Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఉల్లి-వెల్లుల్లి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది-జుట్టును పెంచుతుంది
జుట్టు సమస్యలు మహిళల్లో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా అధికంగా ఉన్నాయి . జుట్టు రాలడానికి ప్రధాన కారణం కాలుష్యం, అనారోగ్యకరమైన జీవన శైలి వల్ల జుట్టు మీద ప్రభావం అధికంగా ఉంటుంది . జుట్టు మీద ప్రభావం వివిధ రకాలుగా జుట్టు రాలడం, డ్రై హెయిర్, జుట్టు చిట్లడం మరియు ఇతర కారణాలు . జుట్టు సమస్యలను నివారించుకోవడా నేచురల్ లేదా సింతటిక్ హోం రెమడీలను ఉపయోగించుకోవచ్చు.
జుట్టు సమస్యలను నివారించుకోవడం లో వివిధ హెయిర్ మాస్క్ మన ఇంట్లోనే మనకు నిత్యం అందుబాటులో ఉన్నాయి. జుట్టు సమస్యలను నివారించుకోవడానికి ఇప్పటి వరకూ వివిధ హెయిర్ మాస్క్ లను మీరు ఉపయోగించే ఉంటారు. అయితే ఆనియన్ మరియు గార్లిక్ హెయిర్ మాస్క్ జుట్టు పెరుగుదల మరియు జుట్టు డ్యామేజ్ ను నివారిస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ లో హెయిర్ డ్యామేజ్ నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
ఉల్లిపాయ-వెల్లుల్లి రెండింటి కాంబినేషన్ లో కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ రెండింటి కాంబినేషన్ ను మీరు రెగ్యులర్ గా ఉపయోగించాలి. మరి ఉల్లి-వెల్లుల్లి మరికొన్ని బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా :

జుట్టు రాలడాన్ని నివారిస్తుంది: ఉల్లిపాయ మరియు వెల్లుల్లి రెండింటి కాంబినేషన్లో హెయిర్ మాస్క్ వేసుకుంటే జుట్టు రాలడాన్ని నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హార్డ్ వాటర్, నాణ్యత లేని షాంపులు, మెడికేషన్స్, ఒత్తడి వల్ల మహిళల్లో జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. ఉల్లిపాయ రసం తలకు పట్టించడం ద్వారా హెయిర్ క్యూటికల్స్ స్ట్రాంగ్ గా మార్చుతుంది మరియు ఉల్లిపాయలో కొన్ని రకాల కెమికల్స్ జుట్టు రాలడాన్ని నివారించి ఆ జుట్టును మరింత బలోపేతం చేస్తుంది. జుట్టు మందంగా పెరిగేందుకు సహాయపడుతుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది: ఉల్లిపాయ రసం మరియు వెల్లుల్లి రసం రెండింటిలో యాంటీ ఫంగల్ లక్షణాలు మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇవి చుండ్రును నివారించి జుట్టును శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
జుట్టుకు సహజంగానే మంచి మెరుపు తీసుకొస్తుంది: ఉల్లి-వెల్లుల్లి కాంబినేషన్ హెయిర్ మాస్క్ శరీరానికి మంచి షైనింగ్ ను అందిస్తుంది. అలాగే జుట్టుకు నేచురల్ గానే ప్రకాశవంతంగా మార్చుతుంది. ఈ హెయిర్ ప్యాక్ తర్వాత జుట్టు చూడటానికి హెయిర్ సలోన్ ట్రీట్మెంట్ తీసుకొన్న తర్వాత కనిపించి విధంగా ప్రకాశవంతంగా జుట్టు మెరుస్తుంటుంది.
ఇది హోం మేడ్ మరియు ఖరీదు తక్కువ: ఉల్లి వెల్లుల్లి హెయిర్ మాస్క్ జుట్టును నేచురల్ గా బలోపేతం చేస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ హెయిర్ ప్యాక్ ఎవరైనా వేసుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా ఇంట్లో తాజాగా ఉండే ఉల్లి వెల్లుల్లిని ఎంపిక చేసుకోవాలి. ఇవి నిత్యం మన ఇంట్లో మనకు చాలా తక్కవ రేటుకే అందుబాటులో ఉంటాయి .



Click it and Unblock the Notifications
