For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే నిద్రించే ముందు ఇలా చేయండి,

జుట్టు సంరక్షణకు ఆహారం, అలవాట్లు తప్పనిసరిగా మార్చుకోవాలి. అందమైన జుట్టును కోరుకునే వారు రాత్రి నిద్రించే ముందు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

|

ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వేదించే సమస్యల్లో ఒకటి జుట్టు సమస్యలు. జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా పొడవుగా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకు సరైన జుట్టు సంరక్షణ పద్థతులను పాటించాలి. జుట్టు సంరక్షణలో భాగంగా అనేక విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఆహారం, బ్యూటీ ప్రొడక్ట్స్, హెయిర్ ప్రొడక్ట్స్, షాంపులు, నిద్ర ఇలా ప్రతీదీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజూ త్వరగా నిద్రపోవడం వల్ల అందమైన జుట్టును పొందుతారు.

జుట్టు సంరక్షణకు ఆహారం, అలవాట్లు తప్పనిసరిగా మార్చుకోవాలి. అందమైన జుట్టును కోరుకునే వారు రాత్రి నిద్రించే ముందు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జుట్టు రకాన్ని బట్టి, పొడవును బట్టి బేసిక్ హెయిర్ కేర్ టిప్స్ ను ఫాలో అవ్వాలి.

మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే నిద్రించే ముందు ఇలా చేయండి,

రాత్రుల్లో నిద్రించే ముందు తీసుకునే కొన్ని జాగ్రత్తల వల్ల జుట్టు డ్యామేజ్ కాకుండా, బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి, నిద్రించే ముందు జుట్టు కోసం తీసుకునే జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..

మీ జుట్టు వేగంగా, పొడవుగా పెరగాలంటే?10 టిప్స్మీ జుట్టు వేగంగా, పొడవుగా పెరగాలంటే?10 టిప్స్

1. షాంపు కండీషన్ :

1. షాంపు కండీషన్ :

రెగ్యులర్ గా న్యేచురల్ షాంపులు, కండీషనర్స్ ను ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మాత్రమే కాదు, హెయిర్ క్వాలిటి, హెయిర్ స్ట్రక్చర్, హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది.

2. రాత్రి నిద్రించడానికి ముందు జుట్టు పూర్తిగా డ్రైగా ఉండాలి:

2. రాత్రి నిద్రించడానికి ముందు జుట్టు పూర్తిగా డ్రైగా ఉండాలి:

సాయంత్రం లేదా రాత్రుల్లో తలస్నానం చేసేవారు, నిద్రించడానికి ముందు పూర్తిగా తలను డ్రైగా చేసికుని పడుకోవాలి. లేదంటే హెయిర్ బ్రేక్ అవ్వడం, చిట్లడం జరుగుతుంది. కాబట్టి నిద్రించడానికి ముందు ఫ్యాన్ లేదా డ్రయ్యర్ ను ఉపయోగించి పూర్తిగా తలను ఆర్పుకోవాలి.

భారతీయ స్త్రీల కేశ సౌందర్యం యొక్క టాప్ 10 రహస్యాలు... భారతీయ స్త్రీల కేశ సౌందర్యం యొక్క టాప్ 10 రహస్యాలు...

3. జుట్టును పూర్తిగా పైకి టై చేయకూడదు లేదా ముడి వేసుకోకూడదు:

3. జుట్టును పూర్తిగా పైకి టై చేయకూడదు లేదా ముడి వేసుకోకూడదు:

ఎప్పుడైనా నిద్రలేచినప్పుడు తలనొప్పిగా అనిపించిందా? అయితే వెంటనే మీరు ఆ రాత్రి తలకు టైట్ గా రబ్బర్ బ్యాండ్ వేయడం లేదా హెయిర్ టైట్ గా ముడివేయడం జరిగి ఉంటుంది. కాబట్టి, ఈవిషయం ఎప్పుడూ గుర్తుంచుకుని, హెయిర్ బ్యాండ్స్, పిన్స్, హెయిర్ బన్స్ వంటివి వాడకూడదు.

4. సిల్క్ పిల్లో కవర్స్ ఉపయోగించాలి:

4. సిల్క్ పిల్లో కవర్స్ ఉపయోగించాలి:

నిద్రించే సమయంలో పిల్లోస్ లేదా తలగడకు సిల్క్ కవర్స్ వేయాలి. పిల్లో కవర్స్ కాటన్ అయితే హెయిర్ స్ట్రక్చర్ పాడవుతుంది. సిల్క్ కవర్స్ వల్ల జుట్టు సాప్ట్ గా మరియు న్యేచురల్ మాయిశ్చరైజర్ ను కలిగి ఉంటుంది.

5. నిద్రించే ముందు తల దువ్వాలి:

5. నిద్రించే ముందు తల దువ్వాలి:

రోజంత అలసిపోయినప్పుడు చాలా సార్లు తలదువ్వుకుండా అలాగే పడుకుంటుంటారు. ఇలా పడుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్, జుట్టు రాలడం జరుగుతుంది. అంతే కాదు, మరుసటి రోజు ఉదయం చిక్కుబడిన జుట్టును మ్యానేజ్ చేయడం కష్టం అవుతుంది.

6. షవర్ క్యాప్ పెట్టుకుని నిద్రపోవాలి:

6. షవర్ క్యాప్ పెట్టుకుని నిద్రపోవాలి:

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి నిద్రించే ముందు షవర్ క్యాప్ పెట్టుకోవడం మంచిది. షవర్ క్యాప్ జుట్టును ఒక షేప్ లో ఉంచుతుంది. సాప్ట్ గా ఉంటాయి. అయితే రోజూ ఒకే రకమైన షవర్ క్యాప్ ను ధరించకూడదు.

నిద్రించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి నిద్రించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సినవి

7. క్లిప్స్ , ఎలాస్టిక్ బ్యాండ్స్ ను వాడకూడదు:

7. క్లిప్స్ , ఎలాస్టిక్ బ్యాండ్స్ ను వాడకూడదు:

నిద్రించేటప్పుడు చాలా మంది చేసే కామన్ మిస్టేక్ తలలో క్లచెస్ లేదా ఎలాస్టిక్ బ్యాండ్స్ లేదా బాబిపిన్స్ తో అలాగే నిద్రపోతుంటారు. హెయిర్ యాక్సెసరీస్ తలకు గుచ్చుకోవడం , లేదా మరుసటి రోజు వాటిని తియ్యడానికి కష్టంగా అనిపించడం జరుగుతుంది. కాబట్టి, నిద్రించే ముందు కాటన్ హెయిర్ బ్యాండ్స్ ను ఉపయోగించాలి.

8. బేబీ పౌడర్ :

8. బేబీ పౌడర్ :

జుట్టు మరీ జిడ్డుగా లేదా ఆయిలీగా ఉంటే బేబీ పౌడర్ ను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల జుట్టు వాల్యూమ్ పెరుగుతుంది. లేదా కొద్దిగా కార్న్ స్టార్చ్ కూడా తలకు అప్లై చేసుకోవచ్చు. తరువాత రోజు ఉదయం తప్పకుండా మార్పు గమనిస్తారు

English summary

Hair Care Tips During Sleep Time So That There Is No Breakage Or Damage In That Span

Hair Care Tips During Sleep Time So That There Is No Breakage Or Damage In That Span,Though the list of hair care to-dos and tips before sleep is long, these promise you good hair days.
Desktop Bottom Promotion