For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టుని సూపర్ స్ట్రాంగ్ గా, నల్లగా, షైనీగా మార్చే హెయిర్ ఆయిల్..!

జుట్టుని బలంగా మార్చి, నల్లగా నిగనిగలాడేలా మార్చే, మెలనిన్ ఉత్పత్తిని పెంచే, స్కాల్ప్ ని క్లెన్స్ చేసే, కుదుళ్లను బలంగా మార్చే, జుట్టు పెరుగుదలను పెంచే.. హెయిర్ ఆయిల్ ఏంటో చూద్దాం.

By Swathi
|

మీ తల తెల్ల జుట్టుతో నిండిపోయిందా ? మీ జుట్టు జెన్సిటినీ కోల్పోతోందా ? జుట్టు ఎక్కువగా రాలిపోతుందని మీ జుట్టుని శుభ్రం చేసుకోవాలంటే భయంగా ఉందా ? అయితే ఈ హోంమేడ్ హెయిర్ ఆయిల్ మీకున్న అన్ని జుట్టు సమస్యలనీ పరిష్కరిస్తుంది.

Powerful Hair Oil Recipe To Make Your Hair Jet Black In 10 Days!

మీ నల్లటి జుట్టు తెల్లగా మారిందంటే.. మీకు తెల్ల జుట్టు వచ్చేసిందని అర్థం. జుట్టులో మెలననిన్ తగ్గినప్పుడు జుట్టు తన రంగుని కోల్పోతుంది. దీంతో జుట్టు తెల్లబడుతుంది. చిన్నవయసులోనే తెల్ల జుట్టు రావడానికి జెనెటిక్ కారణాలు ఉంటాయి. అలాగే ఒత్తిడి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా.. జుట్టు తెల్లబడటానికి కారణం.

ఒకవేళ మీకు అక్కడక్కడా తెల్లజుట్టు వచ్చి ఉంటే.. అవి రెట్టింపు కాకముందే.. అలర్ట్ అవండి. సాధారణంగా.. మన ఆరోగ్యం బావుంటే.. మన జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి బ్యాలెన్డ్స్ డైట్ తీసుకోండి. ప్రొటీన్స్, మినరల్స్, విటమిన్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని డైట్ లో చేర్చుకోండి. మీ శరీరం లాగే జుట్టుకి కూడా వ్యాయామం అవసరం. కాబట్టి స్కాల్ప్ ని రెగ్యులర్ గా మసాజ్ చేయండి.

ఇవాళ జుట్టుని బలంగా మార్చి, నల్లగా నిగనిగలాడేలా మార్చే, మెలనిన్ ఉత్పత్తిని పెంచే, స్కాల్ప్ ని క్లెన్స్ చేసే, కుదుళ్లను బలంగా మార్చే, జుట్టు పెరుగుదలను పెంచే.. హెయిర్ ఆయిల్ ఏంటో చూద్దాం.

స్టెప్ 1

స్టెప్ 1

అరకప్పు కొబ్బరినూనె, టేబుల్ స్పూన్ ఆముదం తీసుకుని సన్నని మంటపై ఒక నిమిషం వేడిచేయాలి. కొబ్బరినూనెలో శ్యాచురేటెడ్ ఫ్యాట్ స్కాల్ప్ కి పోషణ అందిస్తుంది. ఆముదంలో ఒమేగా త్రీఫ్యాటీ యాసిడ్స్ కుదుళ్లను బలంగా మారుస్తాయి.

స్టెప్ 2

స్టెప్ 2

2 మందారం పువ్వులను బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ లోకి ఒక టేబుల్ స్పూన్ మందారం పువ్వు పొడి కలపాలి. మందారం పువ్వులో జుట్టుకి అవసరమైన విటమిన్స్ ఉండటం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.

స్టెప్ 3

స్టెప్ 3

5 విటమిన్ ఈ జెల్ క్యాప్సుల్స్ తీసుకోవాలి. సేఫ్టీ పిన్ తో చివర్లు రంధ్రం పెట్టి.. జెల్ తీసి ఆయిల్ లో కలపాలి. ఇది కలపడానికి ముందు ఆయిల్ చల్లారి ఉండాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుని షైనీగా, స్మూత్ గా మారుస్తాయి.

స్టెప్ 4

స్టెప్ 4

గుప్పెడు కరివేపాకు తీసుకుని.. ఎండలో 24 గంటలు ఆరనివ్వాలి. ఇవి బాగా ఆరిపోయిన తర్వాత పొడి చేసుకోవాలి. ఒక టీస్పూన్ పౌడర్ ని ఆయిల్ లో మిక్స్ చేయాలి. కరివేపాకులో బీటా కెరోటిన్ ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. నల్లగా మారుస్తుంది.

స్టెప్ 5

స్టెప్ 5

మూడు చుక్కల టీట్రీ ఆయిల్ కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. చుండ్రుని నివారిస్తుంది.

స్టెప్ 6

స్టెప్ 6

ఆయిల్ ని ఒక ఎయిర్ టైట్ కంటెయిన్ లో భద్రపరచాలి. 24గంటలు అలాగే వదిలేయాలి. తర్వాత వడకట్టుకోవాలి. ఈ ఆయిల్ వాసన బావుండకపోవచ్చు. కాబట్టి కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకోవచ్చు.

స్టెప్ 7

స్టెప్ 7

జుట్టుని చిక్కులు లేకుండా దువ్వుకుని.. చిన్న చిన్న పాయలుగా విడదీయాలి. ఆయిల్ ని మసాజ్ చేసుకోవాలి. స్కాల్ప్, జుట్టు మొత్తానికి పట్టించాలి. 5 నుంచి 10 నిమిషాలపాటు మసాజ్ చేయాలి. ఇది రక్తప్రసరణను అందిస్తుంది.

స్టెప్ 8

స్టెప్ 8

రాత్రంతా ఆయిల్ ని అలాగే వదిలేసి.. ఉదయం మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత కండిషనర్ కూడా వాడాలి.

ఫలితాలు

ఫలితాలు

ఈ హెయిర్ ఆయిల్ జుట్టుని సూపర్ స్ట్రాంగ్ గా, పొడవుగా, సిల్కీగా, షైనీగా, తెల్ల జుట్టుని నివారిస్తుంది. వారానికి ఒకసారి ఈ ఆయిల్ ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు పొందుతారు.

English summary

Powerful Hair Oil Recipe To Make Your Hair Jet Black In 10 Days!

Powerful Hair Oil Recipe To Make Your Hair Jet Black In 10 Days! Say hello to jet black hair with this hair oil for grey hair.
Desktop Bottom Promotion