Latest Updates
-
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.! -
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
ఇదేందయ్యా ఇదీ.. మెట్రో ట్రైన్లో ఇలాంటి సీన్ ఎప్పుడూ చూసి ఉండరు.. వైరల్ వీడియో.! -
డయాబెటిస్ బాధితులు తేనె తీసుకోవచ్చా.. తీపి తినాలనిపిస్తే ఏం చేయాలి.? -
దీని ముందు బిర్యానీ కూడా దిగదుడుపే.. కుక్కర్లో ఈజీగా ఘుమఘుమలాడే గోంగూర పులావ్.! -
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.! -
గజకేసరి రాజయోగంతో కనక వర్షం.. ఈ మూడు రాశుల వారికి తిరుగే లేదు.! -
ఉదయం నిద్ర లేవగానే షుగర్ ఉన్నవారిని వేధించే అతిపెద్ద ప్రశ్న..ఈరోజు టిఫిన్ ఏం తినాలి?. -
ఒకే రాశిలో సూర్య కేతువులు.. వీరికి ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.. లేదంటే.! -
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ!
ఆలివ్ ఆయిల్ +ఎగ్ వైట్ లో దాగున్న జుట్టు పెరుగుదల రహస్యాలు..!!
జుట్టు ఆరోగ్యంగా, అందంగా మెయింటైన్ చేయడం కోసం హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ను వేలల్లో డబ్బు ఖర్చుచేస్తున్నారా? అయినా కూడా ఫలితం కనిపించక,నిరుశ్చాహానికి గురి అవుతుంటారు. అలాంటి వారిలో మీరు ఒకరైతే మీకోసం ఒక బెస్ట్ నేచురల్ హెయిర్ మాస్క్ ను పరిచయం చేస్తున్నాము..!
మీ జుట్టు అందంగా, ఆరోగ్యంగా ...సాఫ్ట్ గా..నేచురల్ షైనింగ్ తో ఒత్తుగా కనబడాలంటే, ఖచ్చితంగా మీరు నేచురల్ పదార్థాలను ఉపయోగించాలి. మార్కెట్లో కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఈ నేచురల్ పదార్థాలు జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి..
హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కొనడానికి షాపుకు వెళ్ళినప్పుడు, అక్కడ వివిధ రకాలుగా కొన్ని సంఖ్యల్లో హెయిర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అన్ని రకాల జుట్టు తత్వాల వారికోసం షాంపు,కండీషనర్, సెరమ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అయితే వీటిలో కెమికల్స్ అధికంగా ఉంటాయి .
అందువల్ల, మీ జుట్టు ఆరోగ్యానికి , అందాన్ని మెరుగుపరుచుకోవాలంటే, జుట్టును నేచురల్ గా అందంగా కనబడేలా చేయాలనుకుంటే,వంట గదిలోకి ఒక స్టెప్ వేయండి. అక్కడే పరిష్కార మార్గాలు అద్బుతంగా దొరుకుతాయి.
ఆలివ్ ఆయిల్ మరియు ఎగ్ వైట్ లో అనేక ప్రయోజనాలున్నాయన్న విషయం మీకు తెలుసా?
ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ల్లో, ఒక గుడ్డు మిక్స్ చేయాలి. గుడ్డులోని తెల్లని పదార్థన్ని మాత్రమే అప్లై చేయాలి. రెండు పదార్థాలు బాగా మిక్స్ అయ్యే వరకూ కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఆలివ్ ఆయిల్, ఎగ్ వైట్ హెయిర్ మాస్క్ ను తలకు వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు పొందుతారో తెలుసుకుందాం...

1.హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది:
ఈ నేచురల్ హెయిర్ మాస్క్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి జుట్టును స్ట్రాంగ్ గా, హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి. హెయిర్ ఫాల్ తగ్గిస్తాయి.

