Latest Updates
-
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.? -
వాహనం ఏ రంగులో ఉన్నా.. టైరు మాత్రం నల్లగానే ఎందుకుంటుందో తెలుసా? -
ఈ రాశి వారు శుక్రవారం ఈ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వర్యాలు కొలువుదీరడం పక్కా.! -
గుంటూరు స్పెషల్ టిఫిన్స్ అల్లం పచ్చడి..ఒక్కసారి చేసుకుంటే నెల రోజులు నిల్వ! -
పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్స్టంట్గా ఈజీగా చేసుకునేలా.! -
గణేష్ పూజ తర్వాత అరుదైన లక్ష్మీ నారాయణ యోగం..వాళ్లకి స్వర్ణ యుగమే! -
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.!
వేసవి విడిది... ప్రయాణాలు... కురులసంరక్షణ...!

1. ఎండ... గాలిలో ఎక్కువ సమయం ఉండటం వల్ల తల పొడిబారిపోతుంది. అందుకే తలకు సహజ నూనెలతో మర్ధన చేయాలి. నాలుగు గంటలపాటు విశ్రాంతి తీసుకొని తలస్నానం చేయాలి. దాంతో మాడుకు తేమ అందుతుంది. కండిషనర్ తో కూడా పని ఉండదు. ఆపై నూనెతో మర్దన చేయడం వల్ల పట్టుకుచ్చులా జాలువారే శిరోజాలు సొంతమవుతాయి.
2. కండిషనర్ వాడకం వల్ల కురులకు కొత్త కళ వస్తుంది. అయితే దీన్ని రాసుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాడుకు కాకుండా..శిరోజాలకు మాత్రమే రాసుకోవాలి. ఐదారు నిమిషాల తర్వాత నీళ్ళ తలమీద జాలువారుగా పోస్తే ఫలితముంటుంది. లేదంటే తల్లో కండిషనర్ మిగిలిపోయి, చుండ్రు సమస్య బాధించే ఆస్కారం అధికం. పంపుకింద తలను ఉంచి నీటి ధారతో శుభ్రపరుచుకుంటే ఇంకా మంచిది.
3. ఎంత హడావుడి ఉన్నా డ్రయ్యర్ వాడటం, ఎండలో నిల్చోవడం వంటివి శిరోజాలకు మరింత హాని చేస్తాయి. మెత్తని నూలు వస్త్రంతో తుడిస్తే తల త్వరగా ఆరిపోతుంది. కురులు చిక్కులు పడవు.
4. వేసవి విడిది పూర్తయి ఇల్లు చేరాక చివర్లు కత్తిరించాలి. చిట్లిపోయిన జుట్టును తీసేయాలి. అలానే స్విమ్మింగ్ కు వెళ్లేటప్పుడు తల తడవకుండా టోపీ ధరించాలి. లేదంటే శిరోజాలకు హాని జరుగుతుంది. నీటి కాలుష్యం కారగణంగా జుట్టు రాలడం, తెగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
5. చుండు శాతం ఎంత ఉందో నిపుణుల ఆద్వర్యంలో పీరక్ష చేయించుకొని అవసరం మేరకు తగిన చికిత్స తీసుకోవడం లేదా సౌందర్యోత్పత్తులను సిఫారసు చేయించుకోవాలి. అలానే సమస్యను బట్టి స్పా చికిత్సలకు ప్రాధాన్యమివ్వవచ్చు. వీటివల్ల కురులకు కోల్పోయిన కళ తిరిగి వస్తుంది. ఒత్తిడి దూరమై. ఒత్తిడి దూరమై... తల్లో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది.
6. వీటన్నింటితో పాటు ఆహారం మీద కూడా దృష్టి పెట్టాలి. ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ‘బి’ లభించే ఆహారానికి ప్రాధాన్యమివ్వాలి. ముదురు ఆకుపచ్చ రంగులో లభించే కాయగూరలు, బీన్స్, నట్స్, గుడ్డు, తృణధాన్యాలు, క్యారెట్లు, ఎక్కువగా తీసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications
