For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్మెట్ తో హెయిర్ ఫాల్ సమస్యలు: నివారించే హోం రెమెడీస్ ...

|

జుట్టు రాలడం మహిళల్ని కలవరపెట్టే సమస్య. జుట్టు రాలడానికి ఒకటి కాదు, రెండు కాదు వివిధ రకాల కారణాలున్నాయి . వాటిలో డైట్ సరిగా తీసుకోకపోవడం, తలస్నానానికి హార్డ్ వాటర్ వాడటం , మరియు జుట్టు ఆరోగ్యానికి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టు డ్రైగా మారుతుంది.

అదే విదంగా జుట్టు రాలడానికి మరో కారణం కూడా ఉంది. సాధారణంగా సిటీ లైఫ్ స్టైల్, హెల్మెట్స్ ధరించడం. రీసెంట్ గా ఇండియాలో టూవీలర్ నడిపేవారికి మాత్రమే కాదు, వెనుక కూర్చొన్న వారు కూడా హెల్మెట్స్ తప్పక ధరించాలని ఒక రూల్ ను తీసుకొచ్చారు . ఇలాంటి పరిస్థితిలో మహిళల్లో హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు మరింత ఎక్కువగా రాలిపోవడం కూడా జరగుతుంది.

బైక్ నడిపే మహిళలకు కూడా ఈ జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటారు. ఈ జుట్టు రాలే సమస్యలను నివారించడానికి , కొన్ని పరిష్కార మార్గాలున్నాయి . వీటిని ఉపయోగించడం వల్ల హెల్మెట్ ధరించడం వల్ల రాలేజుట్టును అరికట్టవచ్చు .

ఈ హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల హెల్మెట్ ధరించినా, జుట్టు రాలకుండా నివారించుకోవచ్చు . తలకు కాటన్ క్లాత్ ను చుట్టుకొని, హెల్మెట్ ను ధరించాలి . ఈ చిట్కాను రెగ్యులర్ గా అనుసరిస్తుంటే ఎలాంటి హెయిర్ ఫాల్ ఉండదు . మరి ఆ హోం రెమెడీస్ ఏంటో చూద్దాం...

నిమ్మరసంతో :

నిమ్మరసంతో :

హెల్మెట్ ధరించడం వల్ల రాలే జుట్టును నివారించడానికి నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. మీ జుట్టుకు షైనింగ్ అందివ్వడానికి , మీ జుట్టును నిమ్మరసం తో శుభ్రం చేసుకోవడం వల్ల తలలో దురద మరియు డ్రైనెస్ నివారించబడుతుంది.

వెనిగర్ బాత్:

వెనిగర్ బాత్:

హెల్మెట్ ధరించిన తర్వాత అతి కొద్ది సమ యంలోనే హెయిర్ డల్ గా ..నిర్జీవంగా మారడం మరియు హెయిర్ ఫాల్ జరుగుతుంది . కాబట్టి, మీ నిర్జీవమైన జుట్టుకు వెనిగర్ తో స్నానం చేస్తే మీ జుట్టుకు నేచురల్ గానే మంచి షైనింగ్ ను అందిస్తుంది.

జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసం:

జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసం:

ఉల్లిపాయ రసంలో జుట్టు పెరుగుదలకు సహాయపడే రహస్యాలెన్నో ఉన్నాయి . మన్నికైన షాంపుతోతలస్నానం చేసి , ఉల్లిపాయ రసాన్ని కండీషనర్ గా అప్లై చేయాలి . ఉల్లిరసాన్ని నేరుగా తలకు అప్లై చేసి 15నిముషాల తర్వాత ప్లెయిన్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ ను వారానికొకసారి ఫాలో అయితే చాలు మీరు రోజూ హెల్మెట్ ధరించుకోవచ్చు . ఈ హోం రెమెడీ హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది .

బాదం నూనె:

బాదం నూనె:

బాదం నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి బాదం నూనెను వారంలో రెండు సార్లు అప్లై చేయాలి. బాదం ఆయిల్లోని విటమిన్ ఇ జుట్టుకు నేచురల్ షైన్ ను అందిస్తుంది.

అలోవెర:

అలోవెర:

అలోవెర జుట్టుకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . దీన్ని జుట్టుకు ఉపయోగించడంవల్ల జుట్టుకు మంచి కలర్ వస్తుంది . అవోవెర జెల్ ను తలకు పట్టించి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి . షాంపుతో తలస్నానం చేయాల్సిన పనిలేదు , సోపు వాడితే చాలు. ఈ రెమెడీ హెయిర్ కు గ్రేట్ గా పనిచేసే ఇక ముందు జుట్టు రాలకుండా నివారిస్తుంది.

గార్లిక్:

గార్లిక్:

జుట్టుకు వెల్లుల్లి గ్రేట్ గా పనిచేస్తుంది . జుట్టురాలడం నివారించడానికి వెల్లుల్లి గ్రేట్ గా సహాయపడుతుంది . హాట్ ఆయిల్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను వేసి నూనెలో మిక్స్ చేయాలి, దీన్ని తలకు పట్టించి మసాజ్ చేయాలి . వెల్లుల్లి జుట్టు పెరుగుదలను వేగంగా పెంచుతుంది మరియు జుట్టును స్ట్రాంగ్ గా మార్చుతుంది.

నేచురల్ షాంపు:

నేచురల్ షాంపు:

హెయిర్ ఫాల్ తగ్గించడంలో నేచురల్ షాంపు గ్రేట్ గా పనిచేస్తుంది . హోం మేడ్ యాంటీ డాండ్రఫ్ షాంపు, యాంటీ హెయిర్ ఫాల్ షాంపును ఉపయోగించడం వల్ల ఫలితాన్ని మీరే గమనించవచ్చు . వారంలో రెండు సార్లు హెయిర్ వాష్ వల్ల హెయిర్ డ్యామేజ్ ను అరికట్టవచ్చు.

కరివేపాకు:

కరివేపాకు:

జుట్టు రాలడం తగ్గించడానికి కరివేపాకు గ్రేట్ గా పనిచేస్తుంది. అందుకే దీన్ని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ఒక బౌల్లో గుప్పెడు కరివేపాకు మరియు బ్రింగరాజ్ లీవ్స్ , కొద్దిగా నూనె తీసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని వేడి చేసి, చల్లారిన తర్వాత తలకు పట్టించాలి.15 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి . ఒక వారం తర్వాత తిరిగి రిపీట్ చేయాలి. జుట్టు రాలడం తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

గుడ్డుతో కండీషన్:

గుడ్డుతో కండీషన్:

హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేయడంలో ఇది బాగా సహాయపడుతుంది. ఒక బౌల్లో ఎగ్ వైట్ , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక టీస్పూన్ తేనె వేసి మిక్స్ చేయాలి . దీన్ని హెయిర్ ప్యాక్ గా అప్లై చేయాలి 20 నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

పండ్లతో పోషణ:

పండ్లతో పోషణ:

విటమిన్ సి అధికంగా ఉండే ఫ్రూట్స్ తో జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఆమ్లా, మరియు ఆరెంజ్ , నిమ్మరసం మిక్స్ చేసి అందులో జోజో బా ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించడం వల్ల వారంలో మూడు సార్లు పట్టిస్తే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.

English summary

Hair Loss With Helmet: 10 Remedies To Prevent It

Hair loss is a nightmare for women and there are more than one causes for hair fall, which include a wrong diet pattern, usage of hard water that destroys the scalp, and not pampering your tresses when it gets dry. However, there is another reason for hair loss and that is due to the use of a helmet. Recently in India, it was made mandatory for pillion riders to wear helmets, and this made the situation a whole lot worse for the ladies who are blessed with long hair.
Desktop Bottom Promotion