For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ఆరోగ్యానికి మరియు పెరుగుదలకు బెస్ట్ ఆయిల్

By Staff
|

బాదం లేదా కోకనట్ ఆయిల్ ఏ నూనెను మీ జుట్టుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు? పురాతన కాలం నుండి ఇప్పటి వరకూ 90శాతం మహిళలు కొబ్బరి నూనెను కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

బాదం నూనెలో వివిధ రకాల ప్రయోజనాలున్నాయి . మరియు ఈ నూనెను కొబ్బరి నూనెతో మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల మరిన్ని అదనపు ప్రయోజనాలు పొందుతారు . దాంతో జుట్టు అద్భుతమైన లుక్ ను సొంతం చేసుకుంటుంది.

ఈ రోజు, ఈ సమ్మర్లో ఏ నూనెను తలకు పెట్టుకోవడం మంచిదని సూచిస్తున్నది . మీకు కనుక డ్రై హెయిర్ ఉన్నట్లైతే అప్పుడు బాదం ఆయిల్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఇది మరింత ఒత్తుగా మరియు ఎక్కువగా కనబడేలా చేస్తుంది.

జిడ్డు జుట్టుకు కొబ్బరి నూనె ఎంపిక చేసుకోవాలి. ఇది తలలోని జిడ్డును సులబంగా తొలగిస్తుంది. అదే విధంగా, అదనంగా మరే నూనెనైనా జోడించాలనుకుంటే బాదం ఆయిల్ బెస్ట్ ఆప్షన్.

ఈ రెండు నూనెల యొక్క కాంబినేషన్ లో తలకు పెట్టడం వల్ల జుట్టుకు ఎక్స్ ట్రా షైన్ మరియు అదనపు ప్రయోజనాలు అందుతాయి . కొబ్బరి నూనెలో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి మీ జుట్టును సాఫ్ట్ గా మార్చుతాయి. మరి ఇకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్లో మీకు ఏది బెటర్ ఆప్షనో ఎంపిక చేసుకొని ప్రయత్నించండి..

చిక్కుబడిన జుట్టు:

చిక్కుబడిన జుట్టు:

ఈ రకమైన జుట్టుకు కొబ్బరి నూనె అద్భుతంగా సహాయపడుతుంది . మీకు మ్యానేజ్ చేయలేనంత చిక్కుబడిన జుట్టు ఉన్నట్లైతే కొబ్బరి నూనె ఉత్తమం. కొబ్బరి నూనెలో క్యాల్సియం, ఐరన్ పొటాషియం, మరియు మెగ్నీషియం ఉన్నాయి . ఇవి మీ జుట్టును సాప్ట్ గా మార్చుతాయి. కొన్ని నెలల్లోనే మంచి మార్పు తీసుకొస్తాయి.

చిట్లిన జుట్టు:

చిట్లిన జుట్టు:

కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాట్ జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది . ప్రతి ఒక్క వెంట్రుకకు పోషణను అందివ్వడంతో పాటు , జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది . ఇలాంటి రకమైన జుట్టుకు కొబ్బరి నూనె ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ.

తెల్లజుట్టు:

తెల్లజుట్టు:

తెల్లజుట్టును హైడ్ చేయాలనుకుంటున్నారా...మరి ఈ సింపుల్ రెమెడీ ఫాలో అయిపోండి . ఒక బౌల్లో 100ml కొబ్బరి నూనె, గుప్పెడు కరివేపాకు మరియు కొద్దిగా ఉసిరి పొడి వేసి , బాగా మరిగించాలి . గోరువెచ్చని నూనెను తెల్లజుట్టుకు అప్లై చేయాలి . కరివేపాకు మరియు ఆమ్లా కాంబినేషన్ ఆటోమాటిక్ గా హెయిర్ ను బ్లాక్ గా మార్చుతుంది.

జుట్టు రాలడం:

జుట్టు రాలడం:

బాదం నూనెతో హెయిర్ ఫాల్ ను నివారించుకోవచ్చు. బాదం ఆయిల్ ను గోరువెచ్చగా చేసి తలకు పెట్టడం వల్ల జుట్టుకు నేచురల్ గా పోషణను అందిస్తుంది మరియు విటమిన్ ఇ మరియు డి లు చిట్లిన జుట్టును బలోపేతం చేస్తుంది.

మీ జుట్టును మెరిపిస్తుంది:

మీ జుట్టును మెరిపిస్తుంది:

ఈ బ్రౌన్ ఆయిల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది . మీ జుట్టును మరింత మెరిపిస్తుంది . ఈ నూనెను వారంలో రెండు సార్లు అప్లై చేస్తుంటే...రొటీన్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది:

బాదం నూనెలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది . ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . మీ జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే బాదం ఆయిల్ బెస్ట్.

చుండ్రు:

చుండ్రు:

బాదం ఆయిల్ చుండ్రును నివారిస్తుంది . బాదం నూనెలో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు చుండ్రును నివారిస్తుంది.

English summary

Almond Or Coconut Oil: Which One Is The Best?

Almond or coconut oil, which one do you prefer for your tresses? A total of 90 per cent of the women would prefer the latter, since it is an ancient ingredient to strengthen and promote better-looking hair.
Desktop Bottom Promotion