ఎండకు పాడైన జుట్టును, తిరిగి అందంగా..షైనీగా మార్చడానికి చిట్కాలు

By: Mallikarjuna
Subscribe to Boldsky

ఎండకు జుట్టు జీవం కోల్పోతుంది. పట్టులా ఉండాల్సిన జుట్టు ఎండిపోయి, తాకితే పీచులా, గరుగ్గా అనిపిస్తుంది. ఎండ ప్రభావం మనమీద పడకుండా అడ్డుకునేది వెంట్రుకలే. అలాంటి జుట్టుకు తగిన పోషణ అందించాలి. వేడివల్ల జుట్టు మామూలు కాలాలతో పోలిస్తే, వేసవిలో ఎక్కువగా రాలుతుంది. అయితే, కంగారుపడాల్సిన అవసరం లేదు. ఎండ తీవ్రంగా లేనప్పుడు జుట్టు రాలడమూ తగ్గుతుంది.

ఎండల్లో చెమట అధికంగా ఉండటం వల్ల జుట్టు జిడ్డుగా మారి, ఒకదానితో ఒకటి అతుక్కుపోతుంది. వేడి ఎక్కువగా ఉండటం వల్ల వెంట్రుక చివర్లు చిట్లిపోయే సమస్య తలెత్తుతుంది. థైరాయిడ్‌, మధుమేహం ఉండేవారికి ఈ సమస్య మరీ ఎక్కువ. దూరాలు ప్రయాణించేవారు వారంలో మూడు నాలుగుసార్లయినా తలస్నానం చేయాల్సిందే. షాంపూల్లో సన్‌ప్రొటెక్టివ్‌ ప్రొడక్ట్స్‌ను ఈ కాలంలో ఎంచుకోవాలి.

Here’s How You Can Repair Sun Damaged Hair

ఎండ వల్ల జుట్టు న్యాచురల్ షైనింగ్ ను కోల్పోతుంది. ఎండకు జుట్టు పాడవకుండా ఉండాలంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ వల్ల జుట్టుకు డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం కాస్మోటిక్ ట్రీట్మెంట్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ క్రింది సూచించిన కొన్ని ఫ్రెండ్లీ హోం రెమెడీస్ ను ఉపయోగిస్తే చాలు, జుట్టు ఆరోగ్యంగా, షైనీగా కనబడుతుంది. మరి ఆ మర్గాలేంటో తెలుసుకుందాం..

డ్యామేజ్ హెయిర్ ను ట్రీట్ చేయడానికి ఎఫెక్టివ్ హోం రెమెడీస్

1. బీర్ తో జుట్టు కడగాలి:

1. బీర్ తో జుట్టు కడగాలి:

బీర్ తో జుట్టును కడగడం వల్ల జుట్టు కోల్పోయిన షైనింగ్ ను తిరిగి తీసుకొస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే చాలు హెయిర్ లాక్స్ స్ట్రాంగ్ గా అవుతాయి. జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. తలకు షాంపుతో తలస్నానం చేసిన తర్వాత చివరగా బీర్ కలిపినీటిని తలారా పోసుకోవాలి. వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

2. హెయిర్ కండీషనర్ :

2. హెయిర్ కండీషనర్ :

డ్యామేజ్ అయిన జుట్టుకు హెయిర్ కండీషనర్ బాగా పనిచేస్తుంది. జుట్టు చిక్కు వదిలిస్తుంది. జుట్టు ఎల్లప్పుడు తేమగా కనబడేలా చేస్తుంది. హెయిర్ కండీషనర్ ను వారంలో కనీసం ఒకటిరెండు సార్లు వేసుకుంటే తప్పకుండా మార్పు గమనిస్తారు.

3. రోజ్మెర్రీ ఆయిల్ ను ఉపయోగించాలి:

3. రోజ్మెర్రీ ఆయిల్ ను ఉపయోగించాలి:

రోజ్మెర్రీ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని జుట్టు షైనింగ్ ను మెరుగుపరుస్తుంది. ఎండ నుండి జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ లో 5 చుక్కల రోజ్మెర్రీ ఆయిల్ కలపాలి. ఈ నూనెను వారానికొకసారి తలకు అప్లై చేస్తే చాలు సన్ డ్యామేజ్ హెయిర్ తగ్గుతుంది.

4. కరివేపాకు:

4. కరివేపాకు:

కరివేపాకులో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉంటాయి. ఇవి జుట్టును షాప్ట్ గా మార్చుతుంది. న్యాచురల్ షైనింగ్ నుఅ ందిస్తుంది. గుప్పెడు కరివేపాకును నీళ్ళలో వేసి ఉడికించాలి. 10 నిముషాలు ఉడికించిన తర్వాత క్రిందికి దింపి, చల్లార్చి, తలకు పోసుకోవాలి. వారంలో ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

5. హెయిర్ కలర్ వేసుకోకూడదు:

5. హెయిర్ కలర్ వేసుకోకూడదు:

ఎండవల్ల దెబ్బ తిన్న జుట్టుకు హెయిర్ కలర్, హానికరమైన కెమికల్స్ జుట్టును మరింత డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి, ఈ సమస్యను నివారించుకోవడానికి అలాంటి ప్రొడక్ట్స్ కు హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ కు దూరంగా ఉండాలి.

6. మయోనైజ్:

6. మయోనైజ్:

సన్ డ్యామేజ్ కు కారణమయిన జుట్టును ట్రీట్ చేయాలంటే మయోనైజ్ సహాయపడుతుంది. ఇది ఫేవరెట్ హెయిర్ బెనిఫిట్స్ కలిగినది. మయోనైజ్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టును నిర్జీవంగా లేకుండా, జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

 7. గోరువెచ్చని కొబ్బరి నూనె:

7. గోరువెచ్చని కొబ్బరి నూనె:

సన్ డ్యామేజ్డ్ హెయిర్ కు కొబ్బరి నూనె ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. ఇది జుట్టు తగిన పోషణు అందిస్తుంది, డల్ నెస్ తగ్గిస్తుంది,. రెండు మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను గోరువెచ్చగా చేసి తలకు పట్టించాలి. రాత్రుల్లో తలకు అప్లై చేసి, ఉదయం తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

8. బ్లాక్ టీ :

8. బ్లాక్ టీ :

బ్లాక్ టీలో అద్భుతమైన హెయిర్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి జుట్టును సాప్ట్ గా , షైనీగా మార్చుతాయి. జుట్టు చిక్కబడకుండా, హెయిర్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. బ్లాక్ టీ ని వారంలో ఒకసారి ఉపయోగిస్తే చాలు మంచి ఫలితం ఉంటుంది.

English summary

Here’s How You Can Repair Sun Damaged Hair

By making a few changes in your hair routine, you'll be able to fix your damaged hair without going through any pricey cosmetic treatment. Moreover, all the below-mentioned ways are wallet-friendly and effective. Give them a try to get healthier and shinier hair. Read on to explore about
Subscribe Newsletter