ఈ ఎమేజింగ్ హ్యాక్స్ తో డేమేజ్డ్ హెయిర్ సమస్యను తగ్గించుకోండి

Subscribe to Boldsky

హెయిర్ లో మూడు లేయర్స్ ఉంటాయి. లోపలి లేయర్ ని మెడ్యుల్లా అనంటారు. మధ్య లేయర్ ని కార్టెక్స్ అని అంటారు. అవుటర్ లేయర్ ని క్యూటికల్ అనంటారు. క్యూటికల్ అనేది హెయిర్ ను దెబ్బతినకుండా రక్షిస్తుంది. అయితే, హెయిర్ క్యూటికల్ అనేది దెబ్బతిన్నప్పుడు అనేక హెయిర్ సమస్యలు ఎదురవుతాయి.

హెయిర్ డ్రైగా అలాగే బ్రిటిల్ గా మారుతుంది. హెయిర్ లోని షైన్ తగ్గిపోయి, ఆకర్షణ తగ్గుతుంది. హెయిర్ టెక్శ్చర్ కఠినంగా మారుతుంది. స్ప్లిట్ ఎండ్స్, బ్రేకేజ్, ఇచీ స్కాల్ప్ వంటి సమస్యలు ఎదురవుతాయి. హెయిర్ లోని ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది.

Homemade Remedies To Treat Damaged Hair

డేమేజ్డ్ హెయిర్ ను మేనేజ్ చేయడం చాలా కష్టం. రఫ్ గా అలాగే చిక్కుగా తయారవడం వలన డేమేజ్డ్ హెయిర్ మెయింటెనెన్స్ కష్టంగా ఉంటుంది. హెయిర్ డేమేజ్ అవడానికి అనేక ఫాక్టర్స్ కారణమవుతాయి. ఎండలో ఎక్కువసేపు ఉండటం, కఠినమైన కెమికల్స్ ను వాడటం, బ్లో డ్రైయర్స్, కర్లింగ్ ఐరన్ వంటి స్టైలింగ్ టూల్స్ ను వాడటం క్లోరినేటెడ్ వాటర్ లో స్విమ్ చేయడం వంటివి హెయిర్ డేమేజ్ కి కారణమవుతాయి.

వీటితో పాటు కొన్ని థైరాయిడ్, హెరిడిటరీ ప్రాబ్లెమ్స్ మరియు మాల్ న్యూట్రిషన్ వంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా హెయిర్ డేమేజ్ కు కారణమవుతాయి. ఈ సమస్యను తొలగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. హోంమేడ్ నేచురల్ ప్రోడక్ట్స్ ని వాడటం ద్వారా ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. హోంమేడ్ ప్రోడక్ట్స్ అనేవి ఎప్పుడు సురక్షితమైనవి. అలాగే కెమికల్ ఫ్రీ కూడా. ఇవే, శిరోజాలకు చక్కటి పోషణను అందిస్తాయి.

కాబట్టి, ఈ ఆర్టికల్ లో 10 బెస్ట్ హోంమేడ్ రెమెడీస్ వివరాలను పొందుబరిచాము. వీటిని పాటించడం ద్వారా శిరోజాలను సంరక్షించుకోవచ్చు. ఇంటివద్దే, మీ హెయిర్ కు చక్కటి ట్రీట్మెంట్ ను అందించండి. ఈ హోంరెమెడీస్ ను పరిశీలించండి మరి.

1. ఎగ్ యోల్క్:

1. ఎగ్ యోల్క్:

