క్రాక్డ్ హీల్స్ ను ఈ రెమెడీస్ తో తగ్గించుకోండి

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

హీల్ ఫిజర్స్ లేదా క్రాక్డ్ హీల్స్ సమస్య ఈ రోజుల్లో సర్వ సాధారణమైంది. కొన్నిసార్లు ఈ క్రాక్స్ అనేవి చాలా డీప్ గా తయారయి నడవడానికి కూడా ఇబ్బందికి గురిచేస్తాయి. నడకలో మీకు అసౌకర్యం మరియు తీవ్రమైన నొప్పి కలుగుతుంది.

అంతే కాక, ఈ సమస్యకి డ్రై స్కిన్ అలాగే దట్టమైన చర్మం తోడైతే రెడ్నెస్, ఇచింగ్, చర్మం పొరలు పొరలుగా ఊడటంతో పాటు ఇంఫ్లేమేషన్ కూడా తోడవుతుంది.

beauty tips in telugu

క్రాక్డ్ హీల్ రెమెడీస్

డ్రై ఎయిర్, మాయిశ్చర్ లేకపోవటం, సరైన ఫుట్ కేర్ ని తీసుకోకపోవటం, అనారోగ్యకరమైన డైట్, ఏజింగ్, హార్డ్ ఫ్లోర్స్ పై ఎక్కువ సేపు నిల్చోవటం, సరైన షూస్ ని ధరించకపోవటం వంటివాటివల్ల క్రాక్డ్ హీల్స్ సమస్య తలెత్తుతుంది.

ఎక్జిమా, సోరియాసిస్, కార్న్స్ మరియు కెల్యుసిస్, డయాబిటీస్ మరియు థైరాయిడ్ సమస్యల వలన కూడా ఈ సమస్య తలెత్తుతుంది.

అయితే, క్రాక్డ్ హీల్స్ సమస్యను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సులభంగా పరిష్కరించుకోవచ్చు. కొన్ని హోంరెమెడీస్ ఈ సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అటువంటి సహజసిద్ధమైన పదార్థాలను వాటిని క్రాక్డ్ హీల్స్ కి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మకాయ:

నిమ్మకాయ:

నిమ్మకాయలో యాసిడ్ లభిస్తుంది. ఇది చర్మాన్ని మరింత స్మూత్ గా అలాగే సాఫ్ట్ గా ఉంచేందుకు తోడ్పడుతుంది. మీ పాదాలను పది నుంచి పదిహేను నిమిషాల వరకు నిమ్మరసాన్ని జోడించిన వెచ్చటి నీటిలో సోక్ చేయండి. వేడి నీటిని ఇందుకోసం వాడకూడదు. వేడి నీటిని వాడటం ద్వారా డ్రై ఫీట్ సమస్య తోడవుతుంది. ప్యూమిస్ స్టోన్ ని వాడి క్రాక్డ్ హీల్స్ ను స్క్రబ్ చేయండి. ఆ తరువాత ఫీట్ ను వాష్ చేసి పొడి టవల్ తో తుడుచుకోండి.

రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్:

రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్:

గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ కాంబినేషన్ క్రాక్డ్ హీల్స్ సమస్యను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. సమాన పరిణామంలో గ్లిజరిన్ మరియు రోజ్ వాటర్ ని తీసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయండి. నిద్రపోయే ముందు ఈ రెమెడీను పాటించండి.

పెట్రోలియం జెల్లీ మరియు నిమ్మరసం:

పెట్రోలియం జెల్లీ మరియు నిమ్మరసం:

నిమ్మలోని యాసిడిక్ ప్రాపర్టీలు మరియు పెట్రోలియం జెల్లీలోని మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీలు డ్రై ఫీట్ సమస్యను తొలగించేందుకు తోడ్పడతాయి. మీ ఫీట్ ని వెచ్చటి నీటిలో పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు సోక్ చేయాలి. ఆ తరువాత ఫీట్ ని రిన్స్ చేసి తుడవాలి. ఇప్పుడు ఒక టీస్పూన్ పెట్రోలియం జెల్లీలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని హీల్స్ పై అప్లై చేసి మిగతా ప్రభావిత ప్రాంతాలపై కూడా అప్లై చేయాలి. నిద్రపోయే ముందు ఈ పద్దతిని పాటించాలి.

