For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రై అండ్ రఫ్ హెయిర్ ను సాప్ట్ గా మార్చే 7 హెయిర్ మాస్క్స్

చాలా మంది డ్రై హెయిర్ తో బాధపడుతుంటారు,అలాంటి వారికోసం పొడిజుట్టును సాప్ట్ గా మార్చే ఎఫెక్టివ్ హెయిర్ మాస్క్ లు కొన్ని ఉన్నాయి..

By Lekhaka
|

జుట్టు అందంగా పొడవుగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే కొంత మందికి రఫ్ హెయిర్ ఉంటుంది. జుట్టు చూడటానికి పొడిగా, నిర్జీవంగా కనబడుట వల్ల ఉన్న జుట్టు అందం కూడా పోతుంది.

పొడి జుట్టును ముట్టుకుంటే పొడిగా అనిపించడం మాత్రమే కాదు, ఇది చూడటానికి కూడా చాలా అసహ్యంగా కనిబడుతుంది. షైనింగ్ లేకపోతే, నిర్జీవమైపోతుంది. మంచి షైనింగ్ ఉన్న జుట్టు చూడటానికి అందంగా కనబడుతుంది. జుట్టు పొడవుగా..అందంగా పెంచుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య ఇది.

7 Homemade Masks That Will Repair Your Rough Hair

పొడవు జుట్టు కోరుకునే వారు, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు డ్యామేజ్ కాకుండా..సాఫ్ట్ గా మరియు షైనిగా పెరగాలన్నా..జుట్టు బ్రేకేజ్ లేకుండా..జుట్టు చిట్లకుండా పెరగాలంటే హోం మేడ్ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి. జుట్టు పొడిగా లేకుండా చేసి, పొడవుగా పెరగడానికి కొన్ని హోం మేడ్ హెయిర్ మాస్క్ సహాయపడుతాయి.

జుట్టు పొడవు పెంచుకోవడం మాత్రమే కాదు, పొడువు జుట్టును మెయింటైన్ చేయడానికి భయపడుతుంటారు. పొడవు జుట్టును మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి, అలా భయపడే వారంతా, ఈ క్రింది సూచించిన కొన్ని హోం మేడ్ మాస్క్ లను ప్రయత్నిస్తే చాలు. ఈ హెయిర్ మాస్క్ వల్ల రఫ్ హెయిర్ తొలగిపోయి, జుట్టు పొడవుగా షైనీగా పెరుగుతుంది. రఫ్ హెయిర్ నివారించే హోం మేడ్ హెయిర్ మాస్క్..

ఎగ్ మాస్క్ :

ఎగ్ మాస్క్ :

ఈ హోం మేడ్ హెయిర్ మాస్క్ పొడి జుట్టును నివారిస్తుంది. రెండు గుడ్లలోని పచ్చసొన తీసుకుని జుట్టు పొడవున అప్లై చేయాలి. తర్వాత షవర్ క్యాప్ పెట్టుకుని ఒక గంట తర్వాత స్నానం చేస్తే జుట్టు సాప్ట్ గా మరియు స్మూత్ గా మార్చుతుంది.

ఫ్రూట్ మాస్క్ :

ఫ్రూట్ మాస్క్ :

అరటిపండు, అవొకాడోను రెండూ బాగా పండిన పండ్లను తీసుకుని , రెండు ముక్కలుగా కట్ చేసి, పేస్ట్ చేసి, తలకు, జుట్టు పొడవునా అప్లై చేయాలి. ఇది జుట్టుకు హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది. మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

మయోనైజ్:

మయోనైజ్:

పొడి జుట్టును నివారించుకోవడానికి ఈ హెయిర్ మాస్క్ గొప్పగా సహాయపడుతుంది. కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ రెండు కాంబినేషన్ బాగా మిక్స్ చేసి, జుట్టు పొడవున అప్లై చేయాలి. ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే జుట్టును హైనీగా సిల్కీగా కనబడేలా చేస్తుంది.

పెరుగు :

పెరుగు :

పెరుగు లో ల్యాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టుకు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. జుట్టుకు మంచి షైనింగ్ అందిస్తుంది. ఇది చాలా సింపుల్ రెమెడీ. పెరుగును జుట్టు పొడవునా అప్లై చేసి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు కండీషనర్ గా పనిచేస్తుంది. వారంకు ఒకసారి అప్లై చేస్తే చాలు, పొడి జుట్టు నివారించుకోవచ్చు.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

ఇది మరో సులభమైన హోం రెమెడీ. తలస్నానం చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక మగ్గు నీటిలో వేసి తలస్నానం పూర్తి అయిన తర్వాత చివరగా వెనిగర్ వాటర్ ను తలారా పోసుకోవాలి. ఇది జుట్టును సాప్ట్ గా , షైనీగా మార్చుతుంది. తలస్నానం చేసిన ప్రతి సారి ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్ పొందుతారు.

గుడ్డు , ఆలివ్ ఆయిల్ మాస్క్ :

గుడ్డు , ఆలివ్ ఆయిల్ మాస్క్ :

ఈ రెండింటి కాంబినేషన్ మాస్క్ జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. గుడ్డుకు, ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి, తలకు పట్టించాలి. ఆలివ్ ఆయిల్ జుట్టుకు మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. షైనింగ్ గా మార్చుతుంది. రఫ్ హెయిర్ స్మూత్ గా మార్చడంలో గుడ్డు ఆలివ్ ఆయిల్ గ్రేట్ హెయిర్ మాస్క్ .

కోకనట్ మిల్క్ మాస్క్:

కోకనట్ మిల్క్ మాస్క్:

రఫ్ హెయిర్ నివారించడంలో గ్రేట్ రెమెడీ. వాసన మంచిగా ఉంటుంది. ఫ్రెష్ కోకనట్ మిల్క్ లో కోకనట్ ఆయిల్ ను మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. జుట్టు మొత్తం అప్లై చేసి, ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.

English summary

7 Homemade Masks That Will Repair Your Rough Hair

Rough hair equals to bad hair days. Here are some homemade masks for rough hair that will help you beat this problem for good!
Desktop Bottom Promotion