For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ ఫాల్, ఇతర జుట్టు సమస్యలను నివారించే 7 ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!!

హెయిర్ ఫాల్ నివారించడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఫాలో అవ్వడం ఉత్తమం. ఈ హోం రెమెడీస్, ఇంటి చిట్కాల వల్ల ఎలాంటి నష్టం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు..

|

ఈ ప్రపంచంలో హెయిర్ ఫాల్ సమస్య ఉండని వారంటూ ఉండరు. గతంలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ ఉండేది, అయితే ప్రస్తుత రోజుల్లో చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడం, హెయిర్ వంటి సమస్యలు అధికమవుతున్నాయి. ఈ సమస్యను నివారించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నా, ఇవి అంతగా మంచి ఫలితాలను అందివ్వవు. అంతే కాదు ఈ సమస్య నివారించుకోవడం కోసం సలూన్ల చుట్టూ తిరిగి డబ్బు వ్రుదా చేసుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం అందదు.

7 Effective Hair Masks To Treat Hair Loss,

అందువల్ల కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ను ఫాలో అవ్వడం ఉత్తమం. ఈ హోం రెమెడీస్, ఇంటి చిట్కాల వల్ల ఎలాంటి నష్టం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు.. ఇవి హెయిర్ ఫాల్ తగ్గించడంతో పాటు, జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి. ఈ హోం రెమెడీస్ తో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల మంచి ఫలిత ఉంటుంది. హెయిర్ ఫాల్ తగ్గించే హోం మేడ్ హెయిర్ మాస్క్ ..

ఎగ్ హెయిర్ మాస్క్ :

ఎగ్ హెయిర్ మాస్క్ :

గుడ్డులో న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు హెల్తీగా పెరగడానికి సహాయపడుతాయి. ఇది అన్ని రకాల జుట్టు తత్వాలకు సహాయపడుతుంది, జుట్టుకు కావల్సని పోషణను అందిస్తుంది. దాంతో జుట్టు సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక కప్పు పాలలో ఒక గుడ్డు , రెండు టీస్పూన్ల నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్ని బాగా మిక్స్ చేసి తలకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టుకు మంచి షైనింగ్, పోషణ అందిస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

అరటి పండుతో హెయిర్ మాస్క్ :

అరటి పండుతో హెయిర్ మాస్క్ :

అరటి పండ్లలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్, నేచురల్ ఆయిల్స్ , విటమిన్స్ అధికంగా ఉంటాయి. హెయిర్ లాస్ నివారించడంలో ఇది ఒక ఐడియల్ ట్రీట్మెంట్ . కాబట్టి, అరటిపండుతో హెయిర్ మాస్క్ వేసుకోవడం మంచిది. అందుకు కావల్సినవి: 2బాగా పండి అరటిపండ్లు, ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్ , ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ తేనె అన్నీ మిక్స్ చేయాలి. స్మూత్ పేస్ట్ చేసి, తలకు మాస్క్ వేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టుకు మంచి షైనింగ్ వస్తుంది. జుట్టు సాప్ట్ గా మారుతుంది. చుండ్రు , హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది. జుట్టుకు కావల్సిన హైడ్రేషన్ అందిస్తుంది.

పెరుగుతో హెయిర్ మాస్క్ :

పెరుగుతో హెయిర్ మాస్క్ :

పెరుగులో విటమిన్ బి, ప్రోటీన్, విటమిన్ డి పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతాయి. హెయిర్ మాస్క్ కావల్సినవి: ఒక కప్పు పెరుగు, ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, ఒక టీస్పూన్ తేనె . ఈ మూడు పదార్థాలను ఒక మిక్సింగ్ బౌల్లో వేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. `15 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టుకు తగిన మాయిశ్చరైజర్ అందుతుంది. పోషణ అందుతుంది. జుట్టుకు బలాన్నిస్తుంది. హెయిర్ బ్రేకేజ్ ను తగ్గిస్తుంది.

కొబ్బరి నూనె కరివేపాకు హెయిర్ మాస్క్ :

కొబ్బరి నూనె కరివేపాకు హెయిర్ మాస్క్ :

కరివేపాకులో ప్రోటీన్స్, బీటాకెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. కొబ్బరి నూనెలో ఉండే పెనిట్రేటివ్ లక్షణాలు, ఫ్యాటీ యాసిడ్స్, జుట్టురాలడం నివారించడంలో ఫర్ఫెక్ట్ కాంబినేషన్ . ఈ మాస్క్ ను వారానికి రెండు సార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందుకు కావల్సినవి: రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెకు 10 కరివే ఆకులు. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి మరిగించడాలి. తర్వాత కొబ్బరి నూనెను గోరువెచ్చగా చల్లారనివ్వాలి. 20 నిముషాల తర్వాత షాంపుతో తలస్నాం చేయాలి.ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టుకు తగిన మాయిశ్చరైజర్ అందిస్తుంది. పోషణను అందిస్తుంది.

ఆముదం నూనెతో హెయిర్ మాస్క్ :

ఆముదం నూనెతో హెయిర్ మాస్క్ :

ఆముదం నూనెలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి తలకు కావల్సిన పోషణను అందస్తుంది. జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది. డ్యామేజ్ అయిన జుట్టును నివారిస్తుంది. కావల్సినవి: రెండు టేబుల్ స్పూన్ల ఆముదంలో రెండు టేబుల్ స్పూన్ల బ్రాందీ, ఒక గుడ్డు మిక్స్ చేయాలి. పదార్థాలన్నీ మిక్స్ చేసి, జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు చిక్కుపడదు. జుట్టు తెల్లగా మారడం నివారిస్తుంది.

గ్రీన్ టీ హెయిర్ మాస్క్ :

గ్రీన్ టీ హెయిర్ మాస్క్ :

గ్రీన్ టీలో అమేజింగ్ యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది జుట్టు రాలడానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. అందుకు కావల్సినవి ఒక గుడ్డు, 2 టేబుల్ స్పూన్ల గ్రీన్ టీ. ఒక మిక్స్ బౌల్ తీసుకుని ఈ రెండు పదార్థాలను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి.షాంపు చేయడానికి ముందు చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. జుట్టుకు కావల్సిన పోషణను అందిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ తో పోరాడి, జుట్టు రాలడం తగ్గిస్తుంది.

విటమిన్ ఇ క్యాప్స్యూల్ :

విటమిన్ ఇ క్యాప్స్యూల్ :

విటమిన్ ఇ క్యాప్య్సూల్స్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికం. ఇంకా యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. ఈ మాస్క్ ను వారానికి రెండు మూడు సార్లు వేసుకోవచ్చు. రెండు విటమిన్ ఇ క్యాప్స్యూల్ తీసుకుని, అందులో ఒక టేబుల్ స్పూన్ బాదం ఆయిల్, ఇక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టీస్పూన్ ఆముదం మిక్స్ చేసి, తలకు అప్లై చేయాలి. ఈ కాంబినేషన్ లో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, జుట్టును హెల్తీగా ఉంచుతుంది. హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తాయి.

English summary

7 Effective Hair Masks To Treat Hair Loss

Hair fall is a huge concern for many women across the globe, and if you are one of them, you should know that there are many treatments that can help you deal with this issue. The only problem is that not everyone has enough time to visit the salon to get one of these treatments.
Desktop Bottom Promotion