For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుని బలంగా, ఒత్తుగా మార్చే శనగపిండి హెయిర్ ప్యాక్స్..!!

మీకు తెలుసా ? గతంలో శనగపిండితో కాచిన అంబలిని జుట్టుని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించేవాళ్లు. రకరకాల ఫ్లేవర్స్, బ్రాండ్స్ లో ఇప్పుడు అందుబాటులో ఉన్నన్ని షాంపూలు ఒకప్పుడు ఉండేవి కాదు.

By Swathi
|

శనగపిండిని కొన్నేళ్లుగా చర్మ, జుట్టు సౌందర్యానికి ఉపయోగిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా శనగపిండి చర్మాన్ని క్లెన్స్ చేసి, ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. కానీ జుట్టుకి కూడా శనగపిండి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలామందికి తెలియని విషయం. జుట్టు పెరుగుదలకు, బలంగా ఉండటానికి శనగపిండిని ఉపయోగిస్తారు.

Besan Hair Mask Recipes For Super Strong Hair!

నిజమే శనగపిండి కేవలం చర్మానికే కాదు.. జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు తెలుసా ? గతంలో శనగపిండితో కాచిన అంబలిని జుట్టుని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించేవాళ్లు. రకరకాల ఫ్లేవర్స్, బ్రాండ్స్ లో ఇప్పుడు అందుబాటులో ఉన్నన్ని షాంపూలు ఒకప్పుడు ఉండేవి కాదు. అందుకే అప్పట్లో న్యాచురల్ షాంపూగా ఉపయోగించిన శనగపిండి వల్ల జుట్టు చాలా బలంగా, ఒత్తుగా ఉండేది.

అయితే శనగపిండిని ఎలా ఉపయోగించాలి, ఎలాంటి పదార్థాలను కలిపి జుట్టుకి పట్టించాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు వివరించబోయే రెమెడీస్ అన్నీ ట్రై చేసిన, టెస్ట్ చేసిన, మెరుగైన ఫలితాలు అందించినవి. మరి శనగపిండి మాస్క్ లు జుట్టు పెరుగుదలకు ఎలా ఉపయోగించాలో చూద్దామా..

శనగపిండి, పెరుగు

శనగపిండి, పెరుగు

శనగపిండి, పెరుగు మిశ్రమం స్కాల్ప్ ని ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, బ్యాక్టీరియా పెరుగులో ఉంటాయి. ఇవి స్కాల్ప్ కి ఇన్ఫెక్షన్ కాకుండా అడ్డుకుంటాయి. శనగపిండిలో పెరుగు కలిపి జుట్టుకి అప్లై చేయాలి. ఒకవేళ స్కాల్ప్ లో దురద ఉంటే పసుపు కలుపుకుని అప్లై చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి, 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

శనగపిండి, కోడిగుడ్డు

శనగపిండి, కోడిగుడ్డు

ఈ రెండింటి మిశ్రమం నిర్జీవమైన, పొడి జుట్టుని నివారిస్తుంది. షాంపూ, కండిషనర్ కంటే చాలా ఎఫెక్టివ్ ఫలితాలనిస్తుంది. 2 స్పూన్ల శనపిండి, ఒక గుడ్డులోని తెల్లసొన కాలపాలి. ఒక్కో స్పూన్ చొప్పున నిమ్మరసం, తేనె కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

శనగపిండి, ఆలివ్ ఆయిల్

శనగపిండి, ఆలివ్ ఆయిల్

శనగపిండి, ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించడం వల్ల పొడవాటి, ఆరోగ్యకరమైన జుట్టుని పొందవచ్చు. రెండు మూడు స్పూన్ల శనగపిండి, కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి కాసేపు ఆరనివ్వాలి. అయితే పూర్తీగా డ్రైకాకూడదు. ఇప్పుడు జుట్టుని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

శనగపిండి, బాదాం పౌడర్

శనగపిండి, బాదాం పౌడర్

కొద్దిగా శనగపిండి, బాదాం పౌడర్ కలపాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరం, తేనె, పెరుగు కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. కాసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుాసర్లు చేస్తే.. హెల్తీ, బ్లాక్ హెయిర్ మీ సొంతమవుతుంది. ఒక మీ జుట్టు డ్యామేజ్ అయి ఉంటే.. విటమిన్ ఈ క్యాప్సుల్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు.

శనగపిండితో జుట్టుకి కలిగే ఫలితాలు

శనగపిండితో జుట్టుకి కలిగే ఫలితాలు

శనగపిండి జుట్టుని బలంగా మారుస్తుంది. స్కాల్ప్ లో డ్రైనెస్ లేకుండా అరికడుతుంది. దుమ్ము, ధూళిని స్కాల్ప్ లో తొలగిస్తుంది. అలాగే చివర్లు చిట్లిపోకుండా అడ్డుకుంటుంది. సిల్కీ, స్మూత్ హెయిర్ ని అందిస్తుంది.

శనగపిండి టిప్స్

శనగపిండి టిప్స్

శనగపిండికి తడిగా ఉండే స్పూన్ ఉపయోగించరాదు. ఎప్పుడూ శనగపిండిని ఎయిర్ టైట్ కంటెయినర్ లో పెట్టుకోవాలి. శనగపిండిని చర్మానికి, జుట్టుకి ఉపయోగిస్తూ ఉండటం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

English summary

Besan Hair Mask Recipes For Super Strong Hair!

Besan Hair Mask Recipes For Super Strong Hair. Did you know you could use besan as a hair mask too? Well, here are some amazing besan hair mask recipes to give you super strong hair. Have a look.
Story first published: Monday, December 12, 2016, 13:03 [IST]
Desktop Bottom Promotion