Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జుట్టు రాలడం నివారించే హోం మేడ్ హెయిర్ మాస్క్
జుట్టు ఉంటే ఎలాంటీ హెయిర్ స్టైల్ అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. అందులో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, సాధారణ పోనీ టైల్ లేదా గ్లామరస్ బన్ ఇలా మీకు నచ్చిన విధంగా హెయిర్ స్టైల్ ను మార్చుకోవచ్చు . ప్రస్తుతం మారుతున్న వాతావరణం బట్టి, హెయిర్ స్టైల్ ను చాలా సులభంగా మార్చుకోవచ్చు . వాతావరణంలో దుమ్ము మరియు ధూలి మరియు కాలుష్యం వంటివి మీ జుట్టును ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది . అలా జరగకుండా ఉండాలంటే, కొన్ని రకాల హెయిర్ మాస్క్ లను ఉపయోగించాలి.
జన్యు సంబంధ వ్యాధులు, ఒత్తిడితో కూడిన లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకరమైన ఆహారం మొదలగునవన్నీ జుట్టు మీద ప్రభావం చూపుతుంది. దాంతో తలలో చుండ్రు, డ్రై హెయిర్, జుట్టు చిక్కుబడటం, హెయిర్ ఫాల్, తలలో దురద వంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఇంట్లో తయారుచేసి, వేసుకొనే హెయిర్ మాస్క్ ల వల్ల అనేక ప్రయోజనాలున్నాయన్న విషయం మీకు తెలుసా? తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే....
జుట్టు రాలే సమస్య వయస్సుతో సంబంధం లేకుండా అన్నిచిన్న పెద్ద అందరూ ఎదుర్కొంటున్న సమస్య. సాధారణంగా , హెయిర్ ఫాల్ అనేది చాలా సాధరణ విషయం అని, అందరిలో ఇది సహజంగా జరుగుతుంటుందని డాక్టర్లు చెబుతుంటారు . అయితే జుట్టు అధికంగా రాలుతుంటే మరియు జుట్టు పెరుగుదల ఆగిపోయినప్పుడు విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి . మీరు ఈ సమస్యను ఎదుర్కొంటుంటే కొన్ని హోం మేడు హెయిర్ మాస్క్ లతో హెయిర్ సమస్యలను నివారించుకోవచ్చు.
READ MORE:పొడి మరియు నిస్తేజంగా ఉన్న జుట్టు కోసం 10 హెయిర్ మస్క్స్
జుట్టు రాలడం అరికట్టే హోం మేడ్ హెయిర్ మాస్క్ కోసం ప్రధానంగా మీరు ఎలాంటి పదార్థాలు ఉపయోగించాలన్న విషయం తెలుసుకోవాలి. వాటి ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాలి. మరి హోం మేడ్ హెయిర్ మాస్క్ లు ఏంటో ఒక సారి చూద్దాం...

గుడ్డులోని పచ్చసొన మరియు గ్రీన్ టీ:
ఒక గుడ్డులోని పచ్చసొన మరియు రెండు చెంచాల గ్రీన్ టీ మిక్స్ చేసి తలలో జుట్టు మొదల్ల నుండి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. మీకు కనుక డ్రై హెయిర్ ఉన్నట్లైతే దీనికి ఎగ్ వైట్ ను ఉపయోగించుకోవాలి . ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

హెయిర్ ఆయిల్ మరియు విటమిన్ ఇ :
కొబ్బరి నూనె, బాదం, ఆలివ్ మరియు జోజోబా ఆయిల్ ను ఒక బౌల్లో మిక్స్ చేసి , అందులో కొద్దిగా విటమిన్ ఇ క్యాప్స్యూల్ వేసి మిక్స్ చేయాలి. దీన్ని తలకు పట్టిస్తూ, 10 నిముషాలు బాగా మసాజ్ చేయాలి. రాత్రి పడుకొనే ముందు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని రోజువిడిచి రోజు వేసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ మరియు ఆలమ్ మాస్క్:
ఆనియన్ మిక్సీలో వేసి మొత్తగా చేసి, జ్యూస్ పిండుకోవాలి. దానికి కొద్దిగా ఆలమ్ ను మిక్స్ చేసి తకలు మరియు కేశాలకు పట్టించాలి.వారంలో రెండు సార్లు రాత్రుత్లో మాస్క్ ను వేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

అరటి మరియు తేనె హెయిర్ మాస్క్:
జుట్టు రాలడం నివారించేందుకు ఇది ఒక ఉపయోగకరమైన హెయిర్ మాస్క్. రెండు అరటిపండ్లుకు పొట్టు తీసి మెత్తగా చేయాలి . దానికి తేనె మరియు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించి 5నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

పెరుగు మరియు వెనిగర్:
పెరుగు మీ జుట్టుకు డీప్ కండీషన్ ఇస్తుంది. మీ జుట్టు పొడవును బట్టి, హెయిర్ మాస్క్ రెడీ చేసుకోవాలి . ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు తేనె మిక్స్ చేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి తర్వాత తలకు పట్టించి 15నిముసాల తర్వాత తస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ మీ జుట్టును స్మూత్ గా మరియు గ్లాసీగా మార్చుతుంది.

అవొకాడో:
బాగా పండిన అవొకాడోను మ్యాష్ చేసి. అందులో అరకప్పు పాలు పోసి, తర్వాత ఒక చెంచా ఆలివ్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ కూడా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి, తలకు పట్టించి 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

స్ట్రాబెర్రీ మాస్క్:
స్ట్రాబెర్రీ గుజ్జు, కొబ్బరి నూనె మరియు తేనె మూండింటిని మిక్స్ చేసి తలకు పట్టించి 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కరివేపాకు మరియు కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో ఫ్రెష్ గా ఉండే కరివేపాకు వేసి మరిగించి, చల్లారిన తర్వాత మీ తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

స్పెషల్ హనీ మాస్క్:
ఈ వండర్ఫుల్ హెయిర్ మాస్క్ తయారుచేయడానికి ఒక చెంచా తేనె, ఆముదం, ఒక చెంచా రమ్, ఒక చెంచా గుడ్డు పచ్చసొన, విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ క్యాప్స్యూల్ వేసి బాగా మిక్స్ చేసి తలకు పూర్తిగా పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.

ఓట్ మీల్ హెయిర్ మాస్క్:
ఒక కప్పు పాలలో ఓట్స్ మిక్స్ చేసి, తర్వాత దీన్ని తలకు పట్టించి, 20 నిముషాల తర్వాత షాంపుతో తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications