Latest Updates
-
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్ -
పెళ్లై ఏళ్లు గడిచాక చాలా జంటలు భార్యాభర్తలుగా కాదు, రూమ్మేట్లలా జీవిస్తున్నారు మీరూ ఇలాంటివారేనా? -
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్‌తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026
జుట్టు పట్టుకుచ్చులా మెరవాలంటే వెజిటేబుల్ హెయిర్ ప్యాక్
సాధారణంగా మనం తీసుకొనే సమతుల ఆహారం మన ఆరోగ్యం, జుట్టు మీద ఆధారపడి ఉంటుంది. మన శరీరం యొక్క ఇతర భాగాలకు భిన్నంగా జుట్టు ఉంది. మీరు ఆయిల్ ఫుడ్స్ మరియు ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి మీ చర్మం ఛాయను డ్యామేజ్ చేసినట్లే, కేశ సౌదర్యాన్ని, నాణ్యతను డ్యామేజ్ చేస్తుంది. మనకు మందపాటి హెయిర్, విలాసవంతమైన కేశాలు కావాలని కోరుకున్నప్పుడు మనం తప్పని సరిగా మనం తీసుకొనే ఆహారం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మనం ప్రతి రోజూ తినే పోషకాలు మన జుట్టు మరియు హెయిర్ పోలిసెల్స్ మీద కీలక పాత్రను పోషిస్తాయి.
ఇలా తాజా కూరలు నేరుగా తీసుకోవడంతో పాటు, జుట్టు పట్టుకుచ్చులా మెరవాలంటే వెజిటేబుల్ హెయిర్ ప్యాక్స్ కూడా వేయాలి. మార్కెట్లో దొరికే ప్యాక్స్‌లో జుట్టుకు హాని కలిగించే రసాయనాలుంటాయి. కాబట్టి వాటికి బదులుగా తక్కువ ఖర్చులో ఇంట్లోనే హెయిర్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. వీటి వల్ల జుట్టు సమస్యలు తొలగిపోవటంతోపాటు శిరోజాలు అందంగా తయారవుతాయి.

ఉల్లిపాయ హెయిర్ ప్యాక్
జుట్టు పెరుగుదలకు సహాయపడే న్యూట్రీషియన్ ఫుడ్ ఇది.ఇందులో జింక్, ఐరన్, మరియు బయోటిన్ ఇవన్నీ కూడా జుట్టు పెరుగుదలకు అవసరమయ్యేవే. ఇవన్నీ ఉల్లిపాయలో పుష్కలంగా ఉన్నాయి. జుట్టు పెరుగుదలతో పాటు, తెల్ల జుట్టు నివారిస్తుంది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను మిక్సీలో వేసి రసం తీయాలి. దీనికి రెండు టీ స్పూన్ల తేనె కలపాలి. ఉల్లి వాసన పోయేందుకు కొన్ని చుక్కల రోజ్‌వాటర్ కూడా కలుపుకుని జుట్టుకు పట్టించాలి. తర్వాత 40 - 50 నిమిషాలాగి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు కండిషన్ అవుతుంది. మంచి మెరుపును సంతరించుకుంటుంది.

పొటాటో హెయిర్ ప్యాక్
స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరం బీటాకెరోటిన్ గ్రహించి అది విటమిన్ ఎ గామార్పు చెందుతుంది. శరీరంలో కణాల మరమ్మత్తుకు బీటా కెరోటిన్ బాగా సహాయపడుతుంది. కాబట్టి, విటమిన్ ఎ కు మూలం అయిన స్వీట్ పొటాటోను తినడం మంచిది. అలాగే, రెండు నుంచి మూడు బంగాళాదుంపలను మిక్సీలో వేసి రసం పిండుకోవాలి. దీనికి ఒక టేబుల్‌స్పూన్ తేనె, ఒక పచ్చ సొన చేర్చాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నీరు చేర్చి తలకు పట్టించాలి. 30 నిమిషాలాగి వెంట్రుకలు శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌తో జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది. చిక్కులు తొలగిపోతాయి.

వెల్లుల్లి హెయిర్ ప్యాక్
వెల్లుల్లి రసం వల్ల వెంట్రుకలు పెరుగుతాయి. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ చర్మం అడుగున కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా కుదుళ్లు వెంట్రుకల పెరుగుదలను ప్రేరేపిస్తాయి. అందుకే జుట్టును పెంచే ఉత్పత్తుల్లో సల్ఫర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.

కొత్తిమీర హెయిర్ ప్యాక్
కొత్తిమీరకు నీళ్లు చేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య తీరుతుంది.

క్యారెట్ హెయిర్ ప్యాక్
జుట్టుకు రెండవ ఉత్తమ వెజిటేబుల్ క్యారెట్స్ . క్యారెట్స్ లో విటమిన్ బి7 లేదా బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టుకు ఒక హెల్తీ టానిక్ గా పనిచేస్తుంది. బయోటిని జుట్టు తిరిగి పెరగడానికి బాగా సహాయపడుతుంది. అదే సమయంలో ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. క్యారెట్లను ఉడికించి , ఉడికించిన నీటితో కలిపి మెత్తని గుజ్జుగా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

కొబ్బరి నీళ్ళు హెయిర్ ప్యాక్
లేత కొబ్బరి కాయలోని కొబ్బరిని కొద్దిగా వేడిచేసి వెచ్చగా ఉన్నప్పుడే జుట్టు కుదుళ్లకు మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచి పిండిన టవల్‌ను జుట్టుకు చుట్టుకుని ఆవిరి పట్టాలి. ఓ గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు సిల్కీగా తయారవుతుంది.

టమోటోలు
టమోటోలు: టమోటోలో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మరియు టమోటో ఒక ఎఫెక్టివ్ సెల్ రిపేరింగ్ ఏజెంట్. ఇవి తలలో మలినాలను మరియు టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి, టమోటోలను నేరుగా తీసుకోవడం లేదా టమోటో రసాన్ని తలకు పట్టించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బీట్ రూట్
బీట్ రూట్ లో లికోపిన్ పుష్కలంగా ఉంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. బీట్ రూట్ తో పాటు ముల్లంగి వంటి దుంపలు కూరలు కూడా జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతాయి. బీట్ రూట్ ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి రసాన్ని తలకు పట్టించాలి. అలాగే తలస్నానం పూర్తయిన తర్వాత బీట్ రూట్ రసాన్ని తలరా సోసుకొని అలాగే వదిలేస్తే జుట్టుకు మంచి పోషణ మరియు నేచురల్ కలరింగ్ వస్తుంది.

కీరదోసకాయ
కీరదోసకాయ సరైన హెయిర్ గ్రోత్ కు సహాయపడుతుంది మరియు జుట్టు యొక్క నాణ్యతను పెంచతుంది. ఇందులోని ఎంజైమ్స్ జుట్టు నష్టాన్ని నివారిస్తుంది . హీమోగ్లోబిన్ మరియు ఫోలీసెల్స్ ను పెంచుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు కీరదోస జ్యూస్ ను త్రాగడం వల్ల జుట్టు సమస్యలన్నీ తగ్గించుకోవచ్చు. అలాగే నేచురల్ షైనింగ్ మరియు నునుపైన జుట్టును పొందడానికి కీరదోసకాయ రసాన్ని కూడా తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

అలోవెరా జ్యూస్
అలోవెరా జ్యూస్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలోవెరా జ్యూస్ లో ఉన్న విటమిన్స్ జుట్టును బలోపేతం చేస్తుంది. బ్రేకేజ్ తగ్గిస్తుంది. ఈ జ్యూస్ లోని ఎంజైములు న్యూరిష్ చేస్తుంది మరియు మాయిశ్చరైజ్ చేస్తుంది. అలోవెరా జ్యూస్ చుండ్రును నివారిస్తుంది మరియు దురదను తగ్గిస్తుంది . జుట్టుకు అలోవెరా జ్యూస్ ను అప్లై చేయడం వల్ల జుట్టు మెరుస్తూ, సున్నితంగా మారుతాయి.



Click it and Unblock the Notifications