వింటర్ సీజన్ లో డ్రై మరియు ఫ్లేకీ స్కాల్ప్ సమస్య నుంచి ఉపశమనం కోసం 10 చిట్కాలు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

డ్రై స్కాల్ప్ సమస్య వింటర్ సీజన్ లో అత్యంత సాధారణ సమస్యగా కనిపిస్తుంది. ఈ సమస్యతో దాదాపు ప్రతిఒక్కరూ ఇబ్బందిపడుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. ఈ సమస్య తో పాటు స్కాల్ప్ పైన దురదతో పాటు ఫ్లెకీనెస్ సమస్య కూడా వేధిస్తుంది. ఈ సీజన్ లో ఇటువంటి సమస్యతో మీరు కూడా ఇబ్బందులు పడుతున్నట్టయితే మీ కోసం చక్కటి పరిష్కారాలను తీసుకువచ్చాము. ఈ రోజు, బోల్డ్ స్కై లో ఈ సమస్యను అధికమించేందుకు ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలను పాందుబరచాము. తద్వారా, పొడిబారిన ఫ్లేకీస్కాల్ప్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

డీహైడ్రేషన్ సమస్య వలన స్కాల్ప్ లో తేమ శాతం తగ్గుతుంది. నిపుణులు సూచించిన అద్భుతమైన హెయిర్ కేర్ టిప్స్ తో మీ స్కాల్ప్ ని సంరక్షించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు.

వింటర్ సీజన్ లో ఎదురయ్యే డ్రై అండ్ ఫ్లెకీ స్కాల్ప్ సమస్యను తొలగించుకునేందుకు అద్భుతమైన చిట్కాలు

10 Tips To Avoid Dry And Flaky Scalp During The Winter Season

ఈ చిట్కాలు సాధారణంగా అనిపించినా వీటిని పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన స్కాల్ప్ ని పొందవచ్చు. ఆరోగ్యకరమైన స్కాల్ప్ అంటే దట్టమైన, దృఢమైన జుట్టుకి నిలయమని అర్థం.

కాబట్టి, ఇక్కడ వివరించబడిన అద్భుతమైన చిట్కాలను పాటించి వింటర్ సీజన్లో ఎదురయ్యే డ్రై స్కాల్ప్ సమస్యను తొలగించుకుని మీ శిరోజ సంపదను సంరక్షించుకోండి.

1. వెచ్చటి నూనెతో మసాజ్ చేయండి

1. వెచ్చటి నూనెతో మసాజ్ చేయండి

ఆయిల్ ట్రీట్మెంట్ ద్వారా పొడిబారిన స్కాల్ప్ కి తగినంత తేమ అందుతుంది. తద్వారా, పొడిబారిన స్కాల్ప్ సమస్య తగ్గుముఖం పడుతుంది. వెచ్చని కొబ్బరి నూనెతో లేదా వెచ్చని ఆలివ్ ఆయిల్ తో స్కాల్ప్ పై మసాజ్ చేస్తే స్కాల్ప్ కి తగినంత తేమ అందుతుంది. వింటర్ సీజన్లో, ఈ చిట్కాని వారానికి రెండు నుంచి మూడు సార్ల పాటు పాటించండి. అలాగే, వింటర్ లో మీ స్కాల్ప్ ఆరోగ్యంగా అలాగే శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.

2. అతిగా హెయిర్ వాష్ చేయడం మానండి

2. అతిగా హెయిర్ వాష్ చేయడం మానండి

శిరోజాలను అతిగా వాష్ చేయడం వలన జుట్టులోనున్న సహజ సిద్ధమైన తేమ అనేది ఇంకిపోతుంది. ఆ విధంగా స్కాల్ప్ పొడిగా ఫ్లేకీగా మారుతుంది. అనేకమంది హెయిర్ కేర్ ఎక్స్పర్ట్స్ సూచనల ప్రకారం జుట్టుని వారంలో కేవలం రెండు నుంచి మూడు సార్లు మాత్రమే వాష్ చేయాలి. అతిగా వాష్ చేయడం వలన మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.

3. హీట్ స్టైలింగ్ టూల్స్ నుంచి దూరంగా ఉండండి

3. హీట్ స్టైలింగ్ టూల్స్ నుంచి దూరంగా ఉండండి

స్ట్రయిటెనర్స్ తో పాటు కర్లింగ్ ఐరన్స్ ని ఎక్కువగా వాడటం వలన జుట్టు పొడిబారుతుంది. జుట్టులోనున్న సహజసిద్ధమైన తేమ ఇటువంటి హీట్ స్టైలింగ్ టూల్స్ వలన తగ్గిపోతుంది. అందువలన, ఇటువంటి స్టైలింగ్ టూల్స్ కి వింటర్ సీజన్ లో దూరంగా ఉండడం ద్వారా స్కాల్ప్ అనేది డ్రై గా ఫ్లేకీ గా కాకుండా సంరక్షించుకోవచ్చు.

4. డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ ను తీసుకోండి

4. డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ ను తీసుకోండి

స్కాల్ప్ ని అలాగే మీ జుట్టుని సంరక్షించేందుకు డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ అమితంగా తోడ్పడుతుంది. ప్రత్యేకించి వింటర్ సీజన్ లో ఈ ట్రీట్మెంట్ అవసరం ఎంతో ఉంది. ఈ హెయిర్ ట్రీట్మెంట్ వలన స్కాల్ప్ కి తగినంత తేమ అందుతుంది. తద్వారా, పొడిబారిన అలాగే చల్లటి గాలి వలన శిరోజాలకు అలాగే స్కాల్ప్ కు నష్టం వాటిల్లదు. ఇంటివద్దనే సహజసిద్ధమైన పదార్థాలతో డీప్ కండిషనింగ్ మాస్క్స్ ని తయారుచేసుకోవచ్చు. లేదా ఏదైనా బ్యూటీ సెలూన్ లో కూడా ఈ ట్రీట్మెంట్ ను పొందవచ్చు.

5. హెర్బల్ హెయిర్ కేర్ ప్రాడక్ట్స్ ని వాడండి

5. హెర్బల్ హెయిర్ కేర్ ప్రాడక్ట్స్ ని వాడండి

వింటర్ సీజన్ లో హెర్బల్ హెయిర్ కేర్ ప్రాడక్ట్స్ ని వాడటం ఉత్తమం. ఈ ప్రాడక్ట్స్ అనేవి కఠినమైన కెమికల్స్ కి దూరంగా ఉంటాయి. అందువలన, ఈ ప్రాడక్ట్స్ ని వాడటం ద్వారా స్కాల్ప్ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. అలాగే, వింటర్ సీజన్ లో చల్లదనం వలన శిరోజాలకు ఇబ్బంది వాటిళ్లకుండా కాపాడుకోవచ్చు.

6. తేనెను అప్లై చేయండి

6. తేనెను అప్లై చేయండి

తేనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు అధికం. అందువలన, వింటర్ సీజన్లో స్కాల్ప్ సంరక్షణకై తేనెను వాడితే స్కాల్ప్ కి తగినంత తేమ అందుతుంది. స్కాల్ప్ పై స్వచ్ఛమైన తేనెను అప్లై చేయండి. గంట తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయండి. ఈ అద్భుతమైన హోంరెమెడీ ని వాడి మీ స్కాల్ప్ కు తగినంత తేమను ఈ సీజన్ మొత్తం అందేలా చూడండి.

7. ఆపిల్ సిడర్ వినేగార్ రిన్స్ ని ప్రయత్నించండి

7. ఆపిల్ సిడర్ వినేగార్ రిన్స్ ని ప్రయత్నించండి

ఆపిల్ సిడర్ వినేగార్ అనేది యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తూనే స్కాల్ప్ ఏరియాని పొడిగా అలాగే ఫ్లేకీగా మారకుండా తోడ్పడుతుంది. ఒక టీస్పూన్ ఆపిల్ సిడర్ వినేగార్ ని ఒక మగ్గుడు నీళ్లలో కలపండి. ఈ సొల్యూషన్ ని హెయిర్ రిన్స్ గా వాడండి. వారానికి ఒకసారి ఈ చిట్కాని పాటిస్తే డ్రై స్కాల్ప్ సమస్య వేధించదు.

8. హెయిర్ కేర్ రొటీన్ ను మార్చుకోండి

8. హెయిర్ కేర్ రొటీన్ ను మార్చుకోండి

సీజన్ మారిందంటే హెయిర్ కేర్ రొటీన్ కూడా మారాల్సిందే. అందుకే, వింటర్ ఫ్రెండ్లీ రొటీన్ కు మారండి. అలా సీజన్ కు తగిన విధంగా హెయిర్ కేర్ ను మారిస్తే శిరోజాలలో అలాగే స్కాల్ప్ లో తగినంత తేమ ఉండటం వలన డీహైడ్రేషన్ సమస్య వేధించదు.

9. హోంమేడ్ హెయిర్ మాస్క్స్ ని ప్రయత్నించండి

9. హోంమేడ్ హెయిర్ మాస్క్స్ ని ప్రయత్నించండి

హోంమేడ్ హెయిర్ మాస్క్స్ అనేవి శిరోజాలను సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. చల్లటి గాలి వలన శిరోజాల ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడతాయి. స్కాల్ప్ లో సహజసిద్ధమైన తేమ శాతం ఉండేలా సహకరిస్తాయి. తద్వారా, పొడిబారిన స్కాల్ప్ సమస్య తొలగిపోతుంది.

10. చల్లని మరియు పొడిగాలికి దూరంగా ఉండండి

10. చల్లని మరియు పొడిగాలికి దూరంగా ఉండండి

ఈ చిట్కా అత్యంత సాధారణంగా కనిపించవచ్చు. అయినా, ఇది చాలా సమర్థవంతమైన చిట్కా అని గుర్తించాలి. వింటర్ సీజన్ ను ఉద్దేశించబడినది ఈ చిట్కా. చల్లటి పొడిగాలి నుంచి శిరోజాలను అలాగే స్కాల్ప్ ను సంరక్షించుకునేందుకు తలపై క్యాప్ ని లేదా సిల్క్ స్కార్ఫ్ ని ఉపయోగించండి.

English summary

10 Tips To Avoid Dry And Flaky Scalp During The Winter Season

10 Tips To Avoid Dry And Flaky Scalp During The Winter Season,