2. జుట్టు చిట్లడాన్ని నివారిస్తుంది
ఈ హోం మేడ్ హెయిర్ మాస్క్ జుట్టుకు పోషణను అందిస్తుంది, హెల్తీ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది. దాంతో జుట్టు చిట్లడం తగ్గుతుంది.

3. జుట్టు చిక్కుబడకుండా చేస్తుంది
ఆలివ్ ఆయిల్, ఎగ్ వైట్ రెండు కలిసి, జుట్టును సాప్ట్ గా మార్చుతాయి. జుట్టు చిట్లడాన్ని నివారిస్తాయి. చిక్కుబడకుండా, ఒత్తుగా, షైనాగా, స్మూత్ గా కనబడేలా చేస్తాయి.

4. జుట్టుకు తేమను అందిస్తుంది:
ఈ నేచురల్ హెయిర్ మాస్క్ నేచురల్ హెయిర్ హైడ్రేటింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది జుట్టుకు కావల్సినంత మాయిశ్చరైజర్ ను అందిస్తుంది, దాంతో జుట్టు సాప్ట్ గా మరియు సిల్కీగా మారుతుంది.

5. హెయిర్ బ్రేకేజ్ ను నివారిస్తుంది
ఈ నేచురల్ హెయిర్ మాస్క్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి, ఇవి హెయిర్ ఫాలీసెల్స్ కు తగిన బలాన్ని అందిస్తుంది.దాంతో హెయిర్ బ్రేక్ కాకుండా ఉంటుంది.

6. జుట్టుకు మంచి షైనింగ్
ఆలివ్ ఆయిల్ , ఎగ్ వైట్ కాంబినేషన్ హెయిర్ మాస్క్ జుట్టుకు షైనింగ్, రేడియంట్ లుకు అందిస్తుంది. ఇది జుట్టుకు అద్భుతమైన పోషణను అందిస్తుంది.

7. జుట్టుకు ఒత్తుగా మార్చుతుంది
ఈ హోం మేడ్ హెయిర్ మాస్క్ లో జుట్టును ఒత్తుగా , బౌన్సీగా మార్చడానికి అసవరమయ్యే పోషకాలు అధికంగా ఉన్నాయి.

8. చుండ్రు నివారిస్తుంది
ఈ హెయిర్ మాస్క్ జుట్టుకు తగిన తేమను అందిస్తుంది. తలలో డ్రైనెస్ తగ్గిస్తుంది. చుండ్రు నివారించడంలో గ్రేట్ రెమెడీ అని మీరు గుర్తిస్తారు.

9. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
ఈ నేచురల్ హెయిర్ మాస్క్ హెయిర్ ఫాలి సెల్స్ కు పోషణను అందిస్తుంది. జుట్టుకు పోషణ అందటంతో జుట్టు ఒత్తుగా, షైనీగా ఉంటుంది.

10. జుట్టు స్మూత్ గా మారుతుంది
జుట్టు పొడవునా స్మూత్ గా ఉండాలంటే, ఈ కాంబినేషన్ హెయిర్ మాస్క్ తప్పనిసరిగా వేయాల్సిందే. వైట్ అండ్ ఆలివ్ ఆయిల్ మాస్క్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

11. తలను శుభ్రం చేస్తుంది
ఈ హోం మేడ్ నేచురల్ హెయిర్ మాస్క్ తలను శుభ్రం చేస్తుంది. తలలో మురికి, .జిడ్డు, చెమట వంటి వ్యర్థాలను తొలగించి , జుట్టు ఆరోగ్యంగా పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.

12. తలలో ఆయిల్ నెస్ ను నివారిస్తుంది
ఈ మిశ్రమంలో ఎగ్ వైట్, ఆలివ్ ఆయిల్ సెబమ్ ప్రొడక్షన్ ను కంట్రోల్ చేస్తుంది. తలలో ఆయిల్ నెస్ ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది



Click it and Unblock the Notifications