Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
జుట్టుకు హాని కలిగించే హార్డ్ వాటర్ ను నివారించడం ఎలా
క్యాల్షియం ఎక్కువైతే జుట్టు చాలా హెవీగా కనిపిస్తుంది. మరియు తలమాడు పొట్టుపొట్టుగా కనిపిస్తుంది. ఇది చర్మం మాత్రమే కాదు, తలమాడు మీద క్యాల్షియం నిధానంగా నిల్వకుండా చేస్తుంది. ఐరన్ లెవల్స్ చాలా పెళుసుగా మరియు డ్రైగా మారుతుంది. జుట్టు చిట్లడం కనబడుతుంది మరియు ఈ చిట్లును తొలగించడానికి చివర్లను రెగ్యులర్ కట్ చేస్టే
కట్ చేస్తుండాలి. కాపర్ వల్ల హెయిర్ కలర్ లో మార్పు వస్తుంది మరియు కలర్లో మార్పుత పాటు, కర్లింగ్ కు దారితీస్తుంది. మెగ్నీషియం జుట్టుయొక్క అన్ని రకాల సమస్యలను కలిపుతుంది. కర్ల్ ఊడిపోవడానికి కారణం అవుతుంది. జుట్టు డ్రైగా మారుతుంది మరియు జుట్టు యొక్క షైనింగ్ తగ్గించేస్తుంది.
మీ జుట్టుయొక్క నాణ్యతను పెంచుకోవానికి కొన్నినేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

వెనిగర్ :
వెనిగర్ లో ఉండే అసిడ్ ఆమ్లం మీ తలలో ఏర్పడే, పొట్టువంటి పదార్థంను తొలగిస్తుంది. అందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎంపిక చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ ను మూడు కప్పుల నీటిలో మిక్స్ చేయాలి. తలకు షాంపు ఉపయోగించిన తర్వాత, ఈ వెనిగర్ వాటర్ మిశ్రమాన్ని తలకు మసాజ్ చేయాలి. కొన్ని నిముషాలు అలగే ఉంచి తర్వాత మంచి నీటిని తలమీద పోసుకోవాలి. వెనిగర్ నీళ్ళు పోసుకోవడం వల్ల జుట్టు యొక్క షైనింగ్ ను పెంచుతుంది . ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు ఉపయోగించాలి. ప్రతి రోజూ ఉపయోగిస్తే మీ జుట్టు మరింత డ్రైగా మారుతుంది.

నిమ్మరసం:
తాజా నిమ్మరసం ఆయిలీ హెయిర్ కు చాలా ఉత్తమమైన హోం రెమెడీ. లెమన్ రైజ్ చేసుకోవడానికి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను మూడు కప్పుల నీటిలో మిక్స్ చేసి బాగా మిక్స్ చేయాలి. తలకు షాంపు చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు మరియు జుట్టు పొడవునా పట్టించాలి. కొన్ని నిముషాలు అలాగే ఉంచి తర్వాత మంచి నీటిని తలమీద పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది మరియు జుట్టు ఒత్తుగా కాంతివంతంగా మార్చుతుంది. అలాగే అనేక యాంటీసెప్టిక్ లక్షణాలు కూడా చుండ్రును నివారిస్తుంది.

వాటర్ సాప్ట్ నర్:
వాటర్ సాప్ట్ నర్ చాలా గ్రేట్, కానీ మీ హార్డ్ వాటర్ వర్రీస్ ని నివారించడానికి కొంచెం ఖర్చుతో కూడుకొన్నది. వాటర్ సాఫ్ట్ నర్ క్యాల్షియం మరియు మెగ్నీషియం మరియు ఇతర మెటల్ అంశాలను హార్డ్ వాటర్ నుండి తొలగించి నీటిని సాఫ్ట్ గా మార్చుతాయి. వాటర్ సాప్ట్ నర్ ను అమర్చుకోవడం చాలా ఖర్చుతో కూడిన పని. అయితే, ఎవరైతే, ఎగ్జిమా, హెయిర్ సమస్యలు మరియు ఇతర వార్డ్ వాటర్ కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఈ వాటర్ సాఫ్ట్ నర్ చాలా సహాయపడుతుంది.

కొబ్బరి నూనె మరియు బాదం ఆయిల్ :
తలస్నానం చేసిన తర్వాత నేచురల్ కండీషనర్ గా ఉండే నూనెలు కొబ్బరి నూనె లేదా బాదం నూనె వంటివి జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టుకు అవసరం అయిన మాయిశ్చరైజ్ ను అందిస్తుంది. దాంతో జుట్టు మంచి షైనింగ్ తో మరియు హెల్తీగా ఉంటుంది. ఈ రెండింటి మిశ్రమాన్ని కూడా జుట్టుకు పట్టించవచ్చు. అయితే ఎక్కువగా ఉపయోగించకూడదు. అలా చేస్తే జుట్టు మరింత జిడ్డుగా మార్చేస్తుంది.

డీప్ కండీషనింగ్ :
అనుకోకుండా : హార్డ్ వాటర్ జుట్టును మరింత ఎక్కువగా కఠినంగా మార్చుతుంది. మరింత డ్రైగా కనబడేలా చేస్తుంది. కాబట్టి, డీప్ కండీషన్ అప్లైచేయడం చాలా ముఖ్యం. రెగ్యులర్ బేస్ లో కండీషన్ అప్లై చేయాలి. అందుకు నేచురల్ ప్రోడక్ట్స్ పెరుగు వారానికి ఒకసారి అప్లై చేయాలి. నెలకు ఒకసారి హెయిర్ స్పా చేయించుకోవడం సహాయపడుతుంది. ఇంకా హాట్ ఆయిల్ ట్రీట్మెంట్ మసాజ్ ను తరచూ చేసుకోవడం ఉత్తమం.

షవర్ ఫిల్టర్ :
వాటర్ సాప్ట్ నర్ కు షవర్ ఫిల్టర్ ఖరీదు చాలా తక్కువ. ఇది ఖచ్చితంగా లైమ్ స్కేల్, క్లోరిన్ మరియు ఇతర రసాయనాలన్నింటినీ హార్డ్ వాటర్ నుండి తొలగిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల షవర్ ఫిల్టర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటని మీ షవర్ ఫిల్టర్ కు ఫిక్స్ చేయించుకోవచ్చు. వీటిని మీరు ఆన్ లైన్ లో లేదా హోం స్టోర్స్ లో కొనుగోలు చేసుకోవచ్చు.

బాటిల్ వాటర్:
బాటిల్లోని మినిరల్ వాటర్ ను తలస్నానం చేసిన తర్వాత తలమీద స్ప్రే చేసుకోవచ్చు. ఫైనల్ రైస్ కు ఒక లీటర్ నీరు సరిపోతాయి. మరియు ఇది అంత ఖరీదైనది మాత్రం కాదు, కానీ మీరు ప్లాస్టిక్ బాటిల్ ను పైకి పట్టుకోవాలి. మీ జుట్టు మరింత హార్డ్ గా కనిపిస్తుంటే మాత్రే ఇది ఒక తాత్కాలిక పరిష్కార మార్గం.

వర్షపు నీరు:
తలస్నానంకు హార్డ్ వాటర్ కంటే, వర్షపు నీరు చాలా ఉత్తమం . వర్షాకాలంలో పెద్ద బకెట్స్ ను వర్షపు నీటితో నింపు ఉండండి. స్నానం చేసే సమయంలో ఈ వర్షపు నీటిని వేడి చేసి స్నానానికి ఈ నీటిని ఉపయోగించి ఫలితాన్ని మీరు చూడండి...



Click it and Unblock the Notifications











