Latest Updates
-
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు
ఆరోగ్యకరమైన జుట్టుకు ఉత్తమ వంటింటి చిట్కాలు
జుట్టు ఆరోగ్యం కోసం ఎటువంటి హెయిర్ స్పాలు చేయించుకోకుండా , ఎటువంటి ఖరీదైన ట్రీట్మెంట్స్ తీసుకోకుండానే, మరియు ఎటువంటి ఖరీదైన కండీషనర్లు మరియు షాంపులను ఉపయోగించకుండానా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా?
ఇవేవీ ఉపయోగించకుండానే మన వంటగదిలోని కొన్ని ఉత్తమైన పదార్థాలను ఉపయోగించి అందమైన జుట్టును పొందవచ్చు. బీర్ నుండి అరటిపండ్ల వరకూ జుట్టు మంచి షైనింగ్ మరియు ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి ఈ వెరైటీ హోం రెమెడీస్ చాలా అద్భుతంగా సహాయపడుతాయి. మరి అవేంటో ఒకసారి చూద్దం:

ఆరోగ్యకరమైన జుట్టుకు బెస్ట్ హోం రెమెడీస్
ఆరోగ్యకరమైన జుట్టుకు అరటి పండ్లు: అరటిపండ్లలోని అధిక పొటాషియం వల్ల దీన్ని జుట్టుకు వినిగించుకోవచ్చు . ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు నేచురల్ గా ఎలాసిటిని అందిస్తుంది .
* అరటిపండును మొత్తగా గుజ్జులా చేసి తల మాడునుండి కేశాల పొడవునా అరపండి గుజ్జును పట్టించాలి. దీన్ని 15నిముషాలు అలాగే ఉంచి, తర్వాత షాంపుత తలస్నానం చేసుకోవాలి. ఇది డ్రై హెయిర్ ను మరియు డ్యామేజ్ హెయిర్ ను నివారిస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టుకు బెస్ట్ హోం రెమెడీస్
గుడ్డు పచ్చసొనతో చికిత్స:
గుడ్డులోన పచ్చసొనను తలకు బాగా పట్టించాలి. లేదా మూడు గుడ్ల పచ్చసొనలో, ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మరియు మూడు చుక్కల విటమిన్ ఇ ఆయిల్ ను మిక్స్ చేసి అప్లై చేస్తే ఇది ఒక అద్భుతమైన రెమెడీ.
ఇలా పట్టించిన తర్వాత 10నిముషాలు అలాగే ఉంచి తర్వాత షాంపు పెట్టి తలస్నానం చేసుకోవాలి. ఈ పద్దతిని వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ చికిత్సవల్ల మీ కేశాలను నునుపు చేస్తుంది మరియు కాండీషనర్ గా పనిచేస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టుకు బెస్ట్ హోం రెమెడీస్
బీర్ తో చికిత్స
ఇది ఒక ప్రసిద్ది చెందిన హెయిర్ ట్రీట్మెంట్. స్ర్పే బాటిల్లో కొద్దిగా బీర్ వేసి, షాంపు చేసిన తర్వాత కేశాలకు స్ర్పే చేసుకొని లైట్ గా టవల్ తో తడి ఆర్పుకోవాలి. బీర్ లో ఉన్న లక్షణాలు వల్ల ఇది జుట్టు అవసరం అయ్యే షైనింగ్ ను అంధిస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టుకు బెస్ట్ హోం రెమెడీస్
మోయొనైజ్ : తడిగా ఉన్న మీ జుట్టుకు మోయొనైజ్ ను అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక గంట సేపు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి . మోయొనైజ్ ఒక అద్భుతమైన కండీషనర్ గా జుట్టుకు పనిచేస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టుకు బెస్ట్ హోం రెమెడీస్
ఆయిల్ మసాజ్
గోరువెచ్చని నూనెతో తలకు మాడుకు ఆయిల్ మసాజ్ చేయడం చాలా ప్రసిద్దిచెందిన మెడికేషన్. మంచి ఫలితం కోసం కొబ్బరినూనెను ఉపయోగించండి. హాట్ ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత ఒక గంట అలాగే ఉండాలి. లేదా హాట్ ఆయిల్ తో పాటునిమ్మరసం లేదా వెనిగర్ మిక్స్ చేసి మసాజ్ చేసుకోవడం వల్ల చుండ్రును వదలగొడుతుంది.

ఆరోగ్యకరమైన జుట్టుకు బెస్ట్ హోం రెమెడీస్
ఆలివ్ ఆయిల్ ట్రీట్మెంట్
మీ జుట్టుకు నాలుగు చెంచాల ఆలివ్ ఆయిల్ ను పట్టించాలి. ఈ ఆయిల్ తో మీ తల మాడకు మరియు కేశాలకు బాగా మసాజ్ చేసి, అరగంట అలాగే వదిలేసి తర్వాత తలస్నానం చేసుకోవాలి. మరింత మంచి ఫలితం పొందాలంటే, రాత్రిల్లో పెట్టుకొని , ఉదయం తలస్నానం చేసుకోవచ్చు . ఆలివ్ ఆయిల్ మీ జుట్టును బలోపేతం చేస్తుంది మరియు హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టుకు బెస్ట్ హోం రెమెడీస్
ఉసిరి పొడి మరియు నిమ్మరసం:
మందమైన పొడవాటి జుట్టు పొందడానికి ఉసిరి పొడి , నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తారు. అందుకు ఒక చెంచా ఉసిరి పొడికి ఒక నిమ్మపండు యొక్క రసాన్ని మిక్స్ చేసి, ఈ మిశ్రామన్ని తలకు మొత్తానికి పట్టించి 30నిముషాలు అలాగే ఉంచేయాలి తర్వాత షాంపు పెట్టి తలస్నానం చేసుకోవాలి.

ఆరోగ్యకరమైన జుట్టుకు బెస్ట్ హోం రెమెడీస్
కాంతివంతమైన జుట్టుకోసం స్ట్రాబెర్రీలు:
ఒక 8స్ట్రాబెర్రీ పండ్లను మెత్తగా గుజ్జులా తయారుచేసి, దానికి ఒక చెంచా మోయొనైజ్ మిక్స్ చేసి పక్కన పెట్టుకొని, తలను నీటితో తడి చేసుకొని, తర్వాత ఈ మిశ్రమాన్ని ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత షవర్ క్యాప్ ను పట్టుకొని, తర్వాత డినీళ్ళలో ముంచిన టవల్ నుతలకు చుట్టుకోవాలి . ఒక గంట తర్వాత మంచి కండీషనర్ మరియు షాంపుతో తలస్నానం చేయాలి.

ఆరోగ్యకరమైన జుట్టుకు బెస్ట్ హోం రెమెడీస్
మెంతులు:
రెండు చెంచాలా మెంతులను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం వాటని మెత్తగా పేస్ట్ చేసి, తల మొత్తానికి పట్టించాలి. పట్టించిన తర్వాత 30నిముషాలు అలాగే ఉంచి తర్వాత తలస్నానం చేసుకోవాలి. చుండ్రును నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications
