Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
అనేక జుట్టు సమస్య నివారణకు పెరుగే దివ్వ ఔషధం...!
పెరుగు మన వంటింట్లో ఉండే నిత్యవసర వస్తువు. పెరుగుతో భోజనం చేయ్యనిదే..ఆ భోజనం సంతృప్తికరం అనిపించదు. అంతే కాదు డైరీ ప్రొండక్ట్ పాలు, పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అదే విధంగా సౌందర్యంలోనూ ముందంజలోనే ఉంటాయి. సౌందర్యం అనగానే చర్మానికి పెరుగు ఏవిధంగా మేలు చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే..అయితే, పెరుగు ను కేశాలకు కూడా వినియోగిస్తారని మీకు తెలుసా? పెరుగును కేశాలను పట్టించడంలో చాలా పద్దతులు ఉన్నాయి. పెరుగులో చుండ్రును వదలగొట్టే గుణాలు అధికంగా ఉన్ానయి. హోంమేడ్ చిట్కాలలో పెరుగుతో చేసే చిట్కాలు కేశాలకు మంచి కండిషనర్ గాను మరియు చుండ్రును వదలగొట్టడంలోనూ అద్భుతమైన మేలు చేస్తాయి.
కేశాలకు సంబంధించిన అనేక సమస్యలను నివారించడంలో పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. అందువల్లే అనేక విధాలైన హెయిర్ ప్యాక్స్ కు పెరుగును ఉపయోగిస్తారు. మరి మీ జుట్టు సమస్యలను నివారించుకోవాలంటే పెరుగును అప్లై చేయాలి. అందుకు కొన్ని నేచురల్ చిట్కాలు మీకోసం...

1. పెరుగు నిమ్మరసం: పెద్ద గిన్నెలో పెరుగు వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో నిమ్మరసం వేసి మళ్ళీ ఇంకోసారి గిలకొట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ కేశాలకు, తల మాడుకు పట్టించాలి. ముఖంగా కేశాల చివరలు, హెయిర్ రూట్స్ కు పట్టించడం వల్ల అనేక జుట్టు సమస్యలను నివారించవచ్చు. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించిన అరగంట తర్వాత గోరువెచ్చిన నీటితో, యాంటీ డాండ్రఫ్ షాంపు ఉపయోగించి తలస్నానం చేసుకోవాలి. చుండ్రును వదలించుకోవడంలో ఇది ఒక బెస్ట్ నేచురల్ హోం రెమడీ..
2. పెరుగు మరియు ఉల్లిరసం: మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను రసాన్ని ఒక గిన్నెలో పిండుకోవాలి . ఇప్పుడు అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేసి తల మాడుకు, కేశాలకు బాగా పట్టించాలి. ఇలా చేయడం వల్ల తలమాడుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లును నివారిస్తుంది. అప్లై చేసిన 20నిముషాల తర్వాత మెడికేటెడ్ షాంపూతో తలస్నానం చేసుకోవాలి.
3. పెరగు మరియు మెంతి ఆకులు: మెంతి ఆకులను మెత్తగా రుబ్బుకోవాలి. ఇది ఒక బౌల్లోని తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు కలిపి బాగా మిక్స్ చేసి తలకు, కురులకు బాగా పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. దాంతో తలలో చుండ్రు తొలగిపోయి. హెయిర్ రూట్స్ కు కావల్సిన శక్తిని అందిస్తాయి
4. పెరుగు మరియు హెన్నా: పెరగు గ్రేట్ నేచురల్ హెయిర్ కండీషనర్. నానబెట్టిన గోరింటాకు నీళ్ళలో పెరుగును మిక్స్ చేసి తలకు పట్టించాలి. 20 నిముషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల కేశాలను నునుపుగా, మంచి షైనింగ్ తో ఉండేలా చేస్తుంది.
పెరుగును ఎక్కువ సేపు తలకు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది కురులకు తలకు అధికంగా కూలింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది. తర్వాత జలుబు చేసే అవకాశం ఉంది కాబట్టి పెరగు తలకు పెట్టుకొన్న 15-20నిముషాలలోపు తలస్నానం చేసేసుకోవాలి.



Click it and Unblock the Notifications