ్రూట్ ఉపయోగపడుతుంది. విటమిన్ సీతో పాటు మరిన్ని స్కిన్ బెనిఫిటింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన చర్మకాంతి మరింత వృద్ధి చెందుతుంది. మార్కెట్ లో లభించే ప్రోడక్ట్స్ కంటే ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది.

చర్మానికి కలిగే ప్రయోజనాలు

చర్మానికి కలిగే ప్రయోజనాలు

5. ఏజింగ్ సైన్స్ ను వాయిదా వేస్తుంది:

స్ట్రాబెర్రిస్ ను బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకోవడం వలన ఫైన్ లైన్స్, ముడతలు, సాగింగ్ స్కిన్ వంటి ఏజింగ్ సమస్యలు త్వరగా చర్మంపై దర్శనమివ్వవు. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలోని కొలాజెన్ ఉత్పత్తిని పెంపొందించి చర్మంలోని ఎలాసిటీని మెరుగుపరుస్తాయి.

జుట్టు సంరక్షణకు స్ట్రాబెర్రీస్ ఎలా ఉపయోగపడతాయి ?

శిరోజాల సంరక్షణ కోసం

శిరోజాల సంరక్షణ కోసం

6. ప్రోడక్ట్ బిల్డ్ అప్ ని అరికడుతుంది:

స్కాల్ప్ ని ఎక్స్ఫోలియేట్ చేసేందుకు స్ట్రాబెర్రీ అమితంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా, స్కాల్ప్ లో ప్రోడక్ట్ బిల్డ్ అప్ ని అరికడుతుంది. తద్వారా, ఇన్ఫెక్షన్స్ ని దూరంగా ఉంచుతుంది. అలాగే, స్కాల్ప్ లో డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి డాండ్రఫ్ ని దూరంగా ఉంచడానికి కూడా స్ట్రాబెర్రీలోని బ్యూటీ ప్రాపర్టీస్ ఉపయోగపడతాయి.

English summary

6 Wonderful Beauty Benefits Of Strawberries For Skin And Hair

There are tons of different ways in which you can treat your skin and hair with these berries. Though these berries are known to suit different hair and skin type, it is always best to do a patch test before incorporating it in the beauty routine.
Story first published: Thursday, February 15, 2018, 13:00 [IST]