ఎగ్స్ లో హెయిర్ ఫోలికల్స్ ను బలపరిచే ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా, హెయిర్ బ్రేకేజ్ అనేది అరికట్టబడుతుంది. ఎగ్ యోల్క్ లో విటమిన్ ఏ, ఈ మరియు బీ కాంప్లెక్స్ లు లభిస్తాయి. ఇవి హెయిర్ కు అలాగే స్కాల్ప్ కు మంచి చేస్తాయి. విటమిన్ ఏ అనేది స్కాల్ప్ లో సెబమ్ ప్రొడక్షన్ ను ప్రోమోట్ చేస్తుంది. తద్వారా హెయిర్ ను అలాగే స్కాల్ప్ ను మాయిశ్చరైజ్ చేస్తుంది. విటమిన్ ఈ తో పాటు బీ కాంప్లెక్ అనేది సర్క్యూలేషన్ ను మెరుగుపరచి ఆక్షీజన్ సప్లైను మెరుగుపరుస్తుంది. ఎగ్ యోల్క్ లో లభ్యమయ్యే ఫ్యాటీ యాసిడ్స్ అనేవి హెయిర్ ను మాయిశ్చరైజ్ చేసి హైడ్రేట్ చేయడానికి తోడ్పడతాయి. ఓపెన్ హెయిర్ క్యూటికల్ ని మూసివేసి రఫ్ మరియు ఫ్రిజ్జీ హెయిర్ ను స్మూత్ గా చేస్తాయి.

ఎలా వాడాలి:

• ఒక ఎగ్ యోల్క్ ను విస్క్ చేసి దాంతో స్కాల్ప్ పై కొద్దినిమిషాల పాటు మసాజ్ చేయాలి.

• తేలికపాటి షాంపూను అలాగే కండిషనర్ ను ఉపయోగించి చల్లటి నీటితో వాష్ చేయాలి.

• ఎగ్ యోల్క్ ని షాంపూలా వినియోగించడం ఇంకొక పద్దతి. ఇందుకోసం, మీరొక బీటెన్ ఎగ్ యొక్క ను తీసుకుని అందులో హెర్బల్ ఇన్ఫ్యూషన్ ను జోడించండి.

• ఈ మిశ్రమంతో మీ స్కాల్ప్ ను మసాజ్ చేసి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి.

• పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో రిన్స్ చేయండి.

2. హెన్నా:

2. హెన్నా:

హెన్నాలో హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేసే నేచురల్ ఇంగ్రీడియెంట్స్ కలవు. ఇవి హెయిర్ ఫాల్ ను తగ్గిస్తాయి. ఇది ఎక్సెలెంట్ కండిషనర్ గా పనిచేస్తుంది. హానికర యూవీ రేస్ ను బ్లాక్ చేసే సామర్థ్యం హెన్నాలో కలదు. తద్వారా, హెయిర్ డేమేజ్ ను తగ్గిస్తుంది. హెన్నా అనేది శిరోజాల లోతుల్లోకి ప్రవేశించి హెయిర్ కు పోషణను అందిస్తుంది. తద్వారా, హెయిర్ బ్రేకేజ్ ను తగ్గిస్తుంది.

ఎలా వాడాలి:

• ఒక పాత్రలో, ఒక కప్పుడు హెన్నా పౌడర్ ను, ఒక టేబుల్ స్పూన్ తాజా అలోవెరా జెల్, రెండు టీస్పూన్ల పెరుగు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేయాలి.

• ఈ మిశ్రమాన్ని హెయిర్ పై అప్లై చేసే ముందు కొబ్బరి నూనెను హెయిర్ కు పట్టించాలి. హెయిర్ ను విడదీసి ఈ పేస్ట్ ను హెయిర్ మొదళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించాలి. గ్లోవ్ ని వాడటం మరచిపోకండి.

• ఇలా 45 నిమిషాల నుంచి గంట పాటు ఉంచాలి. ఎక్కువ సేపు ఉంచితే మీకు జలుబు వచ్చే ప్రమాదం ఉంది.

• ఆ తరువాత తేలికపాటి షాంపూతో అలాగే సాధారణ నీటితో మీ హెయిర్ ను వాష్ చేసుకోండి.

• ఈ రెమెడీని పదిహేను రోజులకు ఒకసారి పాటిస్తే స్మూత్ మరియు షైనీ హెయిర్ మీ సొంతం అవుతుంది.

3. కొబ్బరి నూనె:

3. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది హెయిర్ కు మంచిది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. కొబ్బరినూనెకు హెయిర్ డేమేజ్ ను ఫిక్స్ చేసే సామర్థ్యం కలదు. ఈ ఆయిల్ అనేది కుదుళ్ళలోకి ప్రవేశించి హెయిర్ డేమేజ్ ను తగ్గిస్తుంది. తద్వారా, మీ హెయిర్ ఆరోగ్యకరంగా అలాగే స్మూత్ గా మారుతుంది.

ఎలా వాడాలి:

• ప్రతి రోజూ మీ స్కాల్ప్ ని ఐదు నిమిషాల పటు వెచ్చటి కొబ్బరి నూనెతో మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి.

• తేలికపాటి షాంపూతో మీ హెయిర్ ను వాష్ చేసుకోండి.

• లేదా మూడు టేబుల్ స్పూన్ల వెచ్చటి కొబ్బరి నూనెలో పావు కప్పుడు తేనెను కలపండి. వీటిని బాగా కలపాలి.

• ఈ మిశ్రమాన్ని తడి జుట్టుపై అప్లై చేయండి.

• ఈ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు ఉండనివ్వాలి.

• గోరువెచ్చటి నీటితో రిన్స్ చేసుకోవాలి.

• ఇలా వారానికి ఒకసారి చేయాలి.

4. అలోవెరా:

4. అలోవెరా:

అలోవెరాలో ఉన్న యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ వలన డాండ్రఫ్, బ్రిటిల్ హెయిర్ సమస్య తగ్గుతుంది. అలోవెరా హెయిర్ కండిషనర్ లా పనిచేస్తుంది. ఇది హెయిర్ లోని వాటర్ మరియు మాయిశ్చర్ లెవెల్ ని నిలిపి ఉంచుతుంది. డేమేజ్డ్ హెయిర్ ను ట్రీట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఎలా వాడాలి:

• అలోవెరా జ్యూస్ ను నేరుగా డేమేజ్డ్ హెయిర్ కు అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.

• ఆ తరువాత గోరువెచ్చటి నీటితో వాష్ చేయండి.

• లేదా 4 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 3 టేబుల్ స్పూన్ల ప్లెయిన్ యోగర్ట్ మరియు రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలిపి ఒక మిశ్రమాన్ని తయారుచేయండి.

• ఈ మిశ్రమాన్ని హెయిర్ కు అప్లై చేసి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.

• నార్మల్ వాటర్ తో అలాగే తేలికపాటి షాంపూతో హెయిర్ ను వాష్ చేసుకోండి.

• ఈ ప్రాసెస్ ని వారానికి ఒకసారి పాటించాలి.

5. హైబిస్కస్:

5. హైబిస్కస్:

హైబిస్కస్ మొక్క యొక్క ఆకులు అలాగే పూవులు హెయిర్ గ్రోత్ కి అలాగే డేమేజ్డ్ హెయిర్ ను రిపెయిర్ చేయడానికి తోడ్పడతాయి. హెయిర్ ను కుదుళ్ళ నుంచి బలపరచి హెయిర్ కండిషన్ గా పనిచేస్తుంది. స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇరిటేటెడ్ స్కాల్ప్ సమస్యను తగ్గిస్తుంది. డాండ్రఫ్ పై పోరాటం జరుపుతుంది.

ఎలా వాడాలి:

• 15-20 హైబిస్కస్ ఆకులను బ్లెండర్ లో వేసి పేస్ట్ లా తయారుచేసుకోండి.

• ఈ పేస్ట్ ను నేరుగా హెయిర్ పై అప్లై చేసి 20-30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

• లేదా 15-20 హైబిస్కస్ పూవులను 4 ఎగ్స్ తో కలిపి బ్లెండర్ లో వేసి స్మూత్ పేస్ట్ ను ప్రిపేర్ చేయండి.

• ఈ పేస్ట్ ను స్కాల్ప్ పై అప్లై చేసి 20-30 నిమిషాల వరకు అలాగే ఉంచాలి.

• తేలికపాటి షాంపూతో హెయిర్ ను రిన్స్ చేయాలి.

• ఈ ప్రాసెస్ ను వారానికి ఒకసారి పాటిస్తే ఫ్రిజ్ ఫ్రీ హెయిర్ మీ సొంతం అవుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Homemade Remedies To Treat Damaged Hair

    Damaged hair is difficult to manage, as it becomes rough and tangled - the reason being too much exposure to hot sun, use of harsh chemicals, excessive use of styling tools like blow dryers, curling iron, etc. Egg yolk, henna, coconut oil, hibiscus, amla, avocado, etc., could work wonders for your hair, leaving them healthy and frizz-free.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more