Latest Updates
-
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా?
అబ్బాయిలు వాళ్ల జుట్టు విషయంలో చేసే కామన్ మిస్టేక్స్..!
జుట్టు విషయానికి వస్తే.. చాలామంది ఆడవాళ్లకు సంబంధించినదని భావిస్తారు. కానీ.. మగవాళ్ల విషయంలోనూ జుట్టు సంరక్షణ చాలా ముఖ్యమైనది. వాళ్లు కూడా జాగ్రత్త పడితేనే.. బట్టతల, జుట్టు తెల్లబడటం వంటి సమస్యలకు దూరంగా ఉంటారు. అలాగే మగవాళ్ల జుట్టు ఆడవాళ్ల జుట్టుతో పోల్చితే చిన్నగా ఉంటుంది కాబట్టి.. పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదని భావిస్తారు. కానీ.. ఇది చాలా పెద్ద పొరపాటు.
మగవాళ్ల గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్.. !!
కానీ మగవాళ్ల జుట్టు తక్కువగా ఉన్నా.. కేర్ తీసుకుంటేనే.. జుట్టు హెల్తీగా, అందంగా ఉంటుంది. కాబట్టి వాళ్లు కూడా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. జుట్టు హెల్తీగా, అందంగా ఉంటేనే.. అబ్బాయిలు ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు. అలాగే యంగ్ లుక్ ఉంటుంది. కాబట్టి.. మగవాళ్లు కూడా జుట్టు విషయంలో కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి.
అయితే అబ్బాయిలకు ఉండే కొన్ిన అలవాట్లు.. వాళ్ల జుట్టుని నాశనం చేస్తున్నాయి. అంటే రోజూ వాళ్లు జుట్టు విషయంలో చేసే పొరపాట్ల వల్ల.. జుట్టు నిర్జీవంగా మారుతోంది. మరి వాళ్లు చేస్తున్న పొరపాట్లేంటో చూద్దాం..

షాంపూ
అబ్బాయిలు త్వరగా తలస్నానం చేస్తుంటారు. సరైన సమయం స్నానానికి కేటాయించరు. దీనివల్ల షాంపూ పూర్తీగా తొలగిపోదు. ఇలాంటి అలవాటు వల్ల షాంపూలో ఉండే కెమికల్స్ జుట్టుని పొడిబారిలే చేస్తాయి.

హెయిర్ ప్రొడక్ట్స్
చాలా మంది అబ్బాయిలు.. ఎక్కువ సార్లు హెయిర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అప్లై చేస్తుంటారు. అది కూడా జుట్టు మరీ తడిగా ఉండగానే జుట్టుకి స్టైలింగ్ జెల్ అప్లై చేస్తారు. ఇవన్నీ జుట్టు ఆరిన తర్వాత అప్లై చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. తడిగా ఉన్నప్పుడే అప్లై చేస్తే.. దాన్ని జుట్టు గ్రహించలేదు. అలాగే అసహ్యంగా కనిపిస్తుంది.

బట్టతల
బట్టతల ఉన్న మగవాళ్లు.. ఉన్న జుట్టుతోనే.. బట్టతలను కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది కొంతమందికి కలిసొచ్చినా.. కొంతమందికి అది అసహ్యంగా కనిపిస్తుంది.

హెయిర్ స్టైల్స్
కొన్నిసార్లు అబ్బాయిలు ట్రెండీ హెయిర్ స్టైల్ ని ప్రయత్నిస్తుంటారు. కానీ.. మీ ముఖానికి సరిపోయేలా ఉందో లేదో తెలుసుకోవాలి. మీ ఫీచర్స్ కి సరిపోని.. హెయిర్ స్టైల్ ట్రై చేయడం వల్ల.. మీ లుక్ పైన ప్రభావం చూపుతుంది.

కెమికల్ ప్రొడక్ట్స్
జుట్టు అందంగా, స్టైలిష్ గా కనిపించాలని కొంతమంది అబ్బాయిలు.. కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. కానీ.. ఇలాంటివి ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టుకి హాని చేసి.. జుట్టు రాలడానికి, బట్టతల రావడానికి కారణమవుతుంది.

తరచుగా తలస్నానం
చాలామంది అబ్బాయిలు తమ జుట్టు చాలా చిన్నది కాబట్టి.. త్వరగా ఆరిపోతుందని.. ఎక్కువగా తలస్నానం చేస్తుంటారు. చాలా తరచుగా తలస్నానం చేయడం వల్ల.. జుట్టు మాయిశ్చరైజర్ లెవెల్స్ కోల్పోయి.. పొడిబారడానికి కారణమవుతుంది.

గట్టిగా రుద్దడం
అబ్బాయిలు జుట్టుని శుభ్రం చేసుకునేటప్పుడు చాలా గట్టిగా రుద్దుకుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల జుట్టు రాలే సమస్య వస్తుంది. కాబట్టి సున్నితంగా మసాజ్ చేసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి.



Click it and Unblock the Notifications
