Latest Updates
-
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు
జుట్టు సమస్యలకు బంగాళదుంప బ్యూటీ చిట్కాలు
బంగాళ దుంపలు అనేవి ప్రతి ఒక్కరి ఆహారపు మెథడాలజీలో ఒక ప్రాథమిక భాగంగా ఉన్నాయి.ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ప్రతి వంటగది లోపల కనిపిస్తుంది. చాలా విస్తారంగా వినియోగించే కూరగాయలలో ఇది ఒకటి. బంగాళాదుంపలు అతిపెద్ద నాలుగో పోషకహారంగా ఉన్నాయి. బంగాళాదుంపకి ముందు వరి, గోధుమ మరియు మొక్కజొన్న ప్రపంచ ఆహారంలో కీలక భాగంను ఏర్పరచుకున్నాయి.
బంగాళదుంపను బ్యూటీ చిట్కాల కొరకు ఉపయోగిస్తారని మీకు తెలుసా? కానీ ఇది నిజం. మీరు అందంనకు మూలవస్తువుగా బంగాళాదుంపను ఉపయోగించవచ్చు.ఇక్కడ జుట్టు అందం కొరకు బంగాళదుంపను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

బంగాళదుంపతో జుట్టు అందం చిట్కాలు
1. ఒక బంగాళదుంపను తీసుకోని దానిని కోరి నీటిని పిండేయాలి. దానిలో గుడ్డు,పెరుగు కలపాలి. అప్పుడు మంచి ప్యాక్ తయారవుతుంది. జుట్టు మరియు మొత్తం జుట్టు మూలాలకు పట్టించండి. 20 నిముషాల తర్వాత వెచ్చని నీటితో మరియు సాధారణ షాంపూ తో శుభ్రం చేసుకోవాలి. మంచి పలితం కోసం 20 రోజులకు ఒకసారి ఈ విధంగా చేయాలి. ఈ ప్యాక్ ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టును ఇస్తుంది.
2. బంగాళాదుంప పై తొక్క తీయండి. ఒక పాన్ లో తగినంత నీరు పోసి కాచి దానిలో బంగాళాదుంప పొట్టు వేసి 20 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని ఏదైనా పాత్రలో వడకట్టాలి. జుట్టును సాధారణ షాంపూ తో శుభ్రం చేసుకున్నాక పైన మరిగించి వడకట్టిన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మీ జుట్టుకు సహజ నలుపు రంగు ఇవ్వటానికి సహాయపడుతుంది.ఈ విధంగా వారం విడిచి వారం చేయాలి. ఇది బూడిద రంగు జుట్టు కోసం మంచిగా మరియు సహజమైన చికిత్సగా ఉంటుంది.
3. మీరు జుట్టు నష్టం సమస్యతో బాధపడుతున్నారా? నేను మీ సమస్యను పరిష్కరించడానికి ఇంట్లో చేసుకొనే ఒక బ్యూటీ రెసిపీ ని చెప్పుతున్నాను. మూడు స్పూన్స్ బంగాళదుంప రసం,మూడు స్పూన్స్ కలబంద రసం,రెండు స్పూన్స్ తేనే తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి రెండు గంటల తర్వాత రెగ్యులర్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఒక వారంలో రెండు సార్లు ఈ విధంగా చేస్తే మంచి పలితం కనపడుతుంది.



Click it and Unblock the Notifications
