Latest Updates
-
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.!
ఈ ఆహారాలు తింటే కేశ సౌందర్యం అమోఘం....

1. జుట్టు పెరిగేందుకు సిలికా అనే మినరల్ చాలా అవసరం. క్యాబేజీ, దోసకాయ, క్యాలీఫ్లవర్, ఆకుకూరలు, ఓట్స్‌లో ఈ మినరల్ అధికంగా ఉంటుంది. కాబట్టి మన ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
2. సోయాపాలు లేదా సోయా చిక్కుడులో ప్రోటీన్ అత్యధికంగా ఉంటుంది. జుట్టురాలడాన్ని సోయా సమర్థంగా అరికడుతుంది.
3. జుట్టు పెరిగేందుకు జింక్ చాలా అవసరం. అది జీడిపప్పులో పుష్కలంగా ఉంటుంది.
4. మాంసాహారులైతే చికెన్ తీసుకోవడం వల్ల నిగనిగలాడే జుట్టును సొంతం చేసుకోవచ్చు. జుట్టు ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్, ఐరన్ చికెన్ లో లభిస్తుంది.
5. సాల్మన్(సముద్ర చేపలు): వీటిలో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12 మరియు ఐరన్ కూడా పుష్కలంగా లభ్యమవుతుంది. కాబట్టి వీటిని తినడం మంచిది. జుట్టును గ్లాసీగా మరియు హెల్తీగా ఉంచుతుంది. .
6. క్యారెట్: ఎక్కువ విటమిన్లు ఉండేది క్యారెట్ లోనే, క్యారెట్ ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల జుట్టు మెరుస్తూ వత్తుగా పెరుగుతుంది. అలాగే కంటికి కూడా చాలా మంచిది.
7. ఆల్ఫాలినోలెటిక్ యాసిడ్ జుట్టు ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది. ఈ యాసిడ్ బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్ లో అధికంగా ఉంటుంది.
8.. పాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. జుట్టు పెరిగేందుకు కాల్షియం చాలా అవసరం. అందుకే ఎదిగే పిల్లలకు రోజూ పాలు ఇవ్వడం వల్ల ఎముకలు పెరగడంతో పాటు నిగనిగలాడే జుట్టు వస్తుంది.
9. గుడ్డు: గుడ్డు లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. గుడ్డు ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల నిర్జీవంగా మారిని వెంట్రుకలు కొత్త జీవాన్ని సంతరించుకొని బాగా పెరుగుతాయి. గుడ్డులోని తెల్లసొనతో మాస్క్ వేసుకొన్నట్లైతే వెంట్రెకలు మెరుపువస్తుంది.
10. నట్స్ అండ్ సీడ్స్: హెయిర్ కేర్ లో ముఖ్యంగా తీసుకోవల్సిన మరొక బలమైన పదార్థాలు నట్స్ అండ్ సీడ్స్. వేరుశనగ, జీడిపప్పు, బాదంలో జింక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది..



Click it and Unblock the Notifications