తేనె:

తేనె:

యాంటీసెప్టిక్ ఏజెంట్ గా పనిచేయడం వలన క్రాక్డ్ ఫీట్ సమస్య నుంచి ఉపశమనం కోసం ప్రయత్నించవచ్చు. ఒక కప్పుడు తేనెలో అర బకెట్ వెచ్చటి నీటిని జోడించాలి. మీ ఫీట్ ను పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ మిశ్రమంలో సోక్ చేయాలి. ఇప్పుడు సున్నితంగా స్క్రబ్ చేయాలి. ఇలా చేస్తే కోమలమైన మరియు మృదువైన పాదాలు మీ సొంతమవుతాయి. ఈ పద్దతిని రెగ్యులర్ బేసిస్ లో ఫాలో అయితే క్రాక్డ్ హీల్స్ నుంచి రక్షణ పొందవచ్చు.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఒక కాటన్ బాల్ సహాయంతో ఆలివ్ ఆయిల్ ను ప్రభావిత ప్రాంతంపై అప్లై అచ్చేసి సర్క్యూలర్ మోషన్ లో పది నుంచి పదిహేను నిమిషాల వరకు మసాజ్ చేయాలి. ఇప్పుడు ఒక జత దట్టమైన కాటన్ సాక్స్ ను ధరించి గంట పాటు అలాగే ఉండాలి. ఈ పద్దతిని కొన్ని వారాల పాటు ప్రతిరోజూ పాటిస్తే వేగవంతమైన మరియు మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

రైస్ ఫ్లోర్:

రైస్ ఫ్లోర్:

మూడు స్పూన్ల గ్రౌండ్ రైస్, ఒక స్పూన్ తేనె మరియు కొన్ని చుక్కల ఆపిల్ సిడర్ వినేగార్ ను అందుబాటులో ఉంచుకోవాలి. ఇప్పుడు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల గ్రౌండ్ రైస్ లో కొన్ని చుక్కల తేనెను అలాగే ఆపిల్ సిడర్ ను కలిపి చిక్కటి పేస్ట్ ను తయారుచేసుకోవాలి. వెచ్చటి నీటిలో మీ పాదాలను కనీసం పదినిమిషాల పాటు సోక్ చేయాలి. ఆ తరువాత ఈ పేస్ట్ తో స్క్రబ్ చేసుకుని పాదాలపై నుంచి డెడ్ స్కిన్ ను తొలగించాలి.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది పొడి చర్మం సమస్యను తొలగించి చర్మంపై నుంచి డెడ్ సెల్స్ ను తొలగిస్తుంది. ఈ ఆయిల్ ను నిద్రపోయే ముందు పాదాలపై సున్నితంగా అప్లై చేయాలి. ఆ తరువాత సాక్స్ ను ధరించాలి. ఉదయాన్నే, షవర్ చేయాలి. ఈ పద్దతిని ప్రతి రోజూ పాటిస్తే ఫలితం ఉంటుంది.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా:

బకెట్ లో 2/3rd వెచ్చటి నీటిని తీసుకుని అందులో బేకింగ్ సోడాను కలపాలి. నీళ్ళల్లో బేకింగ్ సోడా పూర్తిగా కరిగిపోయే వరకు బాగా కలపాలి. ఆ తరువాత ఈ నీటిలో మీ పాదాలను పది నుంచి పదిహేను నిమిషాల వరకు సోక్ చేయాలి. ఆ తరువాత ప్యూమిస్ స్టోన్ తో సున్నితంగా స్క్రబ్ చేయాలి. క్లీన్ వాటర్ తో రిన్స్ చేయాలి.

అలోవెరా జెల్:

అలోవెరా జెల్:

గోరువెచ్చటి నీటిలో మీ పాదాలను కొన్ని నిమిషాల పాటు సోక్ చేయాలి. ఆ తరువాత తడిని తుడిచి పాదాలపై అలోవెరా జెల్ ను అప్లై చేయాలి. సాక్స్ ను ధరించి రాత్రంతా అలాగే ఉండాలి. ఈ పద్దతిని ప్రతి నాలుగైదు రోజులకు ఒకసారి పాటిస్తే పాదాలు అందంగా తయారవుతాయి.

English summary

Treat Cracked Heels With These Remedies

Cracked heels may also be referred to as heel fissures and this is a very common beauty concern. There are several home remedies for treating cracked heels without any side effects. Several ingredients like honey, lemon, oats, etc., can help you with this.In addition to dry, thickened skin, the problem may be accompanied by symptoms like redness,
Story first published: Tuesday, April 3, 2018, 16:10 [IST]