Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
జుట్టు రాలడం..చుండ్రు సమస్యల నివారణకు...

1. పచ్చికొబ్బరి పాలల్లో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలిపి స్నానానికి ముందు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి, వేళ్ళతో నెమ్మదిగా రుద్దినట్లుగా మసాజ్ చేయాలి. ఇలా 15 నిమిషాలపాటు చేసిన తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చుండ్రు పూర్తిగా మాయమవుతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
2. పెరుగు తోడుకున్న తర్వాత పైన నీరు పేరుకుంటుంది. నాలుగు స్పూన్ల ఆ పెరుగు నీటికి, 4 స్పూన్ల కర్పూరద్రావణాన్ని కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఓ గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
3. మెంతి ఆకులను బాగా నూరి జుట్టుకు రాయాలి. పావుగంట తర్వాత తలస్నానం చేస్తే మంచిది. అలాగే రాత్రి మెంతులు నానపెట్టి మర్నాడు మెత్తగా రుబ్బి ఈ మి శ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే, చుండ్రు సమస్య మాయమవటంతోపాటు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.
4. గోరువెచ్చని నీటిలో.. కొబ్బరిపాలు, నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగిస్తే చుండ్రు మాయమవుతుంది.
5. తేనె, ఆలివ్ నూనె సమపాలల్లో తీసుకొని రెండిటినీ మిక్స్ చేసి కలిపి కుదుళ్లనుంచి జుట్టుకు బాగా పట్టించి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.
6. వారానికొకసారి గిలకొట్టిన పచ్చసొనను రాస్తే జుట్టుకు కండీషినర్‌గా పనిచేస్తుంది,చుండ్రూ పోతుంది. అయిదు టీస్పూన్ల ఆలివ్ నూనెకు రెండు కోడిగుడ్లు కలిపి తలకు రాసుకోవాలి. ఇరవైనిమిషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఈ మాస్క్ జుట్టును పొందికగా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications
