For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బట్టతల ప్యాచెస్ పై జుట్టు తిరిగి పెరిగేలా చేయటం ఎలా?

బట్టతల ప్యాచెస్ పై జుట్టు తిరిగి పెరిగేలా చేయటం ఎలా?

|

మగవాళ్ళు,ఆడవాళ్ళు ఎవరైనా సరే, తలపై పడే బట్టతల ప్యాచెస్ వల్ల అందరికీ సిగ్గుగానే ఉంటుంది. ఈ సమస్య వల్ల ఆత్మవిశ్వాసం తగ్గటమే కాక, బయటకి ఎవరితో కలవలేకపోతారు. ధైర్యం తగ్గిపోయి మన సామాజిక జీవితం దెబ్బతింటుంది.

ఈ బట్టతలకి మన జీవన విధానంలో మార్పులు, ఒత్తిడి ఎక్కువుండే ఆఫీసు పనులు, టెన్షన్, ఎండలో తిరగటం, హార్మోన్లలో అసమతుల్యత, రసాయనాలు వాడకం మొదలైనవి కారణాలు కావచ్చు.

How To Grow Hair On The Bald Patches On Head?

బట్టతల ఎక్కడైనా రావచ్చు; నుదురు మీద, మాడుకి వెనకవైపు మొదలైన చోట్ల ఎక్కడైనా రావచ్చు. కానీ ఈ ప్రదేశాలలో జుట్టును తిరిగి మొలిచేలా చేయటం అసాధ్యమేం కాదు.

సరైన సంరక్షణ, సహజ చిట్కాలు జుట్టు మళ్ళీ వచ్చేలా సాయపడతాయి. ఈ ఆర్టికల్ లో , మనం ఈ బట్టతల ప్యాచెస్ లో జుట్టు తిరిగిరావటానికి కొన్ని సహజ ఇంటి చిట్కాలను చర్చిద్దాం.

తేనె

తేనె

తేనె అందానికి సంబంధించి ఇచ్చే లాభాలు అందరికీ తెలిసినవే. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ,ఇతర లక్షణాలు చర్మంపైనే కాదు, జుట్టు పెరగటంలో కూడా సాయపడతాయి.

ఎలా చేయాలి ;

మొదటగా ఏమన్నా మురికి ఉంటే వదిలించుకోటానికి తలస్నానం చేయండి. ఆరాక, కొంచెం తేనెను సమస్య ఉన్నచోట్ల కుదుళ్ళ నుంచి కొసల వరకూ పట్టించండి. కొద్దినిమిషాలు మసాజ్ చేసి 30 నిమిషాలు వదిలేయండీ. మొదటగా జుట్టును మామూలు నీళ్లతో బాగా కడగండి. వారంలో 2-3 సార్లు ఈ చిట్కాను పాటించండి.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు పెరిగేలా సాయపడుతుంది.ఇది రక్తప్రసరణను కూడా పెంచి జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది.

ఎలా చేయాలి;

2-3 ఉల్లిపాయలను తీసుకుని గట్టి పేస్టులా మిక్సీ పట్టండి. ఈ పేస్టును బట్టతల ప్యాచెస్ పై పట్టించి 10 నిమిషాలపాటు మసాజ్ చేయండి. గంట సేపు అలానే వదిలేయండి. తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయండి.

గుడ్డు మాస్క్

గుడ్డు మాస్క్

జుట్టు వేగంగా పెరగటానికి ప్రొటీన్ అవసరం. ఈ గుడ్డుతో కూడిన ప్రొటీన్ మాస్క్ మీకు దీనికే సాయపడుతుంది.

కావాల్సిన వస్తువులు;

1 గుడ్డు సొన

2చెంచాల నిమ్మరసం

1చెంచా ఆలివ్ నూనె

ఎలా చేయాలి;

గుడ్డు సొనను గుడ్డునుంచి వేరుచేయండి. బాగా గిలకొట్టండి. 1చెంచా తాజా నిమ్మరసాన్ని, 1చెంచా ఆలివ్ నూనెను వేయండి.అన్నిటినీ బాగా కలపండి. ఈ మాస్క్ ను మీ మాడుకు, బట్టతల వచ్చినచోట రాయండి. దీన్ని షవర్ క్యాప్ తో కప్పేసి గంటసేపు అలానే వదిలేయండి. మైల్డ్ షాంపూతో కడిగేయండి. వేగవంతమైన ఫలితాల కోసం వారానికి రెండుసార్లు ఇలాచేయండి.

ఆలివ్ నూనె

ఆలివ్ నూనె

ఆలివ్ నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ బట్టతల ప్రాంతంలో జుట్టు తిరిగి మొలిచేలా చేస్తాయి.

ఎలా చేయాలి ;

ఈ చిట్కాకు మీకు కావాల్సినదల్లా 1చెంచా ఆలివ్ నూనె, 1చెంచా తేనె, 1చెంచా దాల్చిన చెక్క పొడి. ఈ మూడు పదార్థాలను కలిపేసి కొంచెం వెచ్చబెట్టండి. దీన్ని మీ జుట్టుకి, ముఖ్యంగా బట్టతల ప్యాచెస్ వచ్చినచోట రాయండి. 20-30 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయండి.

కరివేపాకు

కరివేపాకు

కరివేపాకులు జుట్టు పెరగటానికి, జుట్టు ఊడిపోవటాన్ని తగ్గించటానికి ప్రాచీనకాలం నుంచి వాడుతున్న చిట్కా. ఇందులో ఉండే అమినోయాసిడ్లు దీనికి సాయపడతాయి.

ఎలా చేయాలి;

కొన్ని కరివేపాకులను ఎండలో ఎండబెట్టండి. వీటిని పొడిలా చేయండి. కొంచెం కొబ్బరినూనె లేదా ఆముదం నూనెను వేసి పేస్టులా చేయండి. ఈ పేస్టును నేరుగా జుట్టుకి, బట్టతల వచ్చిన ప్రాంతంలో రాయండి. అరగంట అలానే వదిలేసి చల్లనీరుతో కడిగేయండి. వారంలో రెండుసార్లు ఇదే చిట్కా పాటించండి.

 నల్ల మిరియాలు

నల్ల మిరియాలు

నల్ల మిరియాలు జుట్టు పెరగటం కోసం బాగా పనిచేస్తాయి, రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

ఎలా చేయాలి;

మీకు కావాల్సిందల్లా మిరియాల పొడి,నిమ్మరసం మాత్రమే. రెండిటినీ కలిపి పేస్టును తయారుచేయండి. దీన్ని బట్టతల ఉన్న ప్రాంతంలో రాసి,15-20 నిమిషాలు అలానే ఉండనివ్వండి. 20నిమిషాల తర్వాత చల్లనీరుతో కడిగేయండి.

కొబ్బరి పాలు

కొబ్బరి పాలు

కొబ్బరిపాలు జుట్టు ఊడిపోవటాన్ని తగ్గించటమే కాదు; జుట్టుకి పోషణనిచ్చి మృదువుగా, కాంతివంతంగా చేస్తాయి.

ఎలా చేయాలి;

1/4కప్పు కొబ్బరిపాలను 1చెంచా తేనె ఇంకా 2 చెంచాల ఫ్లేవర్ లేని పెరుగుకు కలపండి.ఇవన్నీ బాగా కలపండి. ఈ పేస్టును సమస్య ఉన్నచోట రాసి 30 నిమిషాలు వదిలేయండి. 30 నిమిషాల తర్వాత మామూలు నీటితో కడిగేయండి. ఈ చిట్కాను ప్రతి వారం పాటించి ఫలితాలు చూడండి.

వంటసోడా

వంటసోడా

కొన్నిసార్లు, చుండ్రు అలాగే దురదపెట్టే మాడు కూడా జుట్టు ఊడిపోవడానికి దారితీస్తుంది.వంటసోడా ఇవి తగ్గించటానికి సాయపడుతుంది.అలా జుట్టు కూడా మళ్ళీ పెరుగుతుంది.

ఎలా చేయాలిః

మీ మాడును కొంచెం వంటసోడాతో,హెన్నా పౌడర్, రెగ్యులర్ గా వాడే షాంపూతో రుద్దుకోండి. అలా 30 నిమిషాలు వదిలేయండి. అరగంట తర్వాత మామూలు నీళ్ళతో మళ్ళీ షాంపూ చేసుకోండి. ఈ చిట్కాను వారానికోసారి పాటిస్తే మెరుగైన,వేగవంతమైన ఫలితం కన్పడుతుంది.

బీట్ రూట్ ఆకులు

బీట్ రూట్ ఆకులు

బీట్ రూట్ లో జుట్టు బలంగా పెరగటానికి కావాల్సిన అన్ని పోషకాలు,విటమిన్లు ఉంటాయి.

ఎలా చేయాలి;

చేతిలో పట్టినన్ని బీట్ రూట్ ఆకులు తీసుకోండి. 1 కప్పు నీటిలో మరిగించండి. అవి మెత్తగా అవుతున్నాక, మిక్సీ పట్టి గట్టి పేస్టులా తయారుచేయండి. 2చెంచాల హెన్నా పౌడర్ ను ఈ పేస్టుకు కలపండి. దీన్ని మీ తల మాడుకి, జుట్టుకి రాయండి. అరగంట అలా వదిలేసి మామూలు నీళ్ళతో కడిగేయండి.

English summary

How To Grow Hair On The Bald Patches On Head?

Bald patches on the head can be embarrassing for all of us out there, irrespective of the gender. This not only makes us conscious but also is something that refrains us from a public get-together. It is something that makes us lose out on our confidence and affects our social life.
Desktop Bottom Promotion