Latest Updates
-
ఇడ్లీ, దోసె పిండి బాగా పులిసిపోయిందా? పారేయకుండా ఈ చిట్కాలతో ఫ్రెష్ గా మార్చేయండి! -
కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లు, జలదరింపుని లైట్ తీసుకుంటున్నారా? పక్షవాతానికి ముందస్తు హెచ్చరిక? -
ఆరోగ్యానికి మహా బలం అందించే నువ్వుల బాదం లడ్డు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే -
ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ప్రోటీన్ చిక్కి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Chanakya Niti: మహిళలు ఈ 5 విషయాలను రహస్యంగా ఉంచితేనే జీవితంలో తిరుగుండదు! -
ఫ్రెంచ్ ఫ్రైస్ కాదు..ఇది కాకరకాయ ఫ్రైస్..ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు.. -
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా?
తెల్లజుట్టు నివారణ..నల్లగా..ఒత్తుగా..పెంచే చిట్కాలు...

ఇక తీసుకునే ఆహారంలో లోపాలు కూడా తెల్లజుట్టు రావడానికి కారణమవుతాయి. ప్రతిరోజూ మంచి పోష కాహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు, మొలకెత్తిన విత్త నాలు, సోయాజాతి విత్తనాలు, డ్రైప్రూట్స్ వంటివి ఎక్కు వగా తీసుకుంటే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఘూటైన షాంపూలను వాడరాదు. ఎప్పు డు ఒకే రకమైన షాంపూను వాడడం మంచిది. మార్కెట్లోకి కొత్తగా ఏవీ వస్తే వాటిని వాడడం సరికాదు. గుడ్డు తెల్లసొన లేదా మజ్జికతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్టుల్ని తలకు ప్యాక్ గా వేసుకోవాలి. మందారాకు పేస్ట్ తో కూడా ప్యాక్ చేసుకోవచ్చు.హెర్బల్ హెన్నాలో బీట్ రూట్ రసాన్ని కలిపి ప్యాక్ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.
ఉసిరి, వేప ఆకుల్ని విడివిడిగా తీసుకుని ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. తరువాత ఉసిరి, వేప, పసుపు మూడింటింని సమభాగాలుగా తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని రొజూ రెండుసార్లు ఓ టీస్పూన్ మోతాదులో నీళ్ళల్లో కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే జుట్టు తెల్లబడడం క్రమంగా తగ్గుతుంది.
కొబ్బరి నూనెలో ఉల్లిపాయముక్కలు వేసి మరిగించాలి. ఈ నూనెను తలకు మర్దన చేసుకోవాలి. తరువాత అన్నం వార్చిన గంజితో తల రుద్దుకుంటే చుండ్రు పోతుంది, జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, కొబ్బరినూనె సమానంగా తీసుకుని బాగా కలిపి తలకు పట్టించి మర్దన చేయాలి. తరువాత వేడి నీళ్ళల్లో ముంచిన టవల్ ను తలకు చుట్టుకుని ఉంచి పదిహేను నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications