Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
జుట్టు రాలడం తగ్గించే వంటింటి నేస్తాలు ..!!
జుట్టు రాలడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ప్రతి ఒక్కరిలోనూ ఈ సమస్య కనిపిస్తూనే ఉంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ చెప్పే కామన్ ప్రాబ్లమ్ హెయిర్ లాస్. రోజుకి వంద వెంట్రుకలు రాలడం అనేది చాలా సాధారణమని నిపుణులు చెబుతారు.
కానీ మీ జుట్టు రాలుతున్నట్టుగానే.. హెయిర్ గ్రోత్ కూడా ఉంటేనే.. మీకు బట్టతల సమస్య ఉండదు. కానీ చాలామందికి జుట్టు రాలిపోతోంది. కానీ.. కొత్త జుట్టు రావడం లేదు. దీనివల్ల బట్టతల, పలుచటి జుట్టు వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి.
తలస్నానం చేసిన తర్వాత ఎక్కువగా జుట్టు రాలడాన్ని గమనిస్తూ ఉంటాం. జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా సున్నితంగా ఉండటం వల్ల.. డ్యామేజ్, బ్రేకేజ్ అవడానికి కారణమవుతుంది. హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి చాలా రెమిడీస్ ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా జుట్టు రాలడాన్ని అరికడతాయి.

వేప
వేపను ఇండియన్ లిలాక్ అని పిలుస్తారు. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. కాబట్టి.. జుట్టు సమస్యలకు.. దీన్ని న్యాచురల్ రెమిడీగా ఉపయోగించవచ్చు. కొన్ని వేపాకులను కొబ్బరినూనెలో మరిగించి.. నూనెను వడకట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ ఆయిల్ ని స్కాల్ప్ కి మసాజ్ చేసి.. గంట లేదా రెండు గంటల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

మెంతి
మెంతులను పొడి చేసి.. ముఖానికి లేదా జుట్టుకి పట్టించడం వల్ల.. అనేక ప్రయోజనాలు పొందవచ్చు. లేదా మెంతులను రాత్రంతా నానబెట్టి.. ఉదయం వాటిని వడకట్టి.. పేస్ట్ చేసుకుని తలకు పట్టించాలి. వడకట్టిన నీటిని జుట్టుని శుభ్రం చేసుకునేటప్పుడు చివరగా ఉపయోగించవచ్చు.

ఎగ్స్
ఎగ్ ని పగలగొట్టి.. చిక్కగా గొలకొట్టుకోవాలి. కొన్ని టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి.. జుట్టుకి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. ఎగ్ లో ఉండే ప్రొటీన్స్ జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

ఉసిరి
జుట్టు రాలడాన్ని నివారించడంలో ఉసిరి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి.. జుట్టుని బలంగా మార్చి.. చిట్లిపోవడాన్ని, జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. ఎండిన ఉసిరికాయలను నీటిలో ఉడికించి.. చల్లార్చాలి. ఈ నీటిని.. ఫైనల్ గా జుట్టుని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించాలి.

మందారం
జుట్టు రాలడాన్ని నివారించడంలో మందారం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే చిన్నవయసులోనే జుట్టు తెల్లబడటాన్ని కూడా అరికడుతుంది. అలాగే చుండ్రుని నివారిస్తుంది. కొన్ని మందారం పువ్వుల రెక్కలను క్రష్ చేసి.. కొబ్బరినూనెలో కలుపుకోవాలి. అంతే ఈ నూనెను తలకు పట్టిస్తూ ఉండాలి.

ఉల్లిపాయ రసం
జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ గా నివారించడంలో ఉల్లిరసం సహాయపడుతుంది. కొన్ని ఉల్లిపాయ ముక్కలను స్కాల్ప్ పై డైరెక్ట్ గా మసాజ్ చేయవచ్చు.

హెన్నా
హెన్నాను జుట్టు కండిషనింగ్ కి ఉపయోగిస్తారు. దీనివల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. హెన్నాను తరచుగా జుట్టుకి పట్టిస్తూ ఉండటం వల్ల అది షైనీగా మారడంతో పాటు, సాఫ్ట్ గా మారుతుంది. అలాగే.. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications