Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
జుట్టుకు బలాన్నిచ్చి..హేయిర్ ఫాల్ అరికట్టే ఆనియన్ హెయిర్ ప్యాక్...
ప్రస్తుత రోజుల్లో చాలా మంది జుట్టుకు సంబంధించి చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాడం మొదలకుని చుండ్రు వరకూ చాలా రకాల జుట్ట సమస్యలను నివారించడానికి కూడా వీలుపడనన్ని సమస్యలు ఎదుర్కో వల్సి వస్తోంది. జుట్టు రాలడం మరియు జుట్టు అతి తక్కువగా లేదా నిధానంగా పెరగడం వంటివి మరో హెయిర్ సమస్య. కేశ సంరక్షణ జాగ్రత్తలు తీసుకొన్న తర్వాత కూడా అదే విధంగా ఉంటే దానికి కారణం అనారోగ్యకరమైన జీవన శైలి, ఆహారంలో అసమతుల్యత వల్ల చర్మ మరియు జుట్టు మీద చెడు ప్రభావాన్ని చూపెడుతుంది. ఇటువంటి సమస్యలను అరికట్టడానికి చాలా ట్రీట్మెంట్లు తీసుకొన్నా కూడా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.
చాలా మంది కేశాలను సంరక్షించుకోవడం కోసం కొన్ని ఇంటి చిట్కాలను సాధారణ పద్దతుల్లో ఉపయోగిస్తుంటారు. మన వంటగదిలోని చాలా రకాలు వంటకు ఉపయోగించే వస్తువులను హెయిర్ కేర్ లో భాగంగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు తేనె, గుడ్డు, పెరుగు, బేకింగ్ సోడా, వెనిగర్, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ వంటివి హోమ్ రెమెడీ హెయిర్ ట్రీట్మెంట్ కు ఉపయోగిస్తుంటారు. అవును, నిజంగానే ఉల్లిపాయ మన కళ్ళలో నీళ్ళు కారేవింధంగా చేస్తుంది. అలాగే కురుల సమస్యలను కూడా నివారిస్తుంది అనడంలో ఆశ్చర్యం కలగక మానదు!. నిజానికి ఉల్లిపాయ వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది. ఉల్లిపాయలో ఉండే ఘాటైన సల్ఫర్ జుట్టు పెరగడానికి బాగా సహాయపడుతుంది. మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మరియు ఇందులో యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలుండటం వల్ల చుండ్రును నిర్మూలిస్తుంది. కాబట్టి మీ జుట్టు రాలడాన్ని అరకట్టానుకున్నా .. ఉన్న జుట్టు అందంగా, స్ట్రాంగ్ గా ఉండాలనుకున్నా ఆనియన్ హెయిర్ ప్యాక్ ను ట్రై చేయండి...

ఉల్లిపాయ వాసన మనకు ఇబ్బంది కలిగించినా కొంత సమయం తర్వాత జుట్టు పెరగడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని గ్రహించవచ్చు. కాబట్టి ఈ క్రింద ఇచ్చిన హెయిర్ ప్యాక్స్ ను ట్రై చేసి, రిజల్ట్ చూడండి. స్పాలకు, బ్యూటీపార్లకు డబ్బు ఖర్చు చేయడం మానుకొని ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్ తో వ్యత్యాసాన్ని గమనించండి . ఒక సూచన ఏంటంటే ఈ హెయిర్ ప్యాక్ ను మినిమం ఒక నెల పాటించాల్సి ఉంటుంది. మరి ఆనియన్ హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూద్దామా...
సింపుల్ ఆనియన్ జ్యూస్ హెయిర్ ప్యాక్: హెయిర్ ఫాల్ ను అరికట్టడంలో చాలా ప్రభావవంతమైన హెయిర్ ప్యాక్ ఇది. అందుకు ఏం చేయాలంటే ఉల్లిపాయను మిక్సీకి పట్టించి జ్యూస్ ను సపరేట్ గా పిండుకోవాలి. ఈ రసాన్ని తలకు, కేశాలకు బాగా పట్టించాలి. తర్వాత హాట్ టవల్ ను తలకు చుట్టుకోవాలి. ఇలా చేసిన అరగంట తర్వాత షాంపు ఉపయోగించి తలస్నానం చేయడం వల్ల ఉల్లిపాయ వాసన పోతుంది.
ఉల్లిపాయ మరియు హెయిర్ ఆయిల్ ప్యాక్: ఉల్లిపాయ నుండి రసాన్ని వేరుచేసుకొని అందులో మీరు రెగ్యులర్ గా ఉపయోగించే హెయిర్ ఆయిల్ ను మిక్స్ చేసి తలకు పట్టించాలి. హెయిర్ ఆయిల్స్ కు మీరు ఎసెన్సియల్ ఆయిల్స్(రోజ్ మెరీ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ మరియు సీడర్ వుడ్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు. తలకు పట్టించి ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి. ఎసెన్షియల్ ఆయిల్ ఉపయోగించడం వల్ల జుట్టు చిక్కుపడకుండా ఉంటుంది.
ఉల్లిపాయ, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనెతో ప్యాక్: ఉల్లిపాయ నుండి జ్యూస్ వేరు చేసుకొని దానికి ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మరియు మరో చెంచా కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయాలి. తల మాడుకు కాకుండా కేశాలకు మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసిన రెండు గంటల తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత నిమ్మరసాన్ని కండిషనర్ గా ఉపయోగించవచ్చు . ఇది ఉల్లిపాయ వాసనను పోగొడుతుంది. ఈ హెయిర్ ప్యాక్ ను ప్రతి రోజూ ఉపయోగించవచ్చు.
ఉల్లిపాయ, బీర్ మరియు కొబ్బరి నూనె: ఉల్లిపాయ నుండి జ్యూస్ ను సపరేట్ చేసిన తర్వాత మిగిలి ఉల్లిపాయ గుజ్జుకు కొద్దిగా బీర్ మరియు కొబ్బరినూనె మిక్స్ చేసి తలకు అప్లై చేయాలి. అప్లై చేసిన ఒకటి రెండు గంటలు ఇలాగే ఉంచేయాలి. తర్వాత నిమ్మరసం కలిపిన నీటితో తలస్నానం చేసుకోవాలి . ఇది హెయిర్ గ్రోత్ కు బాగా సహకరిస్తుంది. కేశాలు అందంగా మెరుస్తుంటాయి. హాట్ వ్రాప్ చుట్టడం ద్వారా కేశకణాకలు కావల్సిన న్యూట్రిషియన్స్ పుష్కలంగా అందుతాయి.
ఆనియన్ మరియు హనీ జెల్ ప్యాక్: ఆనియన్ జ్యూస్ కు కొద్దిగా తేనె మిక్స్ చేసి బాగా జెల్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. పట్టించిన రెండు గంటల తర్వాత లెమన్ వాటర్ తో తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ జెల్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది మరియు మంచి షైనింగ్ ను అంధిస్తుంది. ఈ హెయిర్ జెల్ ను వారంలో రెండు మూడు సార్లు ